ప్రజాసేవకు డబ్బెందుకు?-Pratap Chandra Sarangi
17వ లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడిశాలోని బాలాపూర్ నియోజకవర్గంలో కనిపించిన అరుదైన దృశ్యం ఇది. ఓవైపు అధునాతన కార్ల కాన్వాయ్ వెంటరాగా, ఎన్నికల ప్రచార నిపుణుల సూచనలతో బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన కోటీశ్వరుడు రబీన్ద్ర కుమార్ ప్రచారం కొనసాగింది.
మరోవైపు.. కొంతమంది సైకిళ్ళు వేసుకుని వెంటరాగా ఓ మాములు ఆటో రిక్షాపై ప్రసంగిస్తూ సాగిన ప్రతాప్ చంద్ర ఎన్నికల ప్రచారం. ధన బలం-నిరాడంబర సేవా స్వభావం మధ్య సాగిన బాలాసోర్ నియోజకవర్గ ఎన్నికల్లో బీజేడీ అభ్యర్థి జేనాపై 12,956 ఓట్ల తేడాతో ప్రతాప్ చంద్ర ఘన విజయం సాధించారు.
మన దేశంలో రాజకీయాలపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించుకునేందుకు ఇది ఒక మార్గంగా తయారైంది. అందుకే ఈ మధ్య ఎక్కువ శాతం మంది రాజకీయాల్లోకి రావాలని తహతహ లాడుతున్నారు. కానీ ఇప్పటికీ రాజకీయాలు అంటే కేవలం ప్రజలకు సేవ చేసే మార్గం మాత్రమే అని భావించేవారు అక్కడక్కడా అరదుగా కనిపిస్తుం టారు. అదే కోవకు చెందిన వ్యక్తి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి.
ఒడిశాలోని బాలాపూర్ నియోజకవర్గం నుండి 17వ లోక్సభకు సభ్యునిగా ఎన్నికైన ప్రతాప్ చంద్ర సారంగి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి నోటా వినిపిస్తోంది. ఇందుకు కారణం అతడి నిరా డరంబర జీవితమే. ఎంతగా అంటే.. గతంలో నీలగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతాప్ చంద్ర, ఇప్పటికీ ఒక పాతబడిన చిన్న ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ఊర్లో ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్ మీదనే వెళ్ళివస్తూ ఉంటారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ బాలాసోర్ జిల్లా కార్యవాహగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రతాప్ చంద్ర అనంతరం ఒడిశా రాష్ట్ర బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. సంస్కృత భాషలో అపార పాండిత్యం గడించిన ప్రతాప్ చంద్ర సారంగి, హిందీ, ఇంగ్లీష్, ఒడిశా, బెంగాలీ భాషల్లో అనర్గళంగా ప్రసంగించగలగడం గమనార్హం.
''నిరాడరంబరంగా ఉండేందుకు నేను ప్రయత్నించను.. ఇది నా జీవన శైలి. చిన్నతనం నుండి ఇది నాకు అలవాటే. ప్రజల కోసం బ్రతకడం, ప్రజల కోసం పనిచేయడం అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికైనంత మాత్రాన నా ఈ జీవన శైలిలో మార్పు రాదు'' అని ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రతాపచంద్ర తెలిపారు.
నానా (పెద్దన్న)గా ఒడిశాలో అందరికీ సుపరిచితులైన ప్రతాప్ చంద్ర, అక్కడి గిరిజన ప్రాంతాల్లోని ప్రజల అభ్యున్నతి కోసం మూడు దశాబ్దాలకు పైగా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. విద్యావ్యాప్తి కోసం 1980లో అక్కడి మారుమూల గ్రామంలో ఏకల్ పాఠశాల స్థాపించారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రతాప్ చంద్ర తమ ప్రాంతం నుండి అక్రమంగా బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తరలి వెళ్తున్న వందలాది పాడి పశువులను రక్షించి ఆశ్రయం కల్పించారు. గో రక్షణపై అవగాహనా సదస్సుల ఏర్పాటు చేసి విస్కృతంగా ప్రచారం చేసారు. విద్య రీత్యా పట్ట భద్రుడు అయినా, ప్రతాప చంద్ర వృత్తిరీత్యా రైతు.
మూలం - లోకహితం.
నిరాడరంబరంగా ఉండేందుకు నేను ప్రయత్నించను.. ఇది నా జీవన శైలి. చిన్నతనం నుండి ఇది నాకు అలవాటే. ప్రజల కోసం బ్రతకడం, ప్రజల కోసం పనిచేయడం అనే సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికైనంత మాత్రాన నా ఈ జీవన శైలిలో మార్పు రాదు
ReplyDelete