అంబేద్కర్ నాయకత్వం ఎక్కడుంది ఇప్పుడు?-Ambedkar
నేడు అంబేద్కర్ వంటి మహానుభావుని నాయకత్వం లేక పోవటం దురదృష్టం.ఆయన కుల రాజకీయలకు పాల్పడలేదు. కుత్సిత దుర్బుద్ధితో హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాడ లేదు.హిందుత్వాన్ని వ్యతిరేకించే విదేశీ శక్తుల ప్రభావానికి లోను కాలేదు.కుల వివక్షత కు గురై,అవమానాలు పొందినా,ఒపికతో,సహనం తో ఆశావాదం తో వున్నాడే కాని, కక్ష, కసితో బ్రాహ్మనిజానికి, ఇతర కులాలపై యుద్ధం ప్రకటించలేదు. వ్యవస్త లో మార్పు కోసం కృషి చేశాడు.అందుకోసం,ఎవరిపై,ఎందుకు, ఎలా ఉద్యమాలు చెయాలో,సంఘటితం కావాలొ వివేకం పెంచుకోవడాని చదువుకొమ్మన్నాడు. 1927 లో చెరువు సత్యాగ్రహం లో అంటరానితనానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులను మరియు అన్ని కులాను వెంట తీసుకుని పాల్గొని పోరాటం చేశాడు.ఒకరిద్దరు దీనికి అభ్యంతరం తెలిపితే వాళ్ళకు నచ్చచెప్పాడు.1935 లో హిందూమతం లో పుట్టినా దీనిలో చావనని ప్రకటించి,20 సంవత్సరాల తరువాత గాని బౌద్ధమతం పుచ్చుకోలేదు.నిజాం నవాబు పైసలకు ప్రలొభపెట్టినా ఇస్లాం స్వీకరించలేదు.ఆంగ్లేయులు పదవి ఆశ చూపినా,క్రైస్తవం జోలికి పోలేదు. అయితే, 1956 లో తన వృద్ధాప్యంలో మాత్రం మనిషి రక్తం పీల్చే జలగాల్లాంటి కమ్యునిష్టులు నా ఎసి సి సోదరులను గద్దల్లా కొరుక్కుతింటారని ఊహించాడు..పైగా ఆ రోజుల్లో కమ్యూనిజం ప్రపంచమంతా విస్తరించింది..పందుల్లా తినడం తప్ప, హృదయాలల్లో సానుభూతి లేని కమ్యునిస్టుల వలలో పడకుండా బౌద్ధం లో చేరాడని వారి చరిత్ర చదివితే అర్థమవుతుంది.రాజ్యాంగం లో కూడా నిమ్న వర్గాలకు సౌకర్యాలు కల్పిస్తూనే, అన్నికులాలకు చెందిన కార్మికులకు,స్త్రీ లకు హక్కులు కల్పించిన మహానుభావుడు.ఆయన వ్రాసిన పుస్తకాలకు తప్పుడు అర్థాలు తీసి,అబద్ధాలు వ్రాసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్ సి లను తీవ్ర గందర గొళానికి గురిచేసి, ఇప్పటికీ గురిచేస్తున్న ఘనత కమ్యూనిష్టులదే.ఆ వామపక్ష భావాలు కలిగినవారే ఇప్పటికీ దళిత ఉద్యమాల్లొ ముందున్నారు.అలాగే క్రైస్తవం పుచ్చుకున్న ఎస్ సి లు రాజ్యాంగానికి విరుద్ధంగా నిజమైన ఎస్ సిల రిజర్వేషన్ హాక్కులు అనుభవిస్తూ, ఎస్ సిలను అణగ దొక్కుతూ, నాయకత్వం వహిస్తున్నారు.ఇది తెలిసిన నిజమైన హిందూ ఎస్ సి లు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు.తాము ఎవరి నాయకత్వం లో తమ హక్కులను సాధించుకోవాలో నెమ్మదిగా అర్థం చేసుకొంటున్నారు.
- అప్పాల ప్రసాద్.
అంబేద్కర్ నాయకత్వం ఎక్కడుంది ఇప్పుడు?
ReplyDelete