Breaking News

వందేమాతరం!-Vandemataram



వందేమాతరం’ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని మదరాసు హైకోర్టు నిర్దేశించడం జాతీయ నిష్ఠను పెంపొందించడానికి దోహదం చేయగల శుభ పరిణామం. అన్ని పాఠశాలలలోను, ప్ర భుత్వ కార్యాలయాలలోను, ప్రభుత్వేతర సంస్థలలోను, పరిశ్రమల కార్యాలయాలలోను విధిగా ఈ జాతీయ సంకీర్తన-నేషనల్ సాంగ్-ను నియతంగా పాడాలని హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం ఆదేశించడం మరో చారిత్రక పరిణామం. పాఠశాలలలో వారానికి ఒకసారైనా ‘వందేమాతరం’ గీతాన్ని పాడాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలలో నెలకు ఒక్కసారైనా ఈ జాతీయ సంకీర్తనను ఆలపించాలని హైకోర్టు న్యాయమూర్తి నిర్దేశించాడట! తమిళనాడులోని సంస్థలన్నింటికీ ఈ ఆదేశం వర్తిస్తుందట! ‘వందేమాతరం’ తరతరాలుగా దేశ ప్రజల గుండెలలో మాతృదేశ భక్తిని నింపుతున్న జాతీయ మహా మంత్రం! ఈ మహామంత్రాన్ని ఉచ్చరించడానికి వీలుగా ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు ఆదేశాన్ని జారీ చేయవలసిరావడం జాతీయ సమాజపు సమష్టి మనఃప్రవృత్తిని దశాబ్దులుగా ఆవహించి ఉన్న వికృతికి నిదర్శనం. మాతృదేశాన్ని కీర్తించే గీతాన్ని పాడి తీరాలని ఉన్నత న్యాయస్థానం చెప్పే వరకు పాడాలన్న సహజ ధ్యాస కలుగకపోవడం దౌర్భాగ్యం.. ఇప్పుడైనా మదరాసు హైకోర్టు తీర్పు తమిళనాడు ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందట! ఈ తీర్పును దేశమంతటికీ ఎందుకని వర్తింపచేయరాదు? ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన ఒక అభ్యర్థి నివేదించిన న్యాయ యా చికను విచారించిన మదరాసు హైకోర్టు న్యాయమూర్తి ఈ ఆదేశాన్ని జా రీ చేసాడు. అయితే ‘వం దేమాతరం’ గీతాన్ని త ప్పనిసరిగా పాడాలని ఆ దేశించవలసిందిగా ‘న్యా య యాచిక’-రిట్ పిటిషన్-లో కోరలేదు. ‘వం దేమాతరం’ గీతాన్ని బం కించంద్ర ఛటర్జీ సంస్కృత భాషలో రాశాడా? లేక బెంగాలీ భాషలో రాశాడా? అన్నది వివాదాంశం. 2013లో జరిగిన ‘ఉపాధ్యాయ అర్హత’ పరీక్షలో ఈ గీతాన్ని బెంగాలీ భాషలో వ్రాశారని ఈ అభ్యర్థి తన సమాధాన పత్రంలో పేర్కొన్నాడు. కానీ ఈ గీతాన్ని బంకిం చంద్రుడు సంస్కృత భాషలో వ్రాశాడని నిర్ధారించిన ఉపాధ్యాయ నియమాక మండలి-టీచర్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్-టిఆర్‌బి-వారు ఆయనకు ‘మార్కు’ను ఇవ్వవలసిందిగా హైకోర్టు న్యాయమూర్తి ‘నియామకమండలి’ని ఆదేశించాడట! ఈ తీర్పును చెప్పిన న్యాయమూర్తి తమంత తాముగా వందేమాతరం గీతాన్ని విధిగా పాడాలని నిర్దేశించాడు!
అందువల్ల ఎవ్వరూ కోరకుండానే న్యాయమూర్తి ఈ గీతాన్ని నిర్బంధంగా ఆలపించాలని ఆదేశించినట్టయింది! ఇలా ఆదేశించిన న్యాయమూర్తి ప్రతిరోజు పాఠశాలలలో వందేమతరం గీతాన్ని పాడాలని నిర్దేశించి ఉండవచ్చు! అంతేకాక దేశవ్యాప్తంగా ఈ గీతాన్ని పాఠశాలలలో పాడించాలని న్యాయమూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఉండవచ్చు! అలా ఆదేశించి ఉండినట్టయితే కేంద్ర ప్రభుత్వం ‘సిబిఎస్‌ఇ’-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-జాతీయ ఉన్నత విద్యామండలి-కి అనుబంధంగా పనిచేస్తున్న ప్రభుత్వేతర పాఠశాలలన్నింటిలోను ప్రతిరోజు వందేమాతరం ఆలాపన నిర్బంధమై ఉండేది! ఇది మిగిలిన పాఠశాలలకు మార్గదర్శకమై ఉండేది. ప్రభుత్వపుటుత్తర్వులు కాని, న్యాయస్థానాల ప్రమేయం కాని లేకుండానే అనేక దశాబ్దులపాటు దేశంలోని అన్ని పాఠశాలలలోను వందేమాతరం ఆలపించిన చరిత్ర ఉంది! కానీ ఇప్పుడు న్యాయస్థానాలు నిర్దేశించవలసిన, ఆదేశించవలసిన రోజులు దాపురించాయి! స్వతంత్ర భారత రాజ్యాంగ పరిషత్ క్రీస్తుశకం 1950 జనవరి ఇరవై నాలుగవ తేదీన రవీంద్రనాథ్ ఠాకూర్ రచించిన ‘జనగణమన అధినాయక జయహే’ కృతిని ‘జాతీయ గీతం’-నేషనల్ యాంథమ్-గా నిర్ణయించింది, ‘వందేమాతరం’ గీతాన్ని జాతీయ సంకీర్తన-నేషనల్ సాంగ్-గా నిర్ధారించింది. ‘జాతీయ గీతం’తో వందేమాతరం గీతానికి సమాన స్థాయి ఉన్నట్టు కూడ రాజ్యాంగ పరిషత్ నిర్ధారించింది. అందువల్ల ఈ రాజ్యాంగ పరిషత్ నిర్ణయాన్ని అమలు జరుపవలసిందిగా ప్రత్యేకించి న్యాయస్థానాలు ఆదేశించవలసిన పనిలేదు! దశాబ్దుల మత రాజకీయాలు, మతోన్మాద సంతుష్టీకరణ ఫలితంగా ‘వందేమాతరం గీతాన్ని మేము పాడము’ అంటున్న వారు దేశంలో తయారయ్యారు. అందువల్ల రాజ్యాంగ పరిషత్ నిర్ణయాన్ని ప్రభుత్వాలే అమలు జరుపని స్థితి దాపురించింది! న్యాయస్థానాల జోక్యం అనివార్యం అయింది...
గతంలో 1998వ, 2004 సంవత్సరాల మధ్య అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ‘ప్రతి పాఠశాలలోను విధిగా వందేమాతరం గీతాన్ని ఆలపించాలన్న’ నిబంధనను విధించాయి. కానీ ఆ తరువాత రాజకీయపుటొత్తిడులకు లొంగి ఈ నిబంధనను ఆయా ప్రభుత్వాలు సడలించి వేశాయి! ఇప్పుడు విధిగా ‘వందేమాతరం’ ఆలపించాలన్న ఆదేశాన్ని జారీ చేసిన మదరాసు హైకోర్టు కూడ ఒక వ్యక్తి కాని సంస్థ కాని వందేమాతరం ఆలపించడానికి నిరాకరించినట్టయి తే ఆయా వ్యక్తులను, సంస్థలను పాడమని ని ర్బంధించరాదని కూడ నిర్దేశించింది. నిరాకరించడానికి సమంజసమైన కారణం ఉండాలన్నది మాత్రమే హైకోర్టు విధించిన నిబంధన! దీనివల్ల కథ మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది! ‘య థావిధిగా ఇష్టం వచ్చిన వారు పాడవచ్చు, లేని వారు బహిష్కరించవచ్చు..’ అన్న దుష్ట సంప్రదాయం యథావిధిగా కొనసాగే ప్రమాదం ఉంది. ‘వందేమాతరం’ గీతానికి ‘జనగణమన’ గీతంతో సమాన ప్రతిపత్తి ఉందని రాజ్యాంగ సభ నిర్ధారించిన తరువాత ‘జనగణమన’ గీతాన్నిపాడే అన్ని చోట్ల వందవేమాతరం గీతాన్ని పాడడానికి ఎందుకు అభ్యంతరం? అభ్యంతరం చెబుతున్నవారు 1947 ఆగస్టు పదిహేనవ తేదీనాటికి పూర్వం కొనసాగిన మతరాజకీయాలకు వారసులు మాత్రమే! ‘ఆనంద మఠం’ నవలలో వందేమాతరం గీతాన్ని స్వాతంత్య్ర సమర వీరులు ఆలపించారు. ఈ నవలను బంకించంద్ర ఛటోపాధ్యాయ క్రీస్తుశకం పంతొమ్మిదవ దశాబ్దిలో వ్రాశాడు. కానీ ఈ నవలలోని ఇతివృత్తం పద్దెనిమిదవ శతాబ్దిలో బెంగాల్‌లో జరిగిన విదేశీయ వ్యతిరేక విప్లవానికి సంబంధించినది. అందువల్లనే 1906 నాటి స్వదేశీయ ఉద్యమానికి ఈ చారిత్రక గీతం మహామంత్రం వలె ప్రేరణ నిచ్చింది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించింది!
జనగణమన అధినాయకుడైన భగవంతుని ప్రార్ధన! వందేమాతరం మాతృభూమిని ప్రార్ధించడం.. భరతభూమి బిడ్డలు సహజంగానే మాతృదేవి మమకారం కలిగి ఉన్నారు. ఈ మమకారం ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’ అని వేదద్రష్టలు గుర్తించిన నాటి నుంచి అనాదిగా కొనసాగుతోంది. ‘్భమి తల్లి.. నేను ఆమె బిడ్డను’-తల్లిని ప్రార్ధించడానికి బిడ్డలకు అభ్యంతరం లేదు. అభ్యంతరం ఉందనుకున్నవారు మాతృభూమి బిడ్డలు కాజాలరు..
                                             - సంపాదకీయం- ఆంధ్రభూమి..

1 comment:

  1. మదరాసు హైకోర్టు తీర్పు తమిళనాడు ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందట! ఈ తీర్పును దేశమంతటికీ ఎందుకని వర్తింపచేయరాదు?

    ReplyDelete