Breaking News

గుంటూరు లో నేను చూసిన కర్మయోగి

సంఘ సమర్పిత జీవితాలు ప్రత్యేకంగా కనపడవు. సర్వ సామాన్య జీవితాలు ఉంటాయి. సమాజ కార్యం రోజూ చేయాలి అని నియమం వారికి వారే పెట్టుకుంటారు.
సంఘ పనిలో టీమ్ లో పని చేయాలి. కొత్త వారు వస్తుంటారు. ఒక్కో సారి ఒక్కొక్కరు చొరవ తీసుకొని లీడ్ చేస్తుంటారు. కలిసి పని చేయడం లో అహంకార ఇబ్బదులు వస్తుంటాయి. ప్రతిభ పాటవాల చర్చ జరుగుతుం టుంది. వాటన్నింటికి తట్టుకొని అందరితో కలిసి, అందరినీ కలుపుకొని జీవితాంతం పని చేయడం లో మన మనస్సు, బుద్ధి సహకరించాలంటే నేను ఈ పని కోసమే అనే దృఢ సంకల్పం మనసులో నిరంతరం మెదిలే అక్షయ ధ్యేయనిష్ఠ ఉండాలి.
అలా నేను చూసిన కార్యకర్తల్లో గుంటూరు కి చెందిన శ్రీ చక్క హరనాథ్ గారు అటువంటి వారు. పెద్ద వారితో స్నేహం, పిల్లలతో కలసి పోయే తనం,సంఘ పని కోసం తన వృత్తిని అడ్జస్ట్ చేయడం. ఎన్ని పనులు నెత్తిన వేసినా నవ్వుతూ పని చేయడం. కోపం రవ్వంతయినా లేకుండా నవ్వుకోగలగడం, తనకు ఒక విషయం వ్యక్తిగతంగా నచ్చక పోయినా, నిర్ణయం అయిన పనిని అంతే శ్రద్ధగా పూర్తి చేయడం కయ్ ఆయన కష్టపడటం నేను చూసాను.
భాగ్యనగర్ లో నేను చూసిన బుర్రా వెంకటేశం గారు నాకు అలాంటి కర్మయోగి. వీరికి తెలియంది అంటూ ఉండదు. కానీ అవేవీ వారికి అంటదు.
మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. భాగ్యనగర్ లో నేను చూసిన బుర్రా వెంకటేశం గారు నాకు అలాంటి కర్మయోగి. వీరికి తెలియంది అంటూ ఉండదు. కానీ అవేవీ వారికి అంటదు.

    ReplyDelete