రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి? - Ayodhya Ram Mandir Court Cases
మర్యాదాపురుషోత్తముడైన శ్రీరామచంద్రుని
జన్మస్థలమైన అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మించుకోవడం కోసం హిందువులు
500ఏళ్ళపాటు పోరాటం చేయవలసి వచ్చింది. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత చివరికి
మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆగస్ట్ 5న మందిర నిర్మాణానికి
భూమిపూజ జరుగుతుంది. ఈ సందర్భంగా రామజన్మభూమి గురించి సాగిన న్యాయపోరాట
చరిత్రను పరిశీలిద్దాం.
అలహాబాదు హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్ లోని ముగ్గురు న్యాయమూర్తులు
1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ
2. జస్టిస్ సుధీర్ అగర్వాల్
3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్
1. జస్టిస్ ధరమ్ వీర్ శర్మ
2. జస్టిస్ సుధీర్ అగర్వాల్
3. జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్
తీర్పు ఇచ్చిన తేది: 2010 సెప్టెంబరు 30
తీర్పు వివరాలు:
* మొత్తం ప్రదేశం దాదాపుగా 1,480 చదరపు గజాలు లేదా 13,320 చదరపు అడుగులు.
* ముగ్గురిలో ఇద్దరు న్యాయమూర్తులు తలా 1/3 వ వంతు ప్రదేశాన్ని ముగ్గురు ఫిర్యాదుదారులైన నిర్మోహి అఖాడా, ముస్లింలు, మరియు రాంలాలాకు కేటాయిస్తూ తీర్పు చెప్పారు. సున్ని వక్ఫ్ బోర్డ్ దావాను న్యాయస్థానం కొట్టివేసింది.
* వివాదిత స్థలం చుట్టుపక్కల 70 ఎకరాల భూమిని భారత ప్రభుత్వం సేకరించింది. ఈ భూమి వివాదిత ప్రాంతమే అయినా భారత ప్రభుత్వపు అధినంలోకి వెళ్ళిపోయింది.
* అయినా సరే అలహాబాద్ హైకోర్టు కు చెందిన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన లక్నో బెంచ్ ఈ వాదవివాదాలను వినడం జరిగింది. ఒక ట్రయల్ కోర్టులా ముగ్గురు న్యాయమూర్తులు తమ తీర్పులను వేర్వేరుగా వ్రాసి, ప్రకటించారు.

జస్టిస్ ధరమ్ వీర్ శర్మ తీర్పులోని ముఖ్య విషయాలు –
1. వివాదాస్పద స్థలంగా పేర్కొంటున్న స్థలం ప్రభు శ్రీరామచంద్రుడి
జన్మస్థలం. జన్మస్థలం ఒక చట్టబద్ధమైన వ్యక్తి మరియు ఒక దేవుడికి
సంబంధించినది. ప్రభు శ్రీరామచంద్రుడు బాలుడి రూపంలో
పూజలందుకుంటున్నప్రదేశాన్ని పవిత్ర జన్మస్థలంగా భావిస్తున్నారు. పవిత్రత తో
కూడిన దైవీ భావన ఎల్లవేళలా అన్నిచోట్లా ఎవరిద్వారానైనా, ఆయా వ్యక్తుల
భావాలకనుగుణంగా ఏ ఆకారంలోనైనా లేదా ఆకార రహితంగాను జాగృతం కావచ్చు.
2. వివాదాస్పద కట్టడం బాబర్ ద్వారా నిర్మించబడింది, ఏ సంవత్సరంలో అనేది
స్పష్టంగా లేకున్నా అది స్థానిక ముస్లింల ఇష్టానికి వ్యతిరేకంగా
నిర్మించబడింది. అయితే, దానికి మసీదుకుండాల్సిన లక్షణాలేవీ లేవు.
3. వివాదాస్పద కట్టడాన్ని ఆ ప్రదేశంలో అంతకు ముందే ఉన్న పాత కట్టడాన్ని
ధ్వంసం చేసి కట్టారు. భారత పురాతత్వ శాఖ ఆ పాత కట్టడం బృహత్తరమైన హిందూ
ధార్మిక కట్టడం అనే విషయాన్ని నిర్ధారించింది.
