Breaking News

సత్యేంద్రనాథ్ బోస్ (Satyendranath Bose)

జననం: జనవరి 1, 1894
మరణం: ఫిబ్రవరి 4 ,1974

సత్యేంద్రనాథ్ బోస్ (FRS), భారత దేశ బౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత భౌతిక శాస్త్రంలో విశేష గుర్తింపు పొందాడు.

బోస్ కలకత్తా లో జన్మించాడు. ఆయన 1920 లలో క్వాంటం మెకానిక్స్ లో బోస్-ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ మరియు బోస్-ఐన్‌స్టీన్ కండెన్‌సేట్ సిద్ధాంతం నిర్మాణానికి గాను చేసిన కృషికి గుర్తింపు పొందాడు. ఆయన భారత దేశం లో రెండవ అత్యున్నత అవార్డు అయిన పద్మ విభూషణ ను 1954 లో పొందాడు.

ప్రస్తుతం విశ్వంలో వ్యాపించిఉన్నాయని భావిస్తున్న దైవకణాలకు ఆయన పేరును అనగా హిగ్స్-బోసన్ కణాలని పాల్ డిరాక్ నామకరణం చేశాడు.

ఆయన స్వయం బోధకుడు, బహుభాషా కోవిదుడు. ఆయన అనేక రంగాలలో అనగా భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము , జీవ శాస్త్రము , లోహ సంగ్రహణ శాస్త్రము , తత్వ శాస్త్రము, కళలు , సాహిత్యం మరియు సంగీతం కృషిచేశారు. ఆయన స్వతంత్ర్య భారత దేశంలో అనేక పరిశోధనా కమిటీలలో పనిచేసి విశేష సేవ చేశారు.

బాల్య జీవితం
బోస్ భారత దేశం లోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్య పట్టణమైన కలకత్తా లో జన్మించారు. ఈయన తండ్రి సురేంధ్రనాథ్ బోస్ ఒక రైల్వే ఉద్యోగి. సురేంద్రనాథ్ బోస్ కు మొదటి సంతానంగా సతేంద్రనాథ్ బోస్ జన్మించారు. ఈయన పూర్వీకులు కలకత్తా కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియా జిల్లాలోని బారా జగులియా లో ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో విద్యాభ్యాసం ప్రారంభించారు.ఆయన చదివే పాఠశాల తన యింటికి దగ్గరలో ఉండేది. తర్వాత ఆయన కుటుంబం గోవాబహన్ కు మారినది. అచ్చట గల న్యూ ఇండియన్ పాఠశాలలో చేరాడు. తన పాఠశాల చివరి సంవత్సరంలో ఆయన "హిందూ పాఠశాల" కు మారాడు. 1909 లో జరిగిన మెట్రిక్యులేషన్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు పొంది ఉత్తీర్ణుడయ్యాడు. ఆయన తర్వాత విజ్ఞాన శాస్త్రం నందు ఇంటర్ మీడియట్ లో కలకత్తా నందు గల ప్రెసిడెన్సీ కళాశాల లో చేరాడు. అచట కీర్తి ప్రతిష్టలు పొందిన ఉపాధ్యాయులైన జగదీశ్ చంద్రబోస్ మరియు ప్రఫుల్ల చంద్రరాయ్ చే బోధింపబడ్డాడు. రెండు సంవత్సరాల తర్వాత ఢాకా నుండి మేఘనాథ్ సాహ ఇదే కళాశాలలో చేరాడు. పి.సి.మహలానోబిస్ మరియు సిసిర్ కుమార్ మిత్రా లు ఈయన కంటే కొన్ని సంవత్సరములు సీనియర్లు. సత్యేంద్రనాథ్ బోస్ బి.యస్సీ నందు "అనువర్తిత గణిత శాస్త్రం " ను ప్రధాన విషయంగా తీసుకొని 1913 లో మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. 1915 లో అనువర్తిత గణిత శాస్త్రం నందు ఎం.యస్సీ కూడా పూర్తిచేశాడు. ఎం.యస్సీ నందు కలకత్తా విశ్వవిద్యాలయంలో కొత్త రికార్డును స్వంతం చేసుకున్నాడు.అది ఇంతవరకు ఎవరూ అధికమించకపోవడం విశెషం.

ఎం.యస్సీ పూర్తి చేసిన తర్వాత 1916 లో కలకత్తా విశ్వవిద్యాలయంలో పరిశోధకుడు గా చేరాడు. అచట ఆయన సాపేక్ష సిద్ధాంతం పై తన పరిశోధనలు ప్రారంభించారు. ఇది విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి చరిత్రలో ఒక విశేషమైన యుగంగా చెప్పుకోవచ్చు.ఆదే సమయంలో ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం వెలువడింది. దాని ముఖ్య ఫలితాల వెలువడినవి.

సత్యేంద్రనాథ్ బోస్ తన 20 వ సంవత్సరం లో "ఉషావతి" ని వివాహం చేసుకున్నారు. వారికి తొమ్మిది మంది పిల్లలు జన్మించారు. వారిలో ఇద్దరు బాల్య దశయందే మరణించారు. ఆయన 1974 లో మరణించే నాటికి తన వద్ద భార్య, ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

ఆయన బహుభాషా కోవిదుడు. ఆయన బెంగాలీ, ఆంగ్లం, ప్రెంచ్, జర్మన్, సంస్కృతం భాషలందు మరియు టెన్నిసన్, రవీంద్రనాధ టాగూరు మరియు కాళిదాసు కవిత్వాల యందు నిష్ణాతుడు.ఆయన వయొలిన్ వంటి వాద్య పరికరం అయిన ఎస్రాజ్ కూడా వాయించేవాడు.

1 comment:

  1. గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్.

    ReplyDelete