Breaking News

తెలంగాణ ప్రార్థన గీతం (Telangana Prayer Song)


పల్లవి :
తెలంగాణ జననీ నీకు వందనం
తెలంగాణ పుడమీ ఓ వజ్రమందిరం ......
తెలంగాణ జననీ నీకు వందనం
తెలంగాణ పుడమి ఓ వజ్ర మందిరం
మాతృభూమి ఋణం తీర్చు నీ పిల్లలం
పుణ్య భూమి చరిత కొరకు పునరంకితం
భావి భారత దిక్కులం తెలంగాణ బిడ్డలం
నవ్య చరిత లిఖించే స్వర్ణ సిరా చుక్కలం
ll తెలంగాణ జననీ ll
చరణం 1 భాగ్యనగరమే కిరీటముగ ధరిస్తివమ్మ
సింగరేణి నే ఉంగరముగ తోడిగినావమ్మ
మేడలో మణిహారలై మెరిసేను నీ జిల్లాలు
సుందర నదులన్నీ నీ జడలో సుమహారాలు
గోదావరి క్రిష్ణమ్మతో నిత్యం అభిషేఖమై
మాగాణి నేలమ్మగ మారిన ధనరాశి వై
ప్రకృతే పట్టుయై నీ మేనుకు వస్త్రమై
సంస్కృతే వర్ణమై నీ నుదుటికి తిలకమై
బతుకమ్మా పువ్వులతో నిండుగ శోభిస్తూ
బంగారు పంటలెన్నో దండిగ మాకిస్తూ
దైవమై వెలసితివమ్మా..........
త్యాగ ధరణి వై వెలిగితివమ్మ .....
ll తెలంగాణ ll
చరణం 2 జానపదమునే జావళి గా పాడితివమ్మ
రాణి రుద్రమగా ధీరత్వం చూపితివమ్మ
పోతన నీర్చేను నీ ఒడిలో ఓనమాలు
కొమరంభీముడు నీ మదిలో చైతన్యము
నీ పల్లె పట్టణము మానవతకు ఆలయమై
మా ఆట పాటలు నీ మనసుకు ఆహ్లదమై
స్నేహమే లొకమై నీ సేవకు ఏకమై
జాతి కే గర్వమై తెలంగాణ బిడ్డలమై
లౌకికమే ఐక్యమనే నీతిని పాటిస్తూ
భారతమాత మురిసిపోయే ప్రగతిని సాధిస్తూ
ధన్య మై పోతామమ్మా ........
జన్మ అంకితమే చేసెదమమ్మా .............
తెలంగాణ జననీ నీకు వందనం
తెలంగాణ పుడమీ ఓ వజ్రమందిరం ......
రచన : సాయి సిరి
సంగీతం , గానం : జై శ్రీనివాస్

1 comment:

  1. తెలంగాణ ప్రార్థన గీతం (Telangana Prayer Song).

    ReplyDelete