నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు-Nee Dharmam Nee Sangham Nee Desham
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మినదెవరూ ... హరిశ్చంద్రుడూ
తండ్రి మాటకై కానల కేగినదెవరూ ... శ్రీరామచంద్రుడూ
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా ... లక్ష్మన్నా
పతియె దైవమని తరించిపోయిన దెవరమ్మా ... సీతమ్మా
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం
చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్నా
మేడి పండులా మెరిసే సంఘం గుట్టు విప్పెను వేమన్నా
వితంతువుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి
తెలుగు భారతిని ప్రజల భాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
స్వతంత్ర భారత రథసారథియై సమరాన దూకె నేతాజీ
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజీ
గుండు కెదురుగా గుండె నిలిపెను ఆంధ్ర కేసరీ టంగుటూరీ
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవీ
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం...
- కోడలుదిద్దిన కాపురం (1970)
సత్యం కోసం సతినే అమ్మినదెవరూ ... హరిశ్చంద్రుడూ
ReplyDeleteతండ్రి మాటకై కానల కేగినదెవరూ ... శ్రీరామచంద్రుడూ
అన్న సేవకే అంకితమైనది ఎవరన్నా ... లక్ష్మన్నా
పతియె దైవమని తరించిపోయిన దెవరమ్మా ... సీతమ్మా
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం అనుసరించుటే నీ ధర్మం