రాములోరి దండోరా - Ramulori Dandora Song Lyrics in Telugu
దండోర దండోరా దండోరా ఇది రాములోరి దండోరా...
దండోరా దండోరా దండోరా ఇక ఊరువాడ కదలాల
ఇన్నాళ్ళకు పులకించే రఘురాముడి ఈ నేల
కోటి గొంతుకుల కోరిక ఒకటయ్యి నిలిచేలా
చేయి చేయి కలుపుదాం – రాముడి గుడి కట్టుదాం
అయోధ్యపురి వైభవాన్ని ప్రపంచాన చాటుదాం
పెళపెళమని శివధనువు
వరించే సీత వధువు
సంహరించే రావణుని
కొలిచే జనులు శ్రీరాముని
ఒకే మాట ఒకే బాణం
ఒకే భార్యతో రాజుగా
నేలను ఏలెను స్వామి
ధర్మానికి తను హామి
అలనాటి అయోధ్యయే ఆదర్శం ఈ జగతికి
రామరాజ్య స్థాపనకు నాంది ఈ మందిరం
చేద్దాం ఉడతా సాయం
పొందగ రాముడి అభయం
శబరి కన్నా ప్రేమతో శ్రీరాముని సేవిద్దాం
రామరాజ్య పాలనను గ్రామ గ్రామమందు చూడ
హనుమంతుని గుండెగుడిని కోవెలగా మారుద్దాం
చేయి చేయి కలుదాం – రాముడి గుడి కట్టుదాం
దండోర దండోరా దండోరా ఇది రాములోరి దండోరా...
ReplyDeleteదండోరా దండోరా దండోరా ఇక ఊరువాడ కదలాల...