4. దీంతో దావాలో పేర్కొనబడిన ఆస్తి రామచంద్రుడి జన్మభూమికి
సంబంధించినదని నిరూపితమైంది. అలా ఆ స్థలంలో హిందువులు చరణ్, సీతా రసోయి,
మరియు ఇతర విగ్రహాలను పెట్టి పూజించడం జరిగిందన్నదీ వాస్తవమే. అనాదికాలం
నుండి హిందువులు ఆ వివాదంలో ఉన్న స్థలాన్ని దేవుడి జన్మస్థలంగా భావిస్తూ ఆ
పవిత్రస్థలానికి తీర్థయాత్రలు చేయడం నిర్ధారణ అయింది. వివాదిత కట్టడం
నిర్మాణమయ్యాక 22/23 .12.1949 ( డిశంబర్ 22/23 , 1949 ) తేదీలలో వివాదిత
కట్టడం లోపల విగ్రహాలను ప్రతిష్టించారని కూడా నిర్ధారణ అయింది. అంతేగాక
కేవలం వివాదిత కట్టడపు బాహ్య ప్రదేశంలోనే గాక, అంతర్గత ప్రదేశంలోనూ
హిందువులు తమ పూజాదికాలు నిరంతరంగా జరుపుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు
వివాదిత కట్టడాన్ని ఎప్పుడూ కూడా ఒక మసీదుగా స్థానిక ముస్లింలు
భావించనేలేదు.
జస్టిస్ సిబాఘతుల్లా ఖాన్ తీర్పు లోని ముఖ్య అంశాలు –
1. వివాదిత స్థలం, అందులోని నిర్మాణం బాబర్ కుగానీ లేదా అక్కడ మసీదు కట్టాలని ఆదేశించినవారికిగానీ చెందినదని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అదే విధంగా మసీదు అనబడే వివాదాస్పద కట్టడం ఎవరి ఆజ్ఞల ద్వారా కట్టబడలేదు అని నిరూపించబడినది.

జస్టిస్ సుధీర్ అగర్వాల్ తీర్పు సారాంశం లో కొన్ని కీలక అంశాలు –
అయోధ్య లో వివాదాస్పద కట్టడం మధ్య గుమ్మటం/కప్పు క్రింద ఉన్నప్రదేశం కోట్లాది హిందువుల విశ్వాసం, నమ్మకం ప్రకారం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్ర మూర్తి జన్మస్థలం.
అయోధ్య లో వివాదాస్పద కట్టడం మధ్య గుమ్మటం/కప్పు క్రింద ఉన్నప్రదేశం కోట్లాది హిందువుల విశ్వాసం, నమ్మకం ప్రకారం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్ర మూర్తి జన్మస్థలం.
త్రిసభ్య ధర్మాసనం ఏ అంశాలు,సాక్ష్యాలు పరిగణలోనికి తీసుకుంది?
విచారణలో న్యాయమూర్తులు తీర్పుకి ఆధారాలుగా ,అప్పటి ముస్లిం గ్రంధాలూ,ముస్లిం వక్ఫ్ చట్ట ప్రతులు, హిందూ మత గ్రంధాలలో అయోధ్య రామ మందిర ప్రస్తావనలు, స్కంద పురాణం, హిందూ రచనలలో అయోధ్య ఉల్లేఖనలు,ముస్లిం చరిత్ర కారులు పొందుపరిచిన చరిత్రక విషయాలు ,ఆ కాలంలో ఫ్రెంచ్ మత గురువు జోసెఫ్ టేఫ్లాంతర్ అయోధ్య ని దర్శించి తన డైరీ పుటల్లో పొందుపరిచిన వాస్తవాలు,అయోధ్య పైన బ్రిటిష్ అధికారుల గెజెట్ లు ,బ్రిటిష్ రచయితల రచనలు,ఎంసైక్లోపీడియా బ్రిటానికా,అయోధ్య వివాదస్పద కట్టడం వద్ద దొరికిన శిల్ప ఆకృతులు,శిలాశాసనాలు, గ్రౌండ్ పెనిట్రెటింగ్ రాడార్ నివేదిక (రాడార్ ద్వారా భూగర్భ పరిశీలనా నివేదిక), జాతీయ పురావస్తు శాఖ వారు జరిపిన ఉపగ్రహ ఆధారిత తవ్వకాల సర్వేలో బయటపడిన పురాతన శాసనాల నివేదిక,సుమారు 85 మంది వ్యక్తులు చెప్పిన విషయాలు, రికార్డులు పరిగణలోకి తీసుకొని తీర్పు వెలువరిస్తారు.

ఈ వాజ్యంలో శ్రీ రాముడిదే గెలుపు.. ఎందుకంటే?
