Breaking News

జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం





కాలం...! నిత్యనూతనం. అదెప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ-టెక్ యుగంలో ఆ వేగం కాస్త ఎక్కువ. యువతరంలో కొందరు నేర్పుగా అందుకుంటే, మరేందరో ఓదార్పు కోసం చూస్తున్నారు. అయోమయ యవ్వనంలో..అంతా గందరగోళం. ఓటమి భరించలేని విజేతలు, ఓర్పు లేని పోటీదారులు, నిర్ణయాలు తీసుకోలేని నాయకులు.. ఈ తరాన్ని చూస్తే ఇలాంటి వారే ఎక్కువ. వారందరికీ.. వందేళ్లక్రితమే దిశానిర్దేశం చేశాడు.. వివేకానందుడు. జనవరి 12న ఆనందుడి జయంతి పురస్కారించుకోని ఆయన చేసిన దిశానిర్దేశంపై ప్రత్యేక కథనాలతో ఇవాళ్టి యువ సిద్ధమైంది.

మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌...!! పోటీ ప్రపంచంలో అత్యంత అవసరమైన నైపుణ్యం. తొలి మేనేజ్‌ మెంట్‌ గురుగా పేరుపొందిన వివేకానందుడు.. నేటి తరగతి గదుల్లో చెప్పని ఇలాంటి ఎన్నో సంక్లిష్ట అంశాలను ప్రభోదించాడు. ఆయన చెప్పిన బాటలో అడుగులు వేస్తే.. నవోదయానికి దారి దొరికినట్లే.. యువత, వివేకానందుడు దశాబ్దాలైన, శతాబ్దం దాటిన వీడదీయరాని బంధమది. ప్రపంచ భవిష్యత్‌ యువతపైనే ఆధారపడి ఉందన్న ఆనందుడు.

1 comment:

  1. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం

    ReplyDelete