Breaking News

వస్తు సేవల పన్ను విహంగ వీక్షణం


స్వతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చిన ఆర్థిక సంస్కరణలో వస్తు సేవల పన్ను చట్టం - 2017ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణగా చెప్పవచ్చు. నేడు దేశమంతా, ఆ మాటకోస్తే అనామకుని నుంచి అంబానీ వరకు, వస్తు సేవల పన్ను గురించే మాట్లడుకోవడం చూస్తున్నాం. 
101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వ.సే.ప. బిల్లు చట్ట రూపం దాల్చింది. యూ.పి.ఎ హయంలో మొదలైన వ.సే.ప. మధనం ఎన్నో హలాహలాలను, అడ్డంకులను దాటుకుంటూ చివరికి ప్రభుత్వం మాటల్లో చెప్పాలంటే నూతన పన్ను సంస్కరణ అనే అమృతాన్ని వెలికి తీసింది. పన్ను సంస్కరణల్లో అమృత తుల్యంగా భావిస్తున్నదే ఈ వస్తు సేవ పన్ను.
ప్రపంచంలో 150కి పైగా దేశాలు ఈ వ.సే.పన్నును అమలు పరస్తున్న తీరుకు స్ఫూర్తిపొందిన భారతదేశం కూడా దీనిని అమలు పరుస్తే మరింత ఆర్థిక ఎదుగుదల సాధ్యమవుతుందని భావించి చివరికి వ.సే.ప. చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ప్రతి కార్యక్రమంలోనూ లాభనష్టాలున్నట్లే ఈ చట్టంలో కూడా కొన్ని లాభాలు కొన్ని నష్టాలు ఉన్నాయి.
ప్రస్తుతం మనదేశంలో అమ్మకం పన్ను ఆక్ట్రాయ్‌ పన్ను, ప్రవేశ పన్ను, గుర్రపు పందాల పన్ను, సేవాపన్ను, ఎక్సైజ్‌ సుంకం మొదలైన పరోక్ష పన్నులు సామాన్య మానవుని నెత్తిన గుదిబండగా మారాయి. ఈ అన్ని రకాల పన్నుల వలన, పన్ను మీద పన్ను వలన వినియోగదారుని బడ్జెట్‌ ఛిద్రం అవుతుంది. అయితే వ.సే.ప వలన ఈ పరోక్ష పన్నులన్నీ కూడా ఒకే చత్రం కిందకి వచ్చి

పన్ను మీద పన్ను అనే దుస్సంప్రదాయం తొలగిపోతుంది. దీని వలన సామాన్య మానవుని బడ్జెట్‌ నియంత్రణలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. అదెలాగో కింది ఉదా|| ద్వారా చూద్దాం.
పై ఉదా|| వల్ల మనకు తెలిసేదేమంటే వ.సే.ప. చట్టం వల్ల కాస్‌కేడింగ్‌ ట్యాక్స్‌ ఎపెక్ట్‌ అనేది అంతమవుతుంది. దీని వల్ల ఒక వస్తువు ధర మునుపటికంటే తక్కువ ధరకు లభించే అవకాశముంది. అయితే ఇటీవలి కాలం ప్రతి సరుకు వస్తువు లేదా సేవలపైన ప్రభుత్వం పన్ను రేటు స్లాబులను నిర్ణయించింది. కాబట్టి పై ఉదా|| ప్రతి వస్తువు సేవకు వర్తిస్తుందని చెప్పలేము. కాకపోతే సామాన్య మానవునికి గరిష్ట ప్రయోజనం కల్గే విధంగానే పన్ను శ్లాబులను నిర్ణయించినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనమొక విషయం గమనించాలి. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, ఆర్థిక విధానాల వలన గత 21/2 దశాబ్దాలలో ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయని గట్టిగా చెప్పవచ్చు. ఒకప్పుడు విలాసమనుకున్న వస్తువులు లేదా సేవలు ఇప్పుడు నిత్యావసరములయ్యాయి. అలాంటి వాటిని గరిష్ట పన్ను శ్లాబు (28%)లో చేర్చటం వలన కొంత వరకు మధ్య తరగతి మరియు ఎగువ మధ్య తరగతి వర్గానికి పన్ను పోటే.. ఉదా|| రిఫ్రిజిరేటర్‌, కారు మొదలగునవి. అలాగే ఆహార ధన్యాలను పన్ను నుంచి మినహాయించడం అనేది చాలా మంచి నిర్ణయం. దీని వల్ల గ్రామీణ ప్రాంత జనాభాకు అతి తక్కువ ధరలో పోషకాలు అందే అవకాశం ఉంది. అయితే పైన చెప్పిన ఎల్‌.పి.జి విధానాల వల్ల నేడు ప్రతి తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా సూపర్‌ మార్కెట్‌లు వెలియడం, వాటిలో ఆహార ధాన్యాలన్నీ కూడా ప్యాకింగ్‌లలో ఉండటం వల్ల ఈ విషయంలో సామాన్య మానవునికి జరిగే మేలు కొంత వరకే అని చెప్పవచ్చు. మనిషి ప్రాథమిక హక్కులైన జీవించే హక్కును మెరుగుపర్చే విద్యా, వైద్యాలను కూడా పూర్తిగా పన్ను నుంచి మినహయిస్తే బాగుండేది. రాబోవు రోజుల్లో ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఇప్పుడిప్పుడే దేశం, దేశ ప్రజానీకం పెద్ద నోట్ల రద్దు అనే దెబ్బ నుంచి తేరుకొంటున్న సమయం. ఈ సమయంలోనే దేశ ఆర్థిక స్థితిని పెను మార్పులకు లోను చేయగలదని భావిస్తున్న వ.సే.ప చట్టాన్ని తేవడాన్ని సమాజంలో ఆర్థిక నిపుణులు, మేధావులు, రెండు వర్గాలుగా విడిపోయి విశ్లేషిస్తున్నారు. నూతన వ.సే.ప చట్టం వలన దేశ జి.డి.పి రెండంకెల వృద్ధిని అందుకోగలదని ఆశావాహులు నొక్కి వక్కాణిస్తుంటే, వ.సే.ప. చట్టమేమీ సర్వరోగ నివారిణి కాదని దేశ ఆర్థిక రంగంపై దీని దుష్ఫలితాలు త్వరలోనే బయటపడతాయని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఏమైనప్పటికీ మన దేశం సంక్షేమ రాజ్యం కాబట్టి సామాన్య మానవుని సంక్షేమమే ప్రభుత్వ అంతిమ ధ్యేయం కాబట్టి ఎలాంటి సంస్కరణైనా ఆ కోణంలోనే ఉండాలని, ఉంటుందని మరికొందరి ముక్తాయింపు.

ప్రస్తుత పన్ను విధానం వ.సే.ప. విధానం
మూలధర రూ. 1,00,000/- మూలధర రూ. 1,00,000
ఎక్సైజ్‌ సుంకం రూ. 15,000/- వ.సే.ప. రూ. 6,000
1,15,000/- సిజిఎస్‌6%
స్థానిక వ్యాట్‌ 12% 13,800/- జిఎస్‌టి 6% రూ. 6,000

అంత్య ధర రూ. 1,28,800 అంత్య ధర రూ. 1,12,000/-
మూలం - లోకహితం.

1 comment:

  1. వస్తు సేవల పన్ను విహంగ వీక్షణం

    ReplyDelete