మా అమ్మ కాంతమ్మ - 1
మూడేళ్ళ క్రితం నేను,1969 లో ఏడవ తరగతి పూర్తి చేసి, పరకాల వెళ్ళేముం దు ఉండిన మునుగోడు వెళ్ళాను. శివాలయం వెనుక ఉండిన నాలుగు రెండంతస్తుల విశాల మేడలుండే మేడం వారి ఇళ్ళకోసం వెతికాను. ఏ ఇళ్ళల్లొ నేను కలియ తిరిగానో,ఏ వీధిలో నేనాడుకున్నానో, అక్కడ ఒక్క ఇల్లూ లేదు. అన్నీ కూలి మట్టి కుప్పలయ్యాయి. ఆందరూ గ్రామం వదిలి వెళ్ళి పోయారు.
తరువాత దగ్గరలో ఇళ్ళలో వాకబు చేస్తే మేమున్న ఇంటి ఓనర్ శ్రీ వెంకన్న ఇల్లు ఆ ఊర్లోనే మరోచోట ఇల్లు కట్టుకుని ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి నా కుటుంబంతో వెళ్ళాను.
నలుబది సంవత్సరాల తరువాత నేను వారిని కలిసి నేను ఫలానా అని చెప్పడంతో ఆయన, వారి భార్య చాలా ఆప్యాయంగా ఆదరించి మా అందరి బాగోగులు పేరుపేరునా అడిగి, అప్పటి సంఘటనలు తలపోసుకొని ఆనందించాము.
కొద్దిసేపటి తరువాత వెంకన్న గారు ఏమి మూర్తి! బియ్యం, కూరగాయలు ఇస్తాను. వంట చేసుకుంటారా? అని అడిగారు. నేను నవ్వాపుకుని, వెంకన్నా ! భోజనం పెడితే తుంటాము, లేకపోతే చౌటుప్పల్ హోటల్ లో తింటాము. అన్నాను. వారి ఆనందం అంతా ఇంతా కాదు.
వండవే మనింట్లోనే తింటారు, అన్నారు. మీ అమ్మమ్మ పేరుసోమల (కర్నూలు జిల్లా) నుండి బస్సులో బయలుదేరి 6 -7 గంటలు ప్రయాణం చేసి, మధ్యలొ మంచినీళ్ళు కూడా తాగకుండా కొంచం కలకండ నోట్లో వేసుకుని హైదరాబాదులో ఇంటికి వచ్చి స్నానం చేసి వండుకు తినేది. మీరు మా ఇంట్లో భోజనం చేయడం ఎంత మార్పు అన్నారు. వాళింట్లో మేము ఐదు సంవత్సరాలు ఉన్నాము.
అది మా అమ్మ గత చరిత్ర. నేను మునుగోడులో ఉండగా సంఘ పరిచయం అయ్యింది. ఉత్సాహంగా పాల్గొనేవాడిని. నేను ప్రచారక్ గా కొంతకాలం ఉన్న విషయం తెలుసుకుని ఆనందంగా వారు మా అబ్బాయి తో ఇక్కడ మీ నాన్న సాయంశాఖ చూసేవాడు. నేను ప్రభాత్ శాఖ చూసేవాడిని అని చెప్పారు. ( సశేషం. )
- మీ నరసింహ మూర్తి.
మీ నరసింహ మూర్తి
ReplyDelete