Indian army song in telugu సరిహద్దుల్లో దేశం కోసం కాపలా నే కాస్తా | Sarihaddullo desam kosam lyrics in telugu
సాకీ :
ఎముకలు కొరికే మంచు కొండలలో..
కొన ఊపిరి వరకు తిరగబడే
భయాలనే భయపెట్టే సైనికులం
ఈ భారత మాతకు సేవకులం
పల్లవి :
సరిహద్దుల్లో దేశం కోసం కాపలా నే కాస్తా...
హద్దులు దాటే శత్రుమూకలను మట్టిని కరిపిస్తా ...
1. విజయ పతాకం ఎగరేస్తూనే ఇంటికి తిరిగోస్తా.లేదా దేహం చుట్టు జెండా చుట్టి శవమై నేనొస్తా..వస్తూ విజయం కొని తెస్తా..
2. తలలే తెగినా..తలను వంచక పోరును సాగిస్తా తలవంపు తేక తల్లి భారతిని భుజాల నే మోస్తా..కీర్తిని జగమున చాటిస్తా
3. తుపాకీ గుండ్లతో శరీరమంతా తూట్లు పొడుస్తున్నా..
భారత సీమలు చెదిరి పోకుండ రక్తం పారిస్తా..అమ్మకు అభిషేకం చేస్తా
4. సంకట స్థితిలో రెండో మాటకు తావే లేదంటా..
దేశ రక్షణలో నేనే దేశం..దేశం నేనంటా..జనం గుండెలో నేనుంటా
సరిహద్దుల్లో దేశం కోసం కాపలా నే కాస్తా
ReplyDelete