Breaking News

మిషన్-2022-Mission 2022


పరాయి సంకెళ్లను తెంచుకుని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి 7 దశాబ్దాలు పూర్తయ్యాయి. 200 ఏళ్లు దేశంలో తిష్ట వేసిన బ్రిటీష్‌ పాలకులను అహింసనే ఆయుధంతో తరిమికొట్టిన మహత్తర క్షణాలివి. మరో ఐదేళ్లలో స్వతంత్ర భారతం 75 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఆసేతు హిమాచలం వజ్రోత్సవాలకు సిద్ధమవుతోంది. భవిష్యత్‌ భారతాన్ని ఆవిష్కరించు కోవడానికి ఇంతకంటే మించిన తరుణముండదేమో. 1947 పంద్రాగస్టున ఎర్రకోటపై ప్రసంగం చేసిన తొలి ప్రధాని నెహ్రూ ఈ విషయంపై కొంత స్పష్టత ఇచ్చారు. పేదరికం, అజ్ఞానం, అనారోగ్యం, అసమానతల నుంచి దేశానికి విముక్తి కలిగించాలని- భారత్‌ను సుసంపన్న, ప్రజాస్వామ్య, పురోగామి దేశంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. అవే మాటలను మరింత ముందుకు తీసుకెళ్తూ ప్రధాని మోదీ.. అవినీతి, మతోన్మాదం, కులతత్వం, ఉగ్రవాదం, దారిద్య్రం నుంచి భారత్‌కు విముక్తి కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. 2022 కల్లా నవభారత నిర్మాణానికి సంకల్పం తీసుకుందామని ఎర్రకోట సాక్షిగా పిలుపునిచ్చారు.


ఒకే ఒరలో రెండు కత్తులు ఎక్కడా ఇమడవు. అలానే... అభివృద్ధి - తీవ్ర అతివాదం. 70ఏళ్ల స్వతంత్ర భారతావని కూడా ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. రెండింటిలో మనకు కావాల్సిన అభివృద్ధి నినాదంతోనే ముందుకు సాగాలి. విశాల దేశ ప్రయోజనాలే ముందు. తర్వాతే ఏదైనా. అంతేకాదు హింసతో శాంతిని సాధించడం అనేది ఎప్పటికీ సాధ్యం కాని విషయం. పరస్పర అవగాహనతోనే అది సాధ్యం. అందుకే శాంతి కోరుకునే ఏ ఒక్కరైనా శాంతిమార్గంలోనే ముందుకు సాగాలి. తరతరాలుగా విజ్ఞులు చెబుతున్న అదే విషయాన్ని ఎర్రకోట వేదికగా పునరుద్ఘాటించారు ప్రధానమంత్రి మోదీ. మిషన్‌-2022కి దేశాన్ని సన్నద్ధం చేసే క్రమంలో అధిగమించాల్సిన ప్రధాన సవాళ్లు... వాటికి పరిష్కార మార్గాలనూ సూచించారు. సాటి వర్గాలపై ద్వేషభావనలు, విద్వేష ఆలోచనలు మాని ప్రేమించడం ప్రారంభించమనే అమూల్య సందేశాన్ని ఇచ్చారు. కల్లోకకశ్మీర్‌ సమస్యకూ అదే అప్యాయత, అనుబంధాలతో స్వస్తిపలకాలని పిలుపునిచ్చారు.

1 comment:

  1. పరాయి సంకెళ్లను తెంచుకుని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించి 7 దశాబ్దాలు పూర్తయ్యాయి. 200 ఏళ్లు దేశంలో తిష్ట వేసిన బ్రిటీష్‌ పాలకులను అహింసనే ఆయుధంతో తరిమికొట్టిన మహత్తర క్షణాలివి. మరో ఐదేళ్లలో స్వతంత్ర భారతం 75 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఆసేతు హిమాచలం వజ్రోత్సవాలకు సిద్ధమవుతోంది.

    ReplyDelete