స్వదేశీ ఐక్యతకు ప్రాణం పోసిన సర్దార్ పటేల్ (Sardar Vallabhai Patel)
స్వతంత్య్ర పోరాటకాలంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని పారద్రో లటానికి నాటి జాతినేతలు దేశభక్తిప్రూరితమైన స్వదేశీ ఐక్యతకు ప్రాణంపోశారు.శతాబ్దంక్రితం నాటి అఖండ భరతావని, స్వాతంత్య్ర సాధనా ఏకైక లక్ష్యంతో ఒకే త్రాటిపై మత,కుల, వర్గ, ప్రాంతీయ,భాష బేధాలకు అతీతంగా సమరోత్సాహంతో ఐక్యమైంది.లోకమాన్యతిలక్ స్వరాజ్యం జన్మహ క్కుగా,బకించంద్రుడు వందేమాతరం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జైహింద్, భగత్‌సింగ్ వంటి విప్లవవీరులు,అల్లూరి శ్రీరామరాజు వంటి ఎందరో త్యాగశీలురు భారతమాత దాస్యవిముక్తికి ఆసేతు హిమాచలం కదిలించారు. మహాత్ముని సత్యం, అహింసల దాదాపు మూడుదశాబ్దాల శాంతియుత సమరం జాతిని ఏకోన్ముఖం చేసింది.
అఖండ భారతదేశం మతప్రాతిపదికపై విభజింపబడటం స్వాతం త్య్రానంతరం దురదృష్టపరిణామం.దానికితోడు గత అరవైఏళ్ల పైబ డిన స్వతంత్ర భారతం హిందూ,ముస్లిమ్ మతకల్లోలాలు, కాశ్మీర్, పంజాబ,అసోం వంటి రాష్ట్రాలలో వేర్పాటువాదం,నక్సలిజం, క్రమేపీ ముస్లిం తీవ్రవాదం ఉగ్రవాదంగా మతద్వేషం పెనుప్రమాద మైంది.తొలి మతోన్మాద ఘాతుకానికి జాతిపిత మహాత్ముడు బలికా వటం చారిత్రక దురదృష్టదుర్ఘటన. ఇస్లామిక్ దేశంగా ఆవిర్భవించిన పాకిస్థాన్ పక్కలోబల్లెమైంది. ద్విజాతి సిద్ధాంత ప్రవక్త జిన్నా పుణ్యమా అని హిందుత్వవాదం కూడా నాడే తలెత్తింది. డాక్టర్ కేశవబలీరామ్ హెడ్గేవార్1925లో హిందూభావ సంఘటన ఆశ యంతో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘం స్థాపించారు. వీరసావ ర్కార్ వంటి స్వాతంత్య్రపోరాట విప్లవవీరులు, హిందూదేశభక్తులైన యువకులు ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ జాతీయవాదానికి బాస టగా నిలిచారు.స్వాతంత్య్రానంతరం మూడు దశాబ్దాలు అనంతరం లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, సంపూర్ణ విప్లవానికి, ప్రతిపక్ష పార్టీల జనతాఐక్యతకు మహోద్యమం నిర్వహించారు. క్రమేపీ కను మరుగైన జనసంఘ్,నాయకత్వం, భారతీయజనతా పార్టీగా రూపు దిద్దుకొని 1998నాటికి వాజ్‌పా§్‌ు,2014నాటికి నరేంద్రమోడీలకు ప్రధానులు కాగల ప్రత్యామ్నాయ రాజకీయశక్తి తలెత్తింది.
ఉక్కు దృఢదీక్షాపరుడు పటేల్
భారత ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థకు, మతప్రసక్తి లేని రాజ్యాంగం ప్రాణంపోసింది. తొలి ప్రధానిగా జవహార్‌లాల్ నెహ్రూ ,ఉప ప్రధానిగా వల్లభా§్‌ుపటేల్ గాంధేయ వాదు లుగా చరిత్రాత్మక నవభారత నిర్మాణా నికి నడుంకట్టారు. జాతీయ ఐక్యతా సాధనలో సర్దార్ పటేల్ అమోఘంగా సమర్థవంతమైన దీక్షాదక్షతతో వ్యవ హరించారు. 1875 అక్టోబరు 31న గుజ రాత్‌లోని నాడియాడ్‌లో జన్మించిన వల్లభాయ్ 1921 నుంచిగాంధీజీ అడు గుజాడలలో అగ్రశ్రేణి జాతినేతగా గుర్తింపు సాధించారు. 1928 బార్దోలీ సత్యాగ్రహో ద్యమనేతగా, స్వాతంత్య్ర పోరాటంలో వివిధ ఘట్టాలలో దృఢసంకల్ప దీక్షాదక్షలతో నిష్కామత్యాగశీలిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించారు. స్వాతంత్య్రానంతరం 554 చిన్న పెద్ద సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనంచేసి నవభారత ఐక్యతా నిర్మాతగా ఉక్కుమనిషిగా ఖ్యాతి పొందారు. సర్దార్‌పటేల్ డిప్యూటీ ప్రధానిగా నెహ్రూకు సహకరించారు. 