Breaking News

మాననీయ భాగయ్య గారు-నా మార్గదర్శులు

నేను ఏలూరు వెళ్లిన కొత్తలో మాననీయ హల్డేకర్జీ మా విభాగ్ ప్రచారకులు. 1979 లో నేనక్కడికి ఉద్యోగ నిమిత్తమైవెళ్ళాను
కొద్ది రోజుల్లో వారు సహా ప్రాంత ప్రచారకులు కావడం, శ్రీ భాగయ్య గారు విశాఖ నుండి విజయవాడ విభాగ్ ప్రచారకులుగా వచ్చారు. రామకృష్ణా పురం లో శ్రీమతి కాత్యాయిని అమ్మగారి ఇంట్లో కార్యాలయం ఉండేది. శ్రీ సుబ్రహ్మణ్యం గారు, భాగయ్యగారు రిక్షా లో వస్తుంటే నేను ఎదురయ్యాను. నేను ఆ వీధి లొనే ఉండేవాడిని. సుబ్రహ్మణ్యం గారు రిక్షా ఆపి, భాగయ్యగారికి నన్ను పరిచయం చేశారు. భాగ్యనగరా? అక్కడ మనం కలిసామా? అంటూ ఆప్యాయంగా పలకరించారు. నేను 1976 లో భాగ్యనగర్ వచ్చాను. వారు 1969 లో ప్రచారక్ గా విశాఖ వెళ్లారు. కలిసే అవకాశం లేదు. కాని నా భుజం పై చేయి వేసి వారు మాట్లాడు తుంటే నేను ఎంతో సన్నిహితత్వాన్ని,ఆత్మీయతను ఆస్వాదించాను.

తరువాత పవర్పెట్ స్టేషన్ దగ్గరకు కార్యాలయం మారడం శ్రీనివాస్ గారు నగర ప్రచారక్ గా రావడం నేనూ కొంచం క్రియా శీలకంగా మారాను. ఏలూరు నగర కార్యవాహ్ ఉండేవారు. మిగతా టీమ్ లేదు. ఏమి సీనూ ఇంకా మీ టీమ్ పెంచుకోవా? అని వారు అడిగారు. నాకు 21 సంవత్సరాలు. చూస్తున్నా మండీ అంటూ శీను మెల్లగా అన్నారు. ఈ సన్యాసి బాగానే ఉన్నాడు కాదోయ్ శారీరక్ ప్రముఖ్ చేయి, అన్నారు నన్ను చూపిస్తూ. ఆ .. ఆ. . చేసేద్దామండీ అంటూ తను నవ్వుతూ అని, ఆ తరువాతి ఆది వారం సాంఘీక్ లోనన్ను శారీరక్ ప్రముఖ్ గా ప్రకటించారు. నేను ఆ తర్వాత శారీరక్ నేర్చుకున్నాను. వారు ఏలూరు ఎప్పుడొచ్చినా నేను, శీను వారి వెంటే. వారి బౌద్ధిక్ నా కెంతో ఉత్సాహం ఇచ్చేది. అక్కడే ఖండ కార్యవాహ్, పోలవరం విస్తరక్, ప్రధమ వర్ష, ద్వితీయవర్ష , అన్నీ చక చకా సాగిపోయాయి.
నా ద్వితీయ వర్ష చివర్లో వారికి కడుపు లో ఆపరేషన్ అయ్యింది. కార్యాలయం లో కాక కార్యకర్త ఇంట్లో వారి విశ్రాంతి. నాకు ఏలూరు ఉత్తరం వచ్చింది. నీవు ఫలానా రోజు మధ్యాహ్నం కలుద్దాం, అడ్డ్రస్ ఇది అని.వ్రాసారు. పాపం విశ్రాంతి పడుకుని ఉంటారనుకున్నాను. ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఉదయం శాఖ లేదు కాని అదే వరవడి. గంట గంటకు వారితో మాట్లాడే వారు జట్లుగా సమావేశాలు. ఇంట్లో ఆక్కయ్య గారు ఇదేమి విశ్రాంతి బాబు. ఇలా ఇంతమంది వస్తే ఇంకా ఏమి రెస్ట్ దొరుకుతుంది? అని విసుక్కున్నారు. నేనె పిలిచాను. ఫర్వాలేదమ్మా బాగానే ఉంది. అంటూ వారు సర్దుతున్నారు.
నన్ను కూర్చోబెట్టి ఇంకెంతకాలం నీ ఉద్యోగం? అని అడిగారు. ఈ ప్రశ్న నేనూహించలేదు. అంటే అన్నాను. సంఘ పని పూర్తి సమయం చెయ్యవా? 
ప్రచారక్ గా రమ్మంటారా? అన్నాను.
మరీ .. అన్నారు. నేను పనికొస్తానా? అడిగాను. పనికి రాకపోతే ఎందుకడుగుతాను? అన్నారు. ఇంతలో చాయ్ వచ్చింది. నేను ఉద్యోగం వచ్చి ఏలూరు వచ్చాను. ఇంటిలో ఉండలేదు. ట్రాన్సవర్ అయ్యింది. భాగ్యనగర్ వెళ్లి తృతీయ వర్ష పూర్తి చేసి వస్తానుఅన్నాను
అలా అంటావా? వెళ్లొచ్చు. అని ఆగి నీ ఇష్టం అలానే కానీ అన్నారు.

నా జీవితపు గమనం మారి పోయింది. వారి మాట శిరోధార్యం. మరో 8 నెలలు ఇంట్లో . ఉగాది నేను విస్తారక్ గా మంఖాల్ చేరాను. తృతీయ వర్ష. నన్ను గుంటూరు నగర ప్రచారక్. మళ్ళీ సుబ్రహ్మణ్యం గారే జిల్లా ప్రచారక్, భాగయ్యగారే విభాగ్ ప్రచారక్. నా జీవితం కొంత కాలం పూర్తి సమయం ఆ పనిలో ఉండే అదృష్టం వారి నిర్దేశనతోటే. కొంత కాలమే నిలబడ్డా నా జీవితానికో తృప్తి.
సంవత్సరం తరువాత వస్థానన్న నా మాట పై ఎంత నమ్మకం తో అవకాశం ఇచ్చారు. నాకిప్పటికీ ఆశ్చర్యమే.

నమస్సులతో మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. మాననీయ భాగయ్య గారు-నా మార్గదర్శులు

    ReplyDelete