పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 27 / 50
1956లో నవంబర్ 9,10,11 తేదీలలో ప్రాంతస్థాయి కార్యక్రమం శృంగేరి లో జరిగింది. బైఠకుల సందర్భంలో శ్రీ గురూజీ శృంగేరి జగద్గురువులను కలిశారు. శారదాంబ దర్శనం తర్వాత దగ్గరలోనే ఉన్న వేద పాఠశాలకు వెళ్ళారు. ఆయనను చూసిన అక్కడి విద్యార్థులు ' మేము వేదపఠనం చేస్తాము. మీరు వింటారా? అనడిగారు. శ్రీ గురూజీ ఒప్పుకోగానే 45 నిమిషాలపాటు వేదపఠనం జరిగింది. అది నిలిచే లక్షణం కనబడలేదు. దాంతో శ్రీ యాదవరావు జోషీ , శ్రీ కృష్ణప్ప తో తర్వాతి కార్యక్రమానికి ఆలస్యమవుతుందని చెప్పమని ఆదేశించారు. శ్రీ గురూజీ మాత్రం కళ్ళు మూసుకుని వింటున్నారు. దాంతో శ్రీ కృష్ణప్ప గారు విద్యార్థులతో వేదపఠనం ఆపమని అడిగారు. విద్యార్థులు, వారి గురువులు ' అరే, వేదమంత్రం పఠిస్తున్నది మేము .... తన్మయత్వంతో వింటున్నది వారు. మధ్యలో ఆపమనడానికి మీరెవరు? అని కోప్పడ్డారు.
చివరకెలాగో వేదపఠనం ఆగేలా చేశారు. అది ఆగగానే శ్రీ గురూజీ కళ్ళు తెరిచారు. లేచి నిలబడి వేదపఠనం చేస్తున్న ఆ విద్యార్థి సముదాయం ముందు సాష్టాంగ ప్రణామం చేశారు. అంతేకాదు, ' ప్రాచీన కాలంలో ...వేలాది సంవత్సరాల ముందు ...వితస్తా నదీతీరంలో ఏ రకంగానైతే వేదగానం మ్రోగుతుండేదో అదే రీతిలో ... నేడు ఇక్కడ విన్నాను ' అని చెప్పి అక్కడినుండి బయల్దేరారు.
- బ్రహ్మానంద రెడ్డి.
పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు
ReplyDelete