Breaking News

ఛత్రపతి-Chatrapathi


ఎవరికైనా విజయ సాధనకు ప్రోత్సాహం, క్రమశిక్షణ, పట్టుదలా ఉండాలి. ఈ మూడు భించిననాడు ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు.

మహారాష్ట్ర మరాఠా యోధుడు శివాజీ, ఛత్రపతిగా మారడానికి కారకులైన వారు తల్లి జీజాబాయి, గురువు దాదాజీ కొండదేవ్‌, సమర్థ రామదాసు నేర్పించిన క్రమశిక్షణ, వారిచ్చిన ప్రోత్సాహం, దేశభక్తి మొదలైనవాటివ్ల. ఈ క్షణాు కలిగి ఉండడంవ్లనే అతడు చరిత్రలో సాటిలేని యోధుడుగా మిగిలిపోయాడు.

శివాజీ తన తండ్రి షాజీ పరిపానలో మహమ్మదీయ రాజు పానలో చేరిపోయిన రాజ్యాను ఒక్కొక్కటిగా జయించుకుంటూ వచ్చి, తన తల్లి జీజామాతకి ఇష్టమైన సింహగఢ్‌ కోటను జయించి ఆమెకు కానుకగా ఇచ్చాడు.

వరుసగా సంవత్సరా తరబడి అనేక యుద్ధాు చేయడంవ్ల ఎంతగానో అసిపోయాడు. కొన్ని రోజు ప్రశాంత చిత్తంతో కాం గడపాని నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజు దేశ సంచారం చేసి ప్రజ అవసరాు గమనించాని నిశ్చయించుకున్నాడు.

అలా వెళుతుండగా తుకారాం అనే విష్ణుభక్తుడు తన భక్తి పాట ద్వారా ప్రజను ప్రభావితం చేస్తూ విష్ణుభక్తిని ప్రచారం చేస్తున్నాడు. ఆయన పాటు, మాటు విన్న శివాజీకి ఈ యుద్ధాు, రాజ్యకాంక్షు అన్నీ అనవసర కార్యక్రమాుగా తోచాయి. ఈ తుకారాం సన్నిధిలో తన శేష జీవితం ప్రశాంతంగా గడపాని నిశ్చయించుకున్నాడు. తనతో ఉన్న పరివారాన్ని తిరిగి రాజ్యానికి వెళ్ళిపోవసినదిగా ఆదేశించాడు.

సైనికుంతా శివాజీ చర్యకి నిర్ఘాంతపోయారు. ఎందుకంటే మహమ్మదీయ పరిపాన అంతంచేసి హిందూ మతధర్మ పరిరక్షణ చేస్తాడని, అతని తల్లితోపాటు రాజ్యంలోని ప్రజంతా శివాజీపై ఎన్నో ఆశు పెట్టుకున్నారు. ఆ రోజు కోసం అంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. శివాజీ నిర్ణయాన్ని అతని తల్లికి ఎలా తెల్పాలో తెలియక వారు అయోమయంలో పడిపోయారు.

సర్వజ్ఞుడైన తుకారాం శివాజీ కోరికను గ్రహించాడు. అతనిని చేరబిలిచి రాజా నువ్వు హిందూ ధర్మ పరిరక్షణ కోసం శివాంశతో ఈ భూమిపై జన్మించావు. నీకు సరిjైున మార్గాన్ని నిర్దేశించే గురువు సమర్థ రామదాసు. అతనిని కుసుకొని అతడు నీకు చూపిన మార్గంలో నడచి జన్మసార్థకం చేసుకో అని ఆదేశించాడు. శివాజీ సమర్థ రామదాసును కలిసాడు.

రామదాసు రగిలించిన హిందూ ధర్మ పరిరక్షణ మార్గానికి శివాజీ ఉత్తేజితుడయ్యాడు. రామదాసుకు అనేక కానుకు సమర్పించాడు. రామదాసు కూడా శివాజీకి కొన్ని కానుకలిచ్చాడు. అవి ఏంటంటే కొంత మట్టి, కొంత గుర్రపు పెంట, కొన్ని రాళ్ళు. శివాజీ వాటిని భక్తితో స్వీకరించాడు. ఆ కానుకు చూసిన శివాజీ సైనికు అసహ్యించుకున్నారు.

శివాజీ రామదాసు ఇచ్చిన కానుకను మూట కట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళాడు. తల్లికి ఆ మూటలోని వస్తువుని చూపి తన గురువు తనకు ఇవి ఇవ్వటంలోని అర్థమేమిటని ప్రశ్నించాడు.

‘‘నాయనా ఈ మన్ను నీ దేశమాత. ఆమె నిన్ను ఈ మహమ్మదీయు బారి నుండి రక్షించమంటోంది. ఈ రాళ్ళు మన కోటను పటిష్టం చెయ్యమని, ఈ గుర్రపు పెంట ఆశ్విక దళం పెంపొందించుకొమ్మని అర్థం’’ అని వివరించింది.

శివాజీ గురువు సమర్థ రామదాసు ఆదేశం ప్రకారం మహమ్మదీయ రాజ్యాన్నీ వశం చేసుకొని హిందూ రాజ్యస్థాపన గావించి, ఛత్రపతి అని బిరుదు పొందాడు. ఈ బిరుదు పొందినవారు భారతదేశంలో మరొకరు లేరు. ఛత్రపతి అనగా మొత్తం పరిపాన అంతా ఒక రాజు గొడుగు క్రిందకు రావడం అని అర్థం. అంటే దేశం మొత్తం ఒకే రాజు ఆధీనంలో ఉండడం. శివాజీ అంత గొప్పవాడు కావడానికి కారణం. తల్లి గురువు ప్రోత్సాహమే.
మూలం - జాగృతి.

1 comment: