డా అంబేద్కర్ సంక్షిప్త జీవిత చరిత్ర ఇది (1 వ భాగం)-Dr.BR Ambedkar Biography in telugu
అందరూ చదవాలి..భారతీయులంతా స్వేచ్చ,సమత,బంధుభావంతో మెలగాలి...
* డా.అంబేద్కర్, సన్యాసం స్వీకరించిన తన పిన తండ్రి ఆశీర్వాదాలతో ఏప్రిల్ 14,1891 న రాంజి సక్పాల్,భీమాబాయ్ దంపతులకు జన్మించాడు.
సంత్ కబీర్ దాస్ ఆధ్యాత్మిక ప్రభావం ఇంట్లో కనిపిస్తుంది.
తండ్రి రాంజి ఒక సైనిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు.
తాను జన్మించిన మహర్ అనే కులం ఆ రోజుల్లో అంటరానిదిగా భావించి,సైనికులుగా కూడా భర్తీ చేసేవారు కాదు..రాంజీ కారణంగా అది తొలగిపోయింది.
* అంబేద్కర్ 10 సంవత్సరాల వయస్సులో బడిలో న్యాయమూర్తి రానడే 101వ జయంతి లో ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు.
ఘోరమేమిటంటే..ఇంతటి మేధస్సు గల అంబేద్కర్ అందరు విద్యార్తులతో కలిసి కూర్చుని తరగతిలో చదవనివ్వరు..అందరితో కలిసి ఆడుకోవడానికి వీలు లేదు.నీళ్ళు త్రాగనివ్వరు.ఒకసారి అన్నదమ్ములిద్దరు ఎడ్లబండిలో వెల్తుంటే మహర్ కులమని తెలిసి బండివాడు వాళ్ళిద్దరినీ క్రింద పడేశాడు.మరొక్కసారి బావి లొ నీళ్ళు త్రాగినందుకు దెబ్బలు కొట్టారు.మరోసారి మంగలి ఇతని వెంట్రుకలు కత్తిరించలేదు.ఈ సంఘటన అతని మనసు పై తీవ్ర ప్రభావం చూపింది.5 ఏళ్ళ వయస్సులొ అమ్మ చనిపొయింది.
* ఈ అన్యాయాలను నిర్మూలించాలంటే తాను బాగా చదువుకోవాలని నిర్ణయించాడు.ముంబాయి ఎల్ఫిన్స్టన్ స్కూల్లో చేరాడు.తండ్రి కొడుకులిద్దరు ఒకె గదిలొ ఒకే చద్దర్ మీద ఒకరు పడుకుంటె , మరొకరు మేల్కొని వుండి, 17 వ వయస్సులో 10వ తరగతి లొ పాసయ్యాడు..మహర్ కులం లో పాస్ కావటం లో మొదటి వాడు
అంబేద్కర్.వడొదర మహరాజ్ ఇచ్చే 25 రుపాయల స్కాలర్షిప్ తో కాలేజిలో 1912 లో బి ఏ పూర్తిచేశాడు.
1913 లో తండ్రి రాంజి మరణించారు.అదే సంవత్సరం అమెరికా వెళ్ళాడు.
కొలంబియా విశ్వవిద్యాలయం లో 1915 లొ ఎం ఏ పట్టా పొందాడు.
1916 లో పి హెచ్ డి పొందాడు.ప్రొవిన్సియల్ ఎకనామిక్ సిస్టం ఇన్ బ్రిటిష్ ఇండియా అనే పరిశోధనా పత్రం వ్రాసి మహరాజ్ సయాజిరావ్ కి అర్పితం చేశాడు.అదే కొలంబియా విశ్వవిద్యాలయం 1952 లో అంబేద్కర్ కు డాక్టర్ ఆఫ్ లాజ్ గౌరవ బిరుదు ఇచ్చింది.
1916 లో ఆయన లండన్ వెళ్ళి ఉన్నత విద్య పొందారు..తిరిగి వచ్చి మళ్ళీ ఇంగ్లాండ్ లో 1922 లో బారిస్టర్ అయ్యాడు.
1923 లో ప్రాబ్లం ఆఫ్ ద రూపీ అను వ్యాసం వ్రాశారు. దీనికి గాను డి ఎస్ సి గౌరవం పొందారు.అది పొందిన మొదటి భారతీయుడ య్యాడు.
*గుజరాత్ లోని వడొదర లో సయాజిరావ్ వద్ద రక్షణ కార్యదర్శి గా పనిచేశారు.
ఆఫీస్ లో గుమాస్తాల ద్వారా అంటరాని తనపు అవమానాలు పొందాడు.ఫైళ్ళు చేతికి ఇవ్వకుండా టేబుల్ పైన విసిరిన సంఘటనలు, ఇళ్ళు కిరాయకు ఇవ్వకుండా కొందరు పార్శీలు ఇంటినుండి వెళ్ళగొట్టడం ....ఇవన్నీ డా అంబేద్కర్ ని తీవ్రంగా ఆలోచింపచేశాయి.
* మహర్ కులం లో పుట్టిన అపరాధం ఎంత కాలం సహించాలి?
చదువుకుంటే గౌరవం లభిస్తుందనుకుంటే, కనీసం సమానంగా చూడని పరిస్థితి.ఎందుకిలా?
