పసితనంపై పని‘భారం’
బాల కార్మికులు అనే పదం రోజువారీ, నిరంతర శ్రామికులుగా పనిచేసే బాల లను సూచిస్తుంది. బాల కార్మికతను అనేక అంతర్జాతీయ సంస్థలు దోపిడీ వ్యవస్థగా పరి గణిస్తున్నాయి, అనేక దేశాల్లో ఇది చట్టవిరు ద్ధం కూడా. చరిత్రవ్యాప్తంగా బాల కార్మికుల ను వివిధ రకాలుగా ఉపయోగించుకున్నారు. అయితే పారిశ్రామిక విప్లవం సందర్భంగా శ్రామిక పరిస్థితుల్లో మార్పులు, సార్వత్రిక విద్య ప్రవేశం, శ్రామికులు, బాలల హక్కులు తెరపైకి రావడంతో ఇది ప్రజా సమస్యగా మారింది. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో, నిర్ణీత వయస్సులోపల ఉన్న బాలలు (ఇంటి పనులు లేదా పాఠశాల సంబంధ పనులు మినహాయించి) పని చేయడాన్ని అక్రమం లేదా దోపిడీగా పరిగణిస్తారు.
నిర్దిష్ట వయస్సు లోపల ఉన్న బాలలను పనిలోకి తీసుకోవడా నికి యజమానులకు అనుమతి లేదు. కనీస వయస్సు అనేది దేశం, పనిని బట్టి మారు తుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 1973 లో చేసిన కనీస వయస్సు ఒప్పందాన్ని దేశా లు ఆమోదించి, 14 నుంచి 16 సంవత్సరాల మధ్య కనీస వయస్సు పరిమితిని విధించా యి. ఎటువంటి ఆంక్షలు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏదైనా వ్యవస్థలో పనికి వెళ్లేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రా ల్లోని బాల కార్మిక చట్టాలు కనీస వయస్సును 16 ఏళ్లుగా నిర్ణయించాయి.
బాలకార్మిక వ్యవస్థ - చరిత్ర...
పారిశ్రామిక విప్లవం సందర్భంగా, ప్రమాద కర, ప్రాణాంతక పని పరిస్థితులు ఉండే ఉత్పాదక కర్మాగారాల్లో కేవలం నాలుగేళ్ల వయస్సు ఉన్న బాలలను కూడా పనిలోకి తీసుకునేవారు. దీనిని ఆధారంగా చేసుకొని, సంపన్న దేశాలు ఇప్పుడు బాలలను కార్మికు లుగా ఉపయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనగా, చట్టవ్యతిరేకంగా పరిగణిసు ్తన్నాయి, అయితే కొన్ని పేద దేశాలు మాత్రం బాల కార్మిక వ్యవస్థను అనుమతించడం లేదా ఉపేక్షించడం చేస్తున్నాయి.
కర్మాగారాలు, గనులు, చిమ్నీలను శుభ్రపరిచేపనుల్లో బాలలను ఉపయోగించడం వలన విక్టోరియా శకం అపఖ్యాతి పాలైంది. పారిశ్రా మిక విప్లవం ప్రారంభం నుంచి బాల కార్మికులు అందులో కీలకపాత్ర పోషించారు, తరచుగా ఆర్థిక ఇబ్బందులు వారిని పనివైపు ప్రోత్సహించేవి, ఉదాహరణకు చార్లెస్ డికెన్స్ 12 ఏళ్ల వయస్సులోనే రుణగస్త్ర కారాగారం లో ఉన్న అతని కుటుంబంతోపాటు బ్లాకింగ్ కర్మాగారం (బూట్లు పాలిష్ చేసే పరిశ్రమ)లో పనిచేశాడు. పేద కుటుంబాల మనుగడలో పిల్లలు తమవంతు పాత్ర పోషించాల్సి వచ్చే ది, తరుచుగా బాలలు కుటుంబ పోషణలో భాగంగా ప్రమాదకర ఉద్యోగాల్లో తక్కువ వేతనాలకు ఎక్కువ గంటలు పనిచేసేవారు.
