భారతరత్న (Bharat Ratna)
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954 లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రదానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడ ఉన్నారు. ఈ పురస్కారం 13 జులై 1977 నుండి 26 జనవరి 1980 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. మరియు ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్ కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.
ఎలాంటి జాతి, ఉద్యోగం,స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.
భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటీ అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.
ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధి గా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987) మరియు నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.
పేరు సంవత్సరం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975) 1954
చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972) 1954
డా.సి.వి.రామన్ (1888-1970) 1954
డా. భగవాన్ దాస్ (1869-1958) 1955
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962) 1955
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964) 1955
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961) 1957
ధొండొ కేశవ కార్వే (1858-1962) 1958
డా. బీ.సీ.రాయ్ (1882-1962) 1961
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962) 1961
రాజేంద్ర ప్రసాద్ (1884-1963) 1962
డా. జాకీర్ హుస్సేన్(1897-1969) 1963
పాండురంగ వామన్ కానే (1880-1972) 1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966) 1966
ఇందిరాగాంధీ (1917-1984) 1971
వీ.వీ.గిరి (1894-1980) 1975
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975) 1976
మదర్ థెరీసా (1910-1997) 1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982) 1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988) 1987
యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987) 1988
బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956) 1990
నెల్సన్ మండేలా (జ. 1918) 1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991) 1991
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950) 1991
మొరార్జీ దేశాయి (1896-1995) 1991
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958) 1992
జే.ఆర్.డీ.టాటా (1904-1993)- 1992
సత్యజిత్ రే (1922-1992)- 1992
సుభాష్ చంద్ర బోస్ (1897-1945) (తరువాత నేతాజీ కుటుంబ సభ్యులచే తిరస్కరించబడింది) -1992
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931)- 1997
గుర్జారీలాల్ నందా (1898-1998)- 1997
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995)- 1997
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004)- 1998
సి.సుబ్రమణ్యం (1910-2000) -1998
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979)- 1998
రవి శంకర్ (జ. 1920)- 1999
అమర్త్య సేన్ (జ. 1933) -1999
గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927)- 1999
లతా మంగేష్కర్ (జ. 1929)- 2001
బిస్మిల్లా ఖాన్ (జ 1916) -2001
భీమ్ సేన్ జోషి (జ. 1922)- 2008
సచిన్ టెండూల్కర్ -2014
సి. ఎన్. ఆర్. రావు -2014
మదన్ మోహన్ మాలవ్యా -2015
అటల్ బిహారీ వాజపేయి -2015
భారతరత్న (Bharat Ratna)...
ReplyDelete