Breaking News

ఈ సరస్సు వద్ద గంట సేపు నిలబడితే చావు తప్పదు

1951 నుండి రేడియో ధార్మిక వ్యర్థ పదార్థాలు డంపింగ్ చేస్తున్న ఫలితంగా రష్యా లో దక్షిణ యురాల్ పర్వత శ్రేణులలో వున్న 'కరచాయ్ ' సరస్సు దాని పరిసరాలు ప్రపంచం లో కెల్లా అతి కలుషిత ప్రదేశం. అమెరికాకు దీటుగా అణ్వాయుధాలు తయారీ కోసం రహస్యంగా నెలకొల్పిన ఈ ఫ్యాక్టరీ నుండి ఫ్లూటొనియం ఉత్పత్తి చేస్తారు.1990లో నిజాలు బయట పడెసరికి ఆ ప్రాంతం నివాస యోగ్యం కాని స్థితి ఏర్పడింది.

అమెజాన్ అడవులు దక్షిణ అమెరికా లో 5.5మిలియన్ చ.కి మీ మేర విస్తరించి వుంది. భూగోళం పైన వున్న జీవజాలానికి 90శాతం ప్రాణ వాయువు(oxygen)ని ఈ అరణ్యమే అందిస్తుంది.ఈ అడవుల నరికివేత కు గురై తగినంత ప్రాణ వాయువు అందని పరిస్థితి ఏర్పడనున్నది.గ్లోబల్ వార్మింగ్ మరో 3-4డిగ్రీలు పెరిగితే వాటిని బూచిగా అమెజాన్ అడవులు పూర్తిగా అదృశ్యమైపోతాయి.
టర్కనా (కెన్యా దేశం)ప్రజలు నీరు, ఆహారం దొరకక అంత్యంత పేద ప్రజలుగా దారిద్య్రరేఖ క్రింద జీవిస్తున్నారు.ఇది డిజిభౌటి , ఇథియోపియా,సోమాలియా వంటి ప్రాంతాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలో 1కోటి 23 లక్షల ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు.
అభివృద్ది చెందిన దేశాలు అనుసరిస్తున్న విధానాలు(అధిక కార్బన్ డై ఆక్సైడ్ ఉత్పత్తి చేస్తూ ) పర్యావరణాన్ని కలుషితం చేసి వర్థమాన దేశాలను బలి పశువులను చేస్తున్నారు. చిన్న దేశాలు అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.

వాయు కాలుష్యం వల్ల శ్వాస,గుండె సంబంధ వ్యాధులు(ఆస్థమా మొదలైనవి) ప్రబలి మరణాల రేటు పెరుగుతున్నది. కాలుష్యం కారణంగా ఒక్క భారత్ లోనె 2.5 మిలియన్ మరణాలు సంభవించాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 18 వేల మంది వరకు మరణిస్తున్నారు. కాలుష్యం కారణంగా యువకుల హార్మొన్ లు ఒత్తిడికి గురై,నేర ప్రవృత్తిని అవలంబిస్తున్నారు.మానసిక అలజడికి గురవుతున్నారు.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. ప్రపంచ వ్యాప్తంగా రోజుకి 18 వేల మంది వరకు మరణిస్తున్నారు. కాలుష్యం కారణంగా యువకుల హార్మొన్ లు ఒత్తిడికి గురై,నేర ప్రవృత్తిని అవలంబిస్తున్నారు.మానసిక అలజడికి గురవుతున్నారు.

    ReplyDelete