మాననీయ సోమయాజులు గారు - భాగ్యనగరం
మాననీయ సోమయాజులు గారు చాలా కాలం భాగ్యనగర్ విభాగ్ ప్రచారకులు గా ప్రాంత ప్రచారకులుగా పని చేశారు. ప్రస్తుతం ముంబై కేంద్రంగా వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారతీయ ఆర్గనిజింగ్ సెక్రటరీ గా ఉన్నారు.
1983 లో భాగ్యనగర్ విభాగప్రచారక్ గా ఉన్నారు. నేను నగర్ 11 బౌద్ధిక్ ప్రముఖ్ గా ఉన్నాను. వారు చైతన్యపురి శాఖకు వచ్చారు. ఇప్పుడు లాగా ఫోన్ సౌకర్యాలు లేవు. సమావేశం లో వారి పర్యటన చెప్పారు. వారు వస్తున్నారంటే మాకు సంతోషమూ, భయమూ ఉండేది. రామాలయం పక్కలో శాఖ నడిచేది. సమయానికి 10 నిమిషాలు ముందుగా వారు శాఖా స్థలం లో ఉన్నారు. నేను గట పని చేసుకొని సమయానికి చేరాను.
శాఖ ప్రారంభం చేయమని ముఖ శిక్షక్ చెబుతూ, మీరు వచ్చేసారా అంటూ వారిని పలుకరించాను. వచ్చాను. పూజారిగారిని అడిగాను, శాఖా ఇక్కడే జరుగుతుంది కదా అని, ఆయన నిక్కర్ లోనా వేషం చూసి, కొంచం కొత్తగా ముఖం పెట్టాడు. రెండు మూడు రోజుల క్రితం వాళ్ళు ఆడుకోవడం చూసాను. అన్నాడు. నిక్కర్ ని విచిత్రం గా చూసారు... అంటూ అడిగాను, వాళ్ళు మామూలుగా నే వచ్చి ఆడుకుంటారు అన్నారు, అంటూ చెప్పారు.
అవును సోమయాజులు గారు రెండు రోజులుగా శాఖ జరుగలేదండి అని సిగ్గుతో నసిగాను. ధ్వజం ఈ రోజే పెడుతున్నారా? మళ్ళీ వారి ప్రశ్న. నేను మాట్లాడ లేదు. వారే దగ్గరికి వచ్చి భుజం మీద చేయి వేసి. శాఖ మొదలు పెట్టండి రెండు నిమిషాల ఆలస్యం అయ్యింది. అన్నారు. గట పని జరిగింది కదా సంఖ్య బాగానే ఉంది. వారు మాతో కబడ్డీ ఆది ఆ దుమ్ములో నిక్కర్, చొక్కా మాసిపోయాయి. మండలల్లో కూర్చుని శివాజీ కథ చెప్పారు. అందరితో ఉత్సాహంగా, కలివిడిగా మాట్లాడారు.
నన్ను సిరియాస్ గా అడిగిన ప్రశ్నలు వారిని అడుద లేదు. కొంచం సేపు గృహ సంపర్కం. మా యింట్లో అల్పాహారం. వెళ్లి పోతూ శాఖ రోజూ నడవాలి, ధ్వజం తప్పక పెట్టండి. అశ్రద్ధ చేస్తే తరువాతి తరానికి అదే అలవాటు అవుతుంది అంటూ చెప్పారు.
కార్యం పట్ల కార్యకర్తకు ఎలాంటి శ్రద్ధ ఉండాలో వారు ఆచరించి చూపేవారు. కార్యకర్తకి నొక్కి చెప్పేవారు. అందుకే సంఘం శ్రద్ధా పూర్వక భారతమాత సేవ అయ్యింది. ప్రతీ నిమిషం పనిలో వారి శ్రద్ధ, అసమాన ప్రణాళిక మాకు కనపడేది. సంఘం భాగ్యనగరం లో దృఢంగా వేళ్లూనుకుందంటే వారి తపస్సు ఫలితమే.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
మాననీయ సోమయాజులు గారు - భాగ్యనగరం
ReplyDelete