ప్రాణ ప్రతిష్ట చేసిన శ్రీ రామచంద్ర విగ్రహం,ఒక సజీవ దైవ స్వరూపము. చట్ట ప్రకారం తన వాదన తానే వినిపించగలదు. కానీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీ రాముడు బాల రాముడు. చట్టం ప్రకారం మైనర్ కాబట్టి న్యాయ పోరాటాలలో తన వాదన వినిపించటానికి సంరక్షకుడు(గార్డియన్)అవసరం. అలహాబాద్ న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి స్వర్గీయ దేవకీ నందన్ అగర్వాల్ శ్రీ రామచంద్రుని స్నేహితుడిగా ఆయన తరఫున న్యాయస్థానంలో రామజన్మభూమి కోసం వ్యాజ్యం వేశారు. హిందూ మత గ్రంధాలు,మరియు ప్రస్తుత చట్టం ప్రకారం శ్రీరామచంద్రుడు ఆస్థి కలిగి ఉండవచ్చు. ఆ ఆస్థి మీద ఎవరికి హక్కు ఉండదు అని చట్టం తెలియచేస్తోంది.

ఇదే కాకుండా ఆ ప్రదేశం మర్యాద పురుషోత్తమ శ్రీ రామ చంద్రుడి జన్మస్థానం.
ఆ మొత్తం ప్రదేశమే ఒక పుణ్య తీర్థం. అతి పూజనీయం. కనుక ఆ ప్రదేశం
న్యాయపోరాటానికి పూర్తిగా తగినది. ఈ హక్కుని వేల సంవత్సరాల నుంచి హిందూ మత
గ్రంధాలు విపులంగా ప్రస్తావించాయి. అలాగే మన న్యాయ స్థానాలు కూడా ఈ
విషయాన్ని అంగీకరించాయి.
న్యాయస్థానం సున్నీ వక్ఫ్ బోర్డు వాజ్యం ఎందుకు తిరస్కరించింది ?
ఇస్లామిక్ ధార్మిక గ్రంధాలు , షరియా చట్టాల ప్రకారం ఇతరుల ఆస్థి (విగ్రహం వున్న ప్రదేశం లో కానీ,గర్భ గుడి ,లేదా ఇతరుల దేవాలయ అవశేషాలు /లేదా దేవాలయ స్థలం) వక్ఫ్ ఆస్థిగా పరిగణించటానికి అనుమతి లేదు. అలాగే ఇతర ధార్మిక స్థలంలో చేసే నమాజు అల్లాహ్ ప్రార్ధనగా అంగీకరించరు. దీనినిబట్టి 3 గుమ్మటాల కట్టడానికి గుర్తింపు లేనట్టే.

అదే విధంగా బాబర్ కానీ, అతని సైన్యాధ్యక్షుడు మీర్ బాకీ కానీ ఈ
వివాదస్పద స్థలానికి యజమానులు కాదు. కాబట్టి ఇస్లామిక్ గ్రంధాలు మరియు
చట్టాల ప్రకారం వేరొకరి ఆస్థిని అల్లాహ్ కి సమర్పించలేరు.
ఈ వివాదాస్పద ప్రదేశం 1528 నుండి ముస్లిం ఆక్రమణ /ఆధిపత్యంలో ఉందని
చర్చ కోసం అనుకున్నా, హిందువులు దానికోసం పోరాటం ఎప్పుడు ఆపలేదు. శతాబ్దాల
తరబడి ఒకరి అనధికార ఆక్రమణ లో వున్నా ఆ స్థలం మీద యాజమాన్యపు హక్కు
పొందలేరు.
అదే కాకుండా వక్ఫ్ బోర్డు తన వాదనలో ఎవరి స్థలాన్ని బాబర్ ఆక్రమించాడు? ఆ
స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నట్లు అసలు యజమానికి తెలియచేసాడా అనే
విషయాలు వక్ఫ్ బోర్డు న్యాయస్థానానికి తెలియచేయాలి.
అదేవిధంగా ఇస్లాం మతంలో మసీదుకు ప్రాముఖ్యత లేదని, అల్లాహ్ కి నమాజ్
ఎక్కడైనా చెయ్యవచ్చని, బహిరంగ ప్రదేశంలో కూడా నమాజ్ చెయ్యటానికి ఇస్లాం
అనుమతి ఇస్తుందని సుప్రీం కోర్ట్ ఇటీవల స్పష్టం చేసింది. అలాగే న్యాయస్థానం
ఆ వివాదాస్పద స్థలానికి వక్ఫ్ బోర్డుని యజమానిగా అంగీకరించటం లేదు. అదే
విధంగా వివాదాస్పద కట్టడం మసీదుగా కూడా ఇస్లాం ప్రకారము ఆమోదనీయం కాదు.