చురుకైన పిల్లలను చిమ్నీలను శుభ్రపరిచేందుకు ఉపయో గించేవారు. చిన్న పిల్లలను యంత్రాల కింద దూది పోగులను సేకరించేందుకు, పెద్దవారు వెళ్లేందుకు కుద రని బొగ్గు గనుల్లోని ఇరుకైన సొరంగ మార్గా ల్లో పని చేయించేందుకు కూడా పిల్లలను ఉపయోగించు కునేవారు. చిన్న పనుల కోసం తిరిగేందుకు, రోడ్లు ఊడ్చేందుకు, బూట్లు పాలిష్ చేసేందుకు లేదా అగ్గిపెట్టలు, పూలు వంటి తక్కువ ఖరీదైన వస్తువులను విక్రయిం చేందుకు కూడా పిల్లలనే ఉపయోగించేవారు. కొంతమంది పిల్లలను భవన లేదా గృహ సేవ కులుగా బాధ్యతాయుతమైన వృత్తుల్లో ఉమ్మే దువారులుగా తీసుకునేవారు (18వ శతాబ్దం మధ్యకాలం వరకు లండన్‌లో 120,000 మంది బాలలు గృహ సేవకులుగా ఉండే వారు). వీరి పని గంటలు బాగా ఎక్కువగా ఉండేవి. భవన నిర్మాణ కార్మికులు వేసవిలో వారానికి 64 గంటలు పనిచేసేవారు, శీతా కాలంలో 52 గంటలు పనిచేసేవారు, ఇదిలా ఉంటే గృహ సేవకులు వారానికి 80 గంటలు పనిచేసేవారు.
ఎక్కువ సంఖ్యలో పిల్లలు వేశ్యలుగానూ పనిచేశారు. మూడేళ్ల వయస్సు ఉన్న పిల్లలను కూడా పనిలోకి పురమాయించేవారు. బొగ్గు గనుల్లో ఐదేళ్ల వయస్సు నుంచే పని చేయడం ప్రారంభించిన పిల్లలు 25 ఏళ్లలోపే మృతి చెందేవారు. అనేకమంది పిల్లలు, వయోజ నులు రోజుకు 16 గంటలు పనిచేసేవారు. కర్మాగారాల్లో పత్తి మిల్లుల్లో పనిచేసే నిరుపే దల వసతి గృహాల్లోని బాలలు యొక్క పని గంటలను 12 గంటలకు పరిమితం చేస్తూ 1802-19నాటి కర్మాగార చట్టాలు నియంత్రణ విధించాయి. ఈ చట్టాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. తరువాత అతివాద ఆందోళన కారణంగా, ఉదాహరణకు, 1831 లో స్వల్పకాల కమిటీల ఆందోళన, రాయల్ కమిటీ 1833లో 11-18 ఏళ్లలోపు బాలలు రోజుకు గరిష్టంగా 12 గంటలు, 9-11 మధ్య వయస్కులు రోజుకు ఎనిమిది గంటలు, తొమ్మిదేళ్లలోపు వయస్సు వారిని పనిలోకి అనుమతించరాదని సిఫార్సు చేసింది. ఈ చట్టాన్ని కేవలం వస్త్ర పరిశ్రమకు మాత్రమే వర్తింపజేశారు, తరువాత మరింత ఆందోళన జరగడంతో, 1847లో వయోజనులు, బాలల పని గంటలను రోజుకు 10 గంటలకు మాత్రమే పరిమితం చేస్తూ మరో చట్టం చేశారు.
1900నాటికి, అమెరికా పరిశ్రమల్లో 1.7 మిలియన్ల మంది పదిహేనేళ్లలోపు వయస్సు ఉన్న బాల కార్మికులు ఉన్నారు. జీతాలకు పరిశ్రమ ఉద్యోగాల్లో పనిచేస్తున్న 15 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలల సంఖ్య 1910నాటికి 2 మిలియన్లకు చేరుకుంది.
