Breaking News

రాములోరి గుడి కడదాం చలోచలో - Ramulori Gudi Kadadam Song Lyrics in Telugu


 


పల్లవి:
వాల్మీకీ రాసిన ఈ కథ వినుడీ - రాముని గుడి కోసమే ఈ సందడి
రాములోరి గుడి కడదాం చలోచలో
రామరాజ్య బాటలోన చలోచలో !!
1. రాముడు చేపట్టెనదే జానకీ
మాట మీద బాటవట్టె అడవికి
అడవిరాజు గుహుని కౌగిలించెనా
రాయితాకి అహల్యగా మార్చెనా !!
2. సీతపోతె చెట్టు పుట్ట వెతికెన
రాముడు లేకుండా సీత బ్రతుకున
దహనక్రియలు జరిపేను పక్షికి
స్నేహం అందించె కోతిమూకకి !!
3. శబరిచ్చిన పండ్లు ఆరగించెన
చిట్టి ఉడుత సాయానికి మెచ్చెన
చూడమంటె హనుమ కాల్చివచ్చెన
విభీషణుడు రామశరణు జొచ్చెన !!
4.రావణుని కొట్టి లంక ముట్టలె
వాలిని వధియించి కుర్సి ఎక్కలె
కన్నతల్లి కన్నవూరు మరువలె
పదహారు సద్గుణాల రాశిలె !!
5.రామరాజ్యమందు కరువులేదుర
దొంగ దోపిడీలు కానరావులె
రాముడంటె ప్రజలకెంతొ ప్రేమరా
ప్రాణులన్ని సుఖముగ జీవించెర !!
6.శ్రీ రాముని నోటినిండ సత్యమె
రాములోరి మార్గమంత ధర్మమె
నీకు నాకు నచ్చిమెచ్చినాడుర
జగమంతా శ్రీ రాముని భక్తులె !!

1 comment:

  1. Lord Rama Teenmar Song in Telugu | Ramulori Gudi Kadadam | రాములోరి గుడి కడదాం | Lord Rama Songs

    ReplyDelete