పైన కారణాలు /ఆధారాలు /అధిక కాల యాపన దృష్ట్యా వక్ఫ్ బోర్డ్ వేసిన వాజ్యం సంఖ్య 4ను గౌరవనీయ న్యాయస్థానం కొట్టి వేసింది.
ఆల్ ఇండియా బాబ్రీ మసీద్ యాక్షన్ కమిటీ సమర్పించిన సాక్ష్యాలను
పరిశీలించాక, అవేవీ సాక్ష్యాలుగా ఉపయోగపడే పత్రాలు కావని, రాజకీయ వాసనలున్న
కొందరు వ్యక్తులు సమర్పించిన కాగితాలేనని తేలింది. బాబర్ గానీ లేదా మరే
ఇతర ముస్లిం సేనాధిపతి గానీ అయోధ్యలో ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించి ,
మసీదు నిర్మాణం చేయడానికి ఆజ్ఞాపించాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని
తేలింది.
బౌద్ధం శ్రీరాముడికి వ్యతిరేకం అని చూపడానికి కూడా ఎలాంటి ఆధారమూ లేదు.
బౌద్ధ ఆఖ్యానాలలో శ్రీరాముడి కథ ఉంది. శ్రీరాముడిలాగే బుద్ధుడు కూడా
ఇక్ష్వాకు వంశానికి చెందినవాడని గొప్పగా చెప్పబడింది. రామాయణం వేర్వేరు
విధాలుగా గ్రంథస్థం కావడం వల్ల, ప్రతివాదులు (వక్ఫ్ బోర్డ్) అసలు రామాయణపు
అస్థిత్వాన్నే ప్రశ్నించడానికి ప్రయత్నించారు. అయితే తమ ఈ వాదనకు కూడా తగిన
ఆధారాలు చూపలేకపోయారు. బైబిల్ పుట్టుక గురించి రెండు వేర్వేరు కథలు
ఉన్నాయి. ఏసుక్రీస్తు గురించి రెండు వేర్వేరు వంశావళిలు పేర్కొనబడ్డాయి.
నిజానికి ఏసు క్రీస్తు జీవితం గురించి వేర్వేరు రచయితలు వేర్వేరుగా
వివరించారు. దీనినిబట్టి ఏసుక్రీస్తు అనే వ్యక్తి అసలు పుట్టనేలేదు అని ఏ
మేధావి అనలేదు.
సున్నీ వక్ఫ్ బోర్డ్ వాదిగా ఉన్న కేసులో కొన్ని అంశాలపై జస్టిస్
సుధీర్ అగర్వాల్ స్పష్టం చేసిన అంశాలు:
1. ఈ కట్టడం (మూడు గుమ్మటాల బాబరీ
కట్టడం) హిందూ దేవాలయాన్ని కూల్చి ఆ స్థలంలో నిర్మించినదా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: నిశ్చయంగా అవును.
2.ఈ కట్టడాన్ని(మూడు గుమ్మటాల బాబరీ కట్టడం) ముస్లింలు పురాతనకాలం నుండి ప్రార్ధనలు చేయడానికి ఉపయోగించారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: వివాదాస్పద కట్టడాన్ని(మూడు గుమ్మటాల బాబరీ
కట్టడం) కేవలం ముస్లింలు మాత్రమే ఉపయోగించలేదు. 1856-57 తరువాత, బాహ్య
ప్రాంగణాన్ని కేవలం హిందువులు మాత్రమే ఉపయోగిస్తే, లోపలి ప్రాంగణాన్ని
రెండు వర్గాల (హిందువులు మరియు ముస్లింలు) వారు ఉపయోగించారు.
3. వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) 1949 దాకా ఆ ఆస్తిని కలిగి ఉండి, 1949 తరువాత వారి ఆదీనంలో నుండి తొలగించబడిందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: లేదు – అలా ఏమి జరుగలేదు.
4. ఫిర్యాదులో ఆరోపించిన విధంగా సున్ని వక్ఫ్ బోర్డ్ వారి హక్కులను ప్రతికూలంగా కలిగి ఉన్నదా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్ : లేదు.
