Breaking News

వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ఈటీవీతో యువతరం తమ భావాలు పంచుకుంది





వివేకానందుడు చెప్పిన జీవిత సారాన్ని నేటితరం భావానే అర్థం చేసుకుంది. ఆలోచనకు, ఆచరణకు మాత్రం చాలా దూరం ఉందంటోంది. ఈ లోటును భర్తీ చేసేందుకు చిన్నప్పటి నుంచి వివేకానందుని బోధనలపై పాఠ్యాంశాలను చేర్చాలని పాలకులకు సలహా ఇస్తోంది. వివేకానందుని జయంతిని పురస్కరించుకుని ఈటీవీతో యువతరం తమ భావాలు పంచుకుంది.

కొత్తగా కనిపించేలోకం. అప్పుడప్పుడే పరిచయమయ్యే స్వార్థం. అన్నీ తెలుసనుకునే అజ్ఞానం. కాసింత అమాయకత్వం. అన్నీ కలిస్తే.. యవ్వనం. మరోలా చెప్పాలంటే రెండో బాల్యం. ఇక్కడ వేసే అడుగే భవిష్యత్‌ని నిర్దేశిస్తుంది. అదితప్పటడుగైతే.. జీవితమే లేకుండా చేస్తుంది. యువతరమే ప్రపంచానికి భవితవ్యమన్న ఆనందుడు.. కనిపించని స్వార్థం నుంచి పనికొచ్చే పఠనం వరకు అన్ని అంశాలను బోదించాడు. మిగిలింది.. పాటించడమే.

1 comment:

  1. కొత్తగా కనిపించేలోకం. అప్పుడప్పుడే పరిచయమయ్యే స్వార్థం. అన్నీ తెలుసనుకునే అజ్ఞానం. కాసింత అమాయకత్వం. అన్నీ కలిస్తే.. యవ్వనం. మరోలా చెప్పాలంటే రెండో బాల్యం. ఇక్కడ వేసే అడుగే భవిష్యత్‌ని నిర్దేశిస్తుంది. అదితప్పటడుగైతే.. జీవితమే లేకుండా చేస్తుంది. యువతరమే ప్రపంచానికి భవితవ్యమన్న ఆనందుడు.. కనిపించని స్వార్థం నుంచి పనికొచ్చే పఠనం వరకు అన్ని అంశాలను బోదించాడు. మిగిలింది.. పాటించడమే.

    ReplyDelete