Breaking News

స్వతంత్ర భారతాం లో జాతీయత సుదృఢం కావడం ఎందుకు కాలేదు

స్వతంత్రం రాగానే కాంగ్రెస్ వారు ఇంగ్లీషు వాడి విభజించు పాలించు పద్ధతినే మార్గం గా స్వీకరించి ముస్లిములను విడగొట్టి మైనారిటీ ప్రత్యేక హక్కులు అంటూ ఆ కూటమిని దృఢతరం చేసి ఓటుబాంకు తమదిగా చేసుకోవడానికి‌ ప్రయత్నం చేసారు.  నిజానికి ముస్లిం లీగ్ తో విభజింప బడిన దేశం లో ముస్లిములు వేరు పార్టీ పెట్టి మనగలగడం కష్టం గా భావించి కాంగ్రెస్ లో కలసి జాతిలో ముసలం కాకూడదని భావించి ఉంటారు.  

కాని కాంగ్రెస్ వారిని బలమైన కూటమిగా తయారు చేయడం‌ ఒకింత స్వాంతన పొంది  కాంగ్రెస్ కి మంచి ఓటు బాంకు గా తయారై తమ కోరికలను ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ తొ పూర్తి చేసుకుని, జాతీయత లో మమేకం కావడం‌కంటే‌ వేరుగా ఉంటేనే  లాభదాయకమని అలా ఉండటం‌ తమ శక్తిని‌ మత శక్తి  గా ఎదుగుతూ వచ్చింది.

అయితే మన దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ జాతీయత గురించి దృఢంగా ఆలోచించే తిలక్ అస్తమయం, నేతాజీ యుద్దం చేయడానికి దేశం వదిలి తిరిగి రాజకీయం లోకి రాకపోవడం. పటేల్ స్వతంత్రం తరువాత కొద్ది కాలమే మన ఉప ప్రధానిగా ఉండటం, త్వరగా స్వర్గస్తులు కావడం నెహ్రు తప్పుడు అడుగులకు అడ్డుపడటం ఎవరికీ చేత కాలేదు. అందులో ప్రజలు కూడా స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం‌ ని సహకరించాలనే భావం‌ దేశం లో ఉద్యమాలు చేయ లేదు. 

అప్పటిలో కమ్యునిష్టులు మినహా మరో ప్రతిపక్షం లేదు. వారూ అంత బలమైన పార్టీ కాదు. కొద్ది చొట్ల‌ మాత్రమే వాటి బలం‌ ఉన్న కారణం గా  నెహ్రు విభజించి పాలించు, జాతీయత నిర్మాణం కంటే జాతిని ముక్కలుగా విడగొట్టడాన్ని అభివృద్దికి మార్గం అనీ,   దానికి కొత్త పేర్లు వెతికి సోషలిజం, సెకులరిజం లాంటివి ప్రయోగించి వ్యతిరేకతలు బయట పడకుండా హిందువులను కులం ఆధారంగా సామాజిక ఆరక్షణలు అంటూ జాతీయతను ప్రక్కనపెట్టి కుల సమీకరణాలు చాలా ముఖ్యమై కూటములు, ఓటు బాంకు నిర్మాణం చేసి హక్కులు సాధించడానికి ఇచ్చిన శ్రద్ధ జాతీయ శక్తిలో అంతర్భాగము కావాలనే తలపు ప్రజల్లో లేకుండా వాతావరణం నిర్మాణం కాంగ్రెస్ ద్వారా జరిగింది. 

మరి దీనికి వ్యతిరేకంగా గొంతు‌ విప్పింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం‌మాత్రమే రేపు ఆ విషయాలు వ్రాస్తాను.

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. స్వతంత్ర భారతాం లో జాతీయత సుదృఢం కావడం ఎందుకు కాలేదు

    ReplyDelete