చివరకు చప్రాసి కూడా తాకడానికి ఇష్టపడటం లేదు.నా పరిస్థితి ఇలా వుంటే నా చదువురాని నా నిమ్న వర్గాల ప్రజల బాధలు ఎవరికి చెప్పుకోవాలి.?
ఇది సహించరాని విషయం..
ఇక నుండి నా పూర్తి జీవితం సామాజిక అన్యాయాల నెదిరించడానికి వెచ్చించాలి..మహాత్మ ఫూలె ద్వారా విద్యా రంగం లో ఒక ప్రయత్నమైతే జరిగింది.విద్య ఒక్కటే కాదు నిమ్న వర్గాలను సంఘటిత పరిచి ఈ అన్యాయాలను వ్యతిరేకించాలి.ఆ దిశలో గట్టిగా కొన్ని ప్రణాళికలు రచించి ఉద్యమించాలి..
*ఈ విధంగా డా అంబేద్కర్ తన అలోచనలకు క్రియా రూపాన్ని ఇచ్చేందుకు 1920 లో మూకనాయక్ పత్రికను ప్రారంభించారు.స్వాతంత్ర్య ఉద్యమం కంటే సామాజిక ఆందోళనకు ప్రాధాన్యత ఇచ్చారు..సామాజిక సంస్కరణ..సామాజిక సమత...సామాజిక సమరసత ..కోసం ముందుకు కదిలాడు.
కొల్ హా పూర్ షాహూ మహరాజ్ మూకనాయక్ పత్రికకు నిధులు అందజేశారు.
డా అంబేద్కర్ తాను పొందిన లెక్కలేనన్ని పట్టాలకు, మంచి ధనం సంపాదించగలవాడే..కాని సమరసతా సాధనలొ తన జీవితం ఫణంగా పెట్టాడు.
*1924 లో బహిష్కృత భారత్ అను సంస్థ ను ప్రారంభించి నిమ్న వర్గాల చదువు, ఆర్థిక సహకారానికి తోడై నిలిచాడు. విద్యార్థులకు హాస్టల్, ఒక గ్రంధాలయం తెరిచాడు.
*1927 లో మహద్ చెరువు సత్యాగ్రహం స్వాభిమానం తో మొదటి సారిగా బహిరంగ ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.మొదటిసారిగా ఆ చెరువు నీళ్ళు తాగాడు..వెంటనే సవర్ణులు దాడి చేశారు.విశేషమేమిటంటే అది మహాత్మ ఫూలే జన్మ శతాబ్ది సంవత్సరం.
* 1930 లో మార్చి 2 న నాసిక్ లోని కాలా రాం మందిర్ లో ఎస్ సి వర్గాల ప్రవేశం కోసం సత్యాగ్రహం చేశాడు.ఆ తరువాత 1935 లో అందరి కోసం ఆ దేవాలయ ద్వారాలు తెరుచుకున్నాయి.
*1930 లో లండన్ లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళారు.అక్కడ నిమ్నవర్గాల సమస్యలు ముందు పెట్టాడు.
దీన్ని ఆసరగా తీసుకుని ఆంగ్లేయులు విభజించు ..పాలించు అను కుటిలనీతితో హిందువుల నుండి నిమ్నవర్గాల ప్రజలను వేరుచేసే ప్రయత్నం మొదలు పెడితే,,దానిని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
* 1931 లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళేముందు గాంధిజీ ని కలిశారు.కాంగ్రెస్ నిమ్న వర్గాలకు చేస్తున్నదేమీ లేదని చెప్పాడు. సవర్ణులు ఇచ్చిన హరిజన్ అనే పదాన్ని వ్యతిరేకించాడు.
లండన్ సమావేశం తో వారిద్దరి మధ్య భేదాలు ఎక్కువయ్యాయి..బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్ పేరుతో నిమ్నవర్గాల కోసం ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించి, నిమ్న వర్గాల ప్రజలే ఓటు వేసి విధానాన్ని ప్రతిపాదించారు..దీన్ని గాంధిజి వ్యతిరేకించి, ఆమరణ నిరాహార దీక్ష జరిపారు..దేశమంతా దాని ప్రభావం కనపడింది.డా అంబేద్కర్ దిగి వచ్చి,పూణా వెళ్ళి, పూణా యాక్ట్ ఒప్పందాన్ని చేసుకున్నారు..బ్రిటీష్ వారి కుట్ర కేవలం నిమ్న వర్గాలను హిందువులనుండి వేరుచేయటమనే భావం గాంధిజి కి కలిగింది..పూనా ఒప్పందం తరువాత 148 నియోజకవర్గాలు ప్రత్యేకించబడినాయి.
*1932 లో మూడవసారి రౌండ్ టేబుల్ సమావేశం లో ముస్లిం లీగ్ ప్రత్యేక దేశం కోసం చేసిన ప్రతిపాదనను డా అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు.
అందరూ చదవాలి..భారతీయులంతా స్వేచ్చ,సమత,బంధుభావంతో మెలగాలి...
ReplyDeleteVeeriy good
DeleteHatsaff
ReplyDeleteGood
ReplyDeleteSuperb
ReplyDeleteCan I get the PDF file of autobiography of dr. Br ambedkar sir. ..
ReplyDeleteOk
ReplyDeleteOk
ReplyDeleteVery good and useful thanking you.
ReplyDeleteExcellent,super
ReplyDeleteExcellent
ReplyDeleteసో గుడ్ nullerge
ReplyDeleteSuper
ReplyDelete