కాలుష్యం వద్దు-No crackers no Pollution, have a Eco friendly Diwali
ప్రజలను ఈతి బాధలకు గురి చేస్తున్న నరకుడిని దునుమాడి...వెలుగులు పండించిన పండగ దీపావళి. చిన్నా, పెద్దా సంతోషంతో సంబరంగా జరుపుకునే వేడుక. ప్రతీ ఇంట్లోనూ చీకట్లు పారద్రోలుతూ చిరుదీపాలు చేసే సందడి. అలాంటి పండగ ఏటేటా ప్రమాదకరంగా.. కాలుష్య భరితంగా మారుతోంది. దీపావళి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందిప్పుడు. టపాసులు, మతాబులు, చిచ్చుబుడ్ల స్థానంలో భయంకరమైన శబ్దంతో బద్దలయ్యే బాంబులు వచ్చాయి. దీపావళి వల్ల ఒక్క రాత్రిలోనే వాయు, శబ్ధ కాలుష్యం వందల రెట్లు పెరుగుతోంది. పండగ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే పరిస్థితి ఇకపైనా కొనసాగాలా? పర్యావరణహిత దీపావళి జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై లేదా?
కాలుష్యం వద్దు-No crackers no Pollution, have a Eco friendly Diwali
ReplyDelete