Breaking News

వజ్రనఖ శ్రీ దోనెపూడి వెంకయ్య గారి తో

ఆ మధ్య సంఘ కార్యాలయా నికి మాననీయ హల్డేకర్జీ ని చూడటానికి వెంకయ్య గారు వచ్చారు. నేను వారిని 1982 లో చూసాను. అప్పుడు వారు విజయవాడ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ గా ఉండేవారు. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత వారిని చూడటం. అప్పట్లో వారు ఏలూరు పర్యటన కు వస్తే, నేను వారు సైకిళ్ళు వేసుకొని శాఖ కు, కొద్దీ మంది పెద్దవాళ్లను కలిసి వెళ్ళాము.
వారి మంచి బౌద్ధిక్ విన్నాను. కమ్యూనిజం ని విమర్శిస్తూ అనేక చిన్న పుస్తకాలు, జాగృతి వ్యాసాలు వస్తుండేవి.
వారు పంచె కట్టుకొని వచ్చిన వారిని అప్పుడే చూడటం. నా దగ్గర సైకిల్ ఉండింది. వారు ఒక సైకిల్ అద్దెకు తీసుకో వోయ్. రిక్షా లో ఎన్ని చోట్లకు తిరుగుదాం .
అన్నారు. నాకు 23 ఏళ్ళు వారు 45 పైన ఉండేవారు. నేను అదే చేసాను. ఇద్దరం రాత్రి వరకు కలిసి తిరిగాము. రాత్రి వారిని విజయవాడకు పంపించి, అద్దె సైకిల్ ఇచ్చేసాను. తరువాత ఆ సంవత్సరం ట్రాన్ఫర్ అయి హైదేరాబాద్ వచ్చేసాను. తరువాత సంవత్సరం ప్రచారక్ గా గుంటూరు వెళ్ళాను. వారికి ట్రాన్ఫర్ అయ్యి ఆ విభాగ్ లో లేరు. రమణ మహర్షి సాహిత్యం, పరిశోధన.....

మళ్లీ వారిని ఈ రోజే చూసాను. బాగున్నారా ? అడిగాను. నేను నరసింహ మూర్తి అని గుర్తు చేసాను. వారు వెంటనే , ఏలూరు నుండి ఎప్పుడు వచ్చావోయ్ అన్నారు. నేను గుంటూరు, విజయనగరం, bms, బిల్డర్ ఇన్ని అవతారాలు, సంఘం లో దిలీసుఖఃనగర్ జిల్లా సంఘచాలక్. కానీ వారిని అద్దె సైకిల్ పై తిప్పిన నరసింహ మూర్తి ఇన్నేళ్ల తరువాత కూడా గుర్తున్నాను.ధన్యోస్మి.

1 comment:

  1. ఆ మధ్య సంఘ కార్యాలయా నికి మాననీయ హల్డేకర్జీ ని చూడటానికి వెంకయ్య గారు వచ్చారు. నేను వారిని 1982 లో చూసాను. అప్పుడు వారు విజయవాడ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ గా ఉండేవారు. మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత వారిని చూడటం. అప్పట్లో వారు ఏలూరు పర్యటన కు వస్తే, నేను వారు సైకిళ్ళు వేసుకొని శాఖ కు, కొద్దీ మంది పెద్దవాళ్లను కలిసి వెళ్ళాము.

    ReplyDelete