Breaking News

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము


గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (November 25) "అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము " గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.

" ఓ దేశ మహిళ స్థితిగతుల్ని చూసి ఆ దేశ పరిస్థితిని ఇట్టే చెప్పేయవచ్చును " అన్నారు పండిత జవహర్ లాల్ నెహ్రూ. నిజమే కదా . ఒక దేశ మహిళలు ఆ దేశము యొక్క నాగరికతకు ప్రతిబింబం వంటి వారు . నాగరికత ఆరంభం అయిననాటి నుంచి భారతీయ మహిళలకు ఎంతో గుర్తింపు , ప్రాధాన్యత ఉన్నాయి . మన దేశములోని గొప్ప మహిళల గురించి చరిత్ర పేర్కొంటుంది ఎన్నో విశేషాలు . దేశ జనాభా లో దాదాపుగా సగము సంఖ్య వారిది . వివిద రూపాలలో జాతీయ , ఆర్ధిక పురోగతిలో మహిళలు తమదైన పాత్ర పోషిస్తున్నారు . మహిళలు మంచి స్థాయిని అనుభవిస్తున్నట్లయితే అక్కడి సమాజము సరైన వికాసం తో , బాధ్యతతో ఉన్నదని అర్ధము .

ప్రాచీన భారతం లో ఈ జీవితం లోని అన్ని కోణాల్లోనూ పురుషు లతో సమంగా తమ స్థాయిని అనుభవించే వారు . పురుషులు మాదిరిగానే చదువుకునే వారు . గొప్ప పండితులు , కవయిత్రులు , ఫిలాసఫర్లు గా ఎదిగినవారూ ఉన్నారు . ఒక్క మాటలో చెప్పలంటే స్త్రీ ఆ రోఉల్లో " లక్ష్మీ దేవి " కి తీసిపోని స్థానాన్ని అనుభవించినది . అర్ధాంగి గా సంపూర్ణ పాత్ర పోషించేది . స్వయంవరం ద్వారా తన భర్త ను ఎంఫికచేసుకునే స్వేచ్చ ఆనాటి మహిళలకు ఉండేవని పురాణాలు వలన మనకు అవగతం అవుతుంది . వైదిక యుగం తరువాత స్త్రీ స్థాయి తగ్గనారంభించింది . సమాజము లో లింగవివక్షత పాకడం మొదలైంది . మధ్య ప్రాచీన కాలం నాటికి మహిళ స్థితిగతుల్లో గణనీయమైన తేడాలొచ్చేశాయి . నిజం చెప్పాలంటే స్త్రీ జీవితం లో చీకటికోణము మొదలైంది .. అప్పుడే.

నేటి సమాజము లో స్త్రీ లు అనేక సామాజిక , ఆర్ధిక , రాజకీయము , విద్యాపరము గా సమస్యలు ఎదుర్కొంటున్నారు . గృహ హింసలు , స్త్రీలపై అత్యాచారాలు , లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి . అత్మనూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు . వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నములో 1999 డిసెంబరు 17 వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ , స్త్రీ హింసా వ్యతిరేక దినము గా పాటించాలని ఈ తీర్మానము సారాంశము.
- Dr. శేషగిరిరావు.

9 comments:

  1. అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము.

    ReplyDelete
  2. నేటి నుంచైనా మన దేశంలో మహిళలపై ఘటనలు తగ్గాలి అని కోరుకుందాం.

    ReplyDelete
  3. Be the Change you want to see in this world.-Mahatma Gandhi.

    The change should start from our self and spread the message to all.

    ReplyDelete
  4. Stop violence against women

    ReplyDelete
  5. Let's join with us.

    ReplyDelete
  6. Thanks for your information

    ReplyDelete