5.వాదనలో ఉన్న ఆస్తి రాజా శ్రీ రామచంద్ర స్వామి జన్మ భూమియేనా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: ఈ ప్రదేశం, మూడు గుమ్మటాల కట్టడపు ప్రధాన గుమ్మటం కింద ఉన్న ప్రాంతం, హిందువులు రామజన్మభూమి అని నమ్మి పూజించే ప్రాంతం.. అంటే వివాదాస్పద కట్టడం అంతర్భాగం.
6. సాధారణ హిందువులు ప్రత్యేకించి
పిటిషనర్లు ఇక్కడ ఉన్న శ్రీ రామ పాదాలు ,సీతా రసోయి మరియు ఇతర విగ్రహాలు
మొదలైనవాటిని పూజించే హక్కును కలిగిఉన్నారా? ఒకవేళ ఉంటే వివాదంలో ఉన్న భూమి
లోనేనా ?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: నిశ్చయంగా, అవును.
7. ప్రాచీన కాలం నుండి హిందువులు ఈ
వివాదాస్పద ప్రాంతాన్ని శ్రీ రామ జన్మభూమిగానూ, జన్మస్థానం గాను భావించి
పవిత్ర యాత్రా స్థలంగా, తీర్థయాత్రగా దర్శించటానికి వస్తూ ఉన్నారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును.
8. వివాదంలో ఉన్న ఈ ఆస్తి పై 1528 AD
నుండి ముస్లింలకు తరాలుగా అందరికి తెలిసే హక్కులు కలిగి ఉన్నారా?
పిటిషనర్లు లేదా హిందువులు అలా అనుకుంటున్నారా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: – లేదు. సమాధానం వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) మరియు సాధారణ ముస్లింలకు వ్యతిరేకం.
9. (మూడు గుమ్మటాల బాబరి కట్టడం) ఈ
కట్టడం అన్నివైపులా మూసి ఉండి హిందువులు పూజించే ప్రాంతం నుండి మాత్రమే
లోపలి వెళ్ళడానికి అనువుగా ఉన్నదా ?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును, హిందూ ప్రార్ధనా స్థల మార్గం గుండా
వెళ్ళడం తప్ప వేరే అవకాశం లేదు.సున్ని వక్ఫ్ బోర్డ్ (వాది లేదా
ఫిర్యాదుదారు) పత్రంలో పేర్కొన్న కొన్ని
అంశాలపై జస్టిస్ ధరం వీర్ శర్మ పేర్కొన్న విషయాలు:
1. వాది (సున్నీ వక్ఫ్ బోర్డ్)ద్వారా పేర్కొన్న విధంగా అది మసీదేనా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి (సున్నీ వక్ఫ్ బోర్డ్) వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
2. హిందూ దేవాలయ స్థలంలో పాత కట్టడం పడగొట్టిన తర్వాత ఈ కట్టడం నిర్మించారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: ASI రిపోర్టు ఆధారంగా ముద్దాయిలకు (హిందూ సమాజం సాధారణంగా) అనుకూలంగా మరియు వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డు) నిర్ణయించడమైనది.
3.ఈ భవనం ముస్లిం సమాజంలోని సభ్యులు చాలాకాలం నుండి ప్రార్ధనలను జరపడానికి ఉపయోగించినదా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) నిర్ణయించడమైనది
4. వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) 1949 దాకా ఈ ఆస్తులను కలిగి ఉండి తరువాత 1949 నుండి ఆ హక్కు నుండి తొలగించబడ్డారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ సమాధానం: వాదికి వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
5. వాది (సున్ని వక్ఫ్ బోర్డు ) ఫిర్యాదులో చెప్పబడినట్లు అక్రమంగా హక్కులను కలిగి ఉన్నారా?

జస్టిస్ ధరంవీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
6. ఈ వివాదంలో ఉన్న ప్రాంతం శ్రీ రామచంద్రదేవుని జన్మభూమియేనా?
జస్టిస్ ధరం వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) (మరియు హిందూ సమాజానికి అనుకూలంగా) నిర్ణయించడమైనది.
6. ఈ వివాదంలో ఉన్న ప్రాంతం శ్రీ రామచంద్రదేవుని జన్మభూమియేనా?
జస్టిస్ ధరం వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) (మరియు హిందూ సమాజానికి అనుకూలంగా) నిర్ణయించడమైనది.
7. శ్రీ రామ్ జన్మ భూమి లేదా
జన్మస్థాన్ వంటి ఈ వివాదస్థలంలో హిందువులు పురాతన కలం నుండి పూజలు
చేస్తున్నారా?. ఒక పవిత్ర స్థలంగా తీర్థయాత్ర చేస్తున్నారా?
