Breaking News

మనమంతా హిందువులం - బంధువులై మెలగుదాం - Manamantha Hinduvulam


మనమంతా హిందువులం - బంధువులై మెలగుదాం 
ప్రతి పల్లెలో సమన్వయం సద్భావం చాటుదాం!!

1.మానవునిలో మాధవుణ్ణి దర్శించినదీ దేశం
  సమాజ రూపి ఈశ్వరుణ్ణి సేవించినదీ ధర్మం
  ఆలయాన వెలసిన ఆ దేవుని పద సన్నిధిలో 
  అంతరాలు మరచి మనం అర్చన కొనసాగిద్దాం !! మనమంతా 

2.నింగి,నిప్పు,నేల,గాలి, జలం దైవ ప్రసాదం
  అందరికవి అందినప్పుడే జన జీవన వికాసం
  జల వనరుల వాడుకలో కులమెందుకు ప్రమేయం 
  ప్రకృతి తల్లి ఒడిలోన మనమంతా సమానం     !! మనమంతా

3.పునరపి జననం మరణం - విధి విధాత నిర్ణయం
  శివుని రుద్రభూమిలోన అందరికీ అవకాశం
  అందరి అంతిమ గమనం - అంత్యక్రియ సంస్కారం
  అంతరాలు వదిలేద్దాం - సమరసతను సాధిద్దాం  !! మనమంతా

1 comment:

  1. మనమంతా హిందువులం - బంధువులై మెలగుదాం - Manamantha Hinduvulam

    ReplyDelete