1950 డిసెంబరు 15న తనువ్ఞ చాలించారు. ముక్కుసూటిగా నిర్భయంగా నీతినిజాయితీలతో జనశ్రేయస్సు లక్ష్యంగా జీవితాంతం సర్దార్‌ప టేల్ శ్రమించారు. సహజసిద్ధమైన మర్తాధోతీ నిరాడంబర స్వదేశీ వస్త్రధారణ, బారిస్టర్ విద్యాధికుడైనా సామాన్యునిగా జీవించిన మహోన్నతుడు.1931లోకరాచీ కాంగ్రెస్ అధ్యక్షునిగా వ్యవహరిం చినా 1946లో కానిస్టిట్యుయంట్ అసెంబ్లీ సబ్ కమిటీల ఛైర్మన్ అయినా సమర్థవంతంగా సేవలందించారు. 1948 సెప్టెంబరులో సైనిక చర్యతో నైజాంనవాబు తలవంచి లొంగదీసిన కార్యదీక్షాదక్షు నిగా దురహంకార మతోన్మాదానికి అయశంగా పటేల్ వ్యవహరిం చారు. ఆయన దృఢవైఖరికి వక్రభాష్యం చెప్పిన నాటి కాంగ్రెస్ నేత లున్నారు. హిందూపక్షపాతిగా ఆరోపించారు. మహాత్మునికి ఫిర్యా దులు చేసారు. అయితే మతోన్మాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసి భారత సార్వభౌమాధికారాన్ని సర్వసత్తాక ప్రతిపత్తిని నిలబెట్టగల ఐరన్ మేన్‌ఆఫ్ ఇండియాను గాంధీజీ ఆత్మీయునిగా అభిమానిం చారు. గాంధీజీ హత్యానంతరం, డిప్యూటీ ప్రధానిగా కేంద్రప్రభు త్వం హోంశాఖా మంత్రిగా సర్దార్‌పటేల్ తీవ్ర మనస్తాప పరిస్థితి ఎదుర్కొన్నారు. మత విద్వేషం మరింత చెలరేగటంతో హంతకుడు గాడ్సేమాజీ స్వయం సేవకుడు కావటంతో అగ్నికి ఆజ్యం పోసినట్ల యింది. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను నిర్బంధించటమే కాకుండా 1948 ఫిబ్రరి 4న సంఘాన్ని నిషేధించాల్సివచ్చింది. 1949 జూలై 11న ఆర్‌ఎస్‌ఎస్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది.
పటేల్ ఆందరికీ ఆరాధ్యుడు
గుజరాత్,సర్దార్‌పటేల్ స్వరాష్ట్రం కావటంతో ముఖ్యమంత్రిగా మోడీ సహజంగా సర్దార్‌ను అభిమానిస్తున్నారు. జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పరోక్షంగా సోనియాగాంధీ (మన్మోహన్ ప్రధానిగొ) 67 సంవత్సరాల స్వతంత్ర భారతంలో సుమారు 40ఏళ్లు పాలించారు. నెహ్రూ శకపురుషునిగా, భారతీయ జాతీయ కాంగ్రెస్‌కు వారసత్వదేశాధికారం లభిస్తూనే ఉంది. భార తీయ జనతాపార్టీని కొత్త ఆలోచనలు, విధానాలతో మలుపు తిప్పిన మేధావంతుడైన మోడీ కాంగ్రెస్‌పార్టీని మళ్లీ తలెత్తకుండా చేయా లంటే వారసత్వరాజకీయాలకి చరమగీతం పాడాలంటే నెహ్రూ పాలనా విధానాలను ఎండకట్టక తప్పదు.అప్పుడే భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం దేశాన్ని పాలించే బాధ్యత చేపట్టడానికి అవకాశం లభిస్తుంది. అదీగాక కాంగ్రెస్‌లో పేరుకుపోయిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం పాలనావ్యవహారాలలో అసమర్థత, అవకతవకలు గ్రహిం చిన భారతప్రజావళి,మోడీకి పట్టంకట్టారు. యు.పి.ఎ,ఎన్.డి.ఎలు నామమాత్రమే. ఏ మతాధిపత్య ప్రలోభాలకు, విధాన ఆకర్షణలకు లొంగకుండా తామరాకుమీద నీటిబొట్టులా ప్రస్తుత ప్రధాని సార ధ్యం వహిస్తేనే బి.జె.పికి భవిష్యత్తు. సర్దార్‌పటేల్‌ను ప్రపంచంలో ఎతైన విగ్రహంగా నెలకొల్పి ఆరాధించడం పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా గుర్తించడం ప్రధాని నరేంద్రమోడీ రాజకీయ విజ్ఞత, చాతుర్యానికి నిదర్శనం. సర్దార్‌కు అన్ని విధాలా ఆ అర్హత ఉండనే ఉంది.
Source: Vaartha Daily
స్వదేశీ ఐక్యతకు ప్రాణం పోసిన సర్దార్ పటేల్ (Sardar Vallabhai Patel).
ReplyDeleteNice post
ReplyDeleteGood
ReplyDeleteMan of unity
ReplyDelete