జస్టిస్ ధరంవీర్ శర్మ: వాదిలపై (సున్ని వక్ఫ్ బోర్డ్) (మరియు హిందూ సమాజానికి సాధారణంగా అనుకూలంగా) వ్యతిరేకంగా నిర్ణయించడమైనది.
8. ముస్లింలు 1528 AD నుండి నిరంతరంగా, బహిరంగంగా, ఈ ఆస్థి ఫై హక్కును ప్రతివాదులు మరియు సాధారణ హిందువులకు తెలిసేలా కలిగి ఉన్నారా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదికి వ్యతిరేకంగా (సున్ని వక్ఫ్ బోర్డ్) నిర్ణయించడమైనది.
9.వాదికి లేదా వారిలోని ఎవరికైనా ఏ విధమైన ఉపశమనం ఉండే అవకాశం ఉంది?
జస్టిస్ ధరం వీర్ శర్మ: వాది (సున్ని వక్ఫ్ బోర్డ్) ఏ ఉపశమనానికి అర్హులు కాదు. సులభ వాదనలతో ఈ దావాను తొలగించారు.
10. కేవలం హిందూ ఆరాధన స్థలాల గుండా వెళ్ళటం ద్వారా మాత్రమే ఈ భవనం భూభాగం చేరుకోవటానికి వీలైనదిగా ఉన్నదా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: వాదులపై (సున్ని వక్ఫ్ బోర్డ్) మరియు
ప్రతివాదులకు అనుకూలంగా (హిందూ సమాజం సాధారణంగా) నిర్ణయించడమైనదిరామలాల
విరాజమాన్ (మొదటి వాది), రామ్ జన్మభూమి ఆస్థాన్ (రెండవ వాది) మరియు
తదుపరి స్నేహితుడి (వాది సంఖ్య 3)
పిటిషన్ లో పేర్కొన్న కొన్ని అంశాలపై జస్టిస్ సుధీర్ అగర్వాల్:
1. వాది 1 మరియు 2 (రామలాల విరాజమాన్ & రామ్ జన్మ్ భూమిఆస్థాన్ ) చట్టబద్దమైన వ్యక్తులా?
1. వాది 1 మరియు 2 (రామలాల విరాజమాన్ & రామ్ జన్మ్ భూమిఆస్థాన్ ) చట్టబద్దమైన వ్యక్తులా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్ జవాబు: వాది 1 & 2 చట్టబద్దమైన వ్యక్తులే. .
2. వాది ఆరోపించినట్లు డిసెంబరు 23, 1949 ఉదయపు గంటల్లో వివాదాస్పద కట్టడపు ప్రధాన గుమ్మటం కింద విగ్రహం ప్రతిష్ఠించబడిందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: అవును. . 1949, డిసెంబర్ 23, ఉదయపుగంటలలో వివాదాస్పద కట్టడపు ప్రధాన గుమ్మటం కింద విగ్రహాలు ఏర్పాటు చేయబడ్డాయి.
3.జన్మస్థానంలోని దేవాలయాన్ని కూల్చివేసిన తరువాత నిర్మించిన కట్టడమే ఈ బాబ్రీ మసీదు అనే వివాదాస్పద కట్టడంగా చెప్పబడుతోందా?
జస్టిస్ సుధీర్ అగర్వాల్: కచ్చితంగా (అవును).రాంలాలా విరాజ్మాన్ (వాది నెం 1), అష్టన్ రామ్ జన్మ్ భూమీ ఆస్థానమ్ (వాది నంబర్ 2) మరియు తదుపరి స్నేహితుడి (వాది నంబర్ 3) కేసులో రూపొందించిన కొన్ని అంశాలపై జస్టిస్ ధరం వీర్ శర్మ
జన్మస్థానం లోని దేవాలయాన్ని కూల్చివేసిన తరువాత నిర్మించిన కట్టడమే ఈ బాబ్రీ మసీదు అనే వివాదాస్పద నిర్మాణంగా చెప్పబడుతోందా?
జస్టిస్ ధరమ్ వీర్ శర్మ: సున్ని వక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా, వాదికి
అనుకూలంగా తీర్పు చెబుతూ.. “సాధారణంగా, శ్రీ రామ్ జన్మస్థాన్ ఆలయాన్ని
ధ్వంసం చేసిన తరువాతనే ఈ వివాదాస్పద బాబరి నిర్మాణం జరిగింది”.
Source - VSK Telangana
రామ మందిరం గురించి కోర్టులు ఏమన్నాయి?
ReplyDelete