ప్రస్తుత రోజు...
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బాల కార్మి క వ్యవస్థ ఇప్పటికీ సాధారణంగా కనిపిస్తోంది, కర్మాగారాలు, గనులు, వ్యభిచారం, త్రవ్వ కాలు, వ్యవసాయం, తల్లిదండ్రుల వ్యాపారా ల్లో సాయం చేయడం, చిన్న వ్యాపారాలు (ఉదాహరణకు ఆహార పదార్థాల విక్రయం) లేదా తాత్కాలిక ఉద్యోగాల్లో బాలలు పనిచేస్తు న్నారు. కొంత మంది బాలలు పర్యాటకులకు గైడ్‌లుగా, దుకాణాలకు, రెస్టారెంట్లకు (వెయి టర్లుగానూ పనిచేస్తున్నారు) వ్యాపారాలను తీసుకురావడానికి ఉపయోగపడుతున్నారు. ఇతర బాల కార్మికులు బాక్సుల నిర్మాణం, బూట్లు పాలిష్ చేయడం, అంగడి ఉత్పత్తుల ను మోయడం లేదా శుద్ధి చేయడం వంటి దుర్భరమైన, పదేపదే ఒకేపని చేయాల్సి వచ్చే ఉద్యోగాలకు పురమాయించబడుతున్నారు.
బాల కార్మిక నిరోధక యంత్రాంగ అధికారులు, ప్రచార మాధ్యమాల కన్నుపడకుండా చూసేందుకు కర్మాగారాలు, శ్రమజీవులు పని చేసే ప్రదేశాల కంటే, ఎక్కువమంది బాల కార్మికులను అనధికారిక రంగంలో ఉపయో గిస్తున్నారు, వీధుల్లో అనేక వస్తువులను విక్ర యించేందుకు పురమాయించడం, వ్యవసా య పనులకు ఉపయోగించడం లేదా రహ స్యంగా గృహాల్లో పనులకు ఉపయోగించు కోవడం చేస్తున్నారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ వారి చేత పనిచేయించుకుం టున్నారు. ఇందుకు వారికి చెల్లించే వేతనం కూడా నామమాత్రంగా ఉంటుంది. పేద కుంటుంబాలు ఉన్నంతవరకు, బాల కార్మి కులు ఉంటూనే ఉంటారు.
ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 14 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాల కార్మికులు 158 మిలి యన్ల మంది ఉన్నట్లు యునిసెఫ్ అంచనా వేసింది, ఈ అంచనాల్లో బాల గృహ కార్మి కులను చేర్చలేదు. ఐక్యరాజ్యసమితి, అంత ర్జాతీయ కార్మిక సంస్థలు బాల కార్మిక వ్యవస్థను దోపిడీగా పరిగణిస్తు న్నాయి, దీనికి సంబంధించి యు.ఎన్. ఒక ఒడంబడికను తయారు చేసింది, బాలల హక్కుల ఒప్పం దంలోని 32వ అధికరణ ప్రకారం...
ఆర్థిక దోపిడి నుంచి, ప్రమాదకర మయ్యే పనులు లేదా బాలల విద్య ను ప్రభావితం చేసే పనులు లేదా వారి ఆరోగ్యానికి లేదా శారీరక, మాన సిక, ఆధ్యాత్మిక లేదా సామాజికాభివృద్ధికి హాని చేసే పనుల నుంచి బాలలను కాపాడే హక్కు ను అన్ని ప్రభుత్వాలు ఆమోదించాలి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది బాల కార్మికులుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 1990వ దశకంలో సోమాలియా మినహా ప్రపంచంలోని ప్రతి దేశం, అమెరికా సం యుక్త రాష్ట్రాలు బాలల హక్కుల ఒప్పందం (సీఆర్‌సీ) పై సంతకం చేశాయి. యునైటెడ్ నేషన్స్ పౌండేషన్ ప్రకారం... సోమాలియా 2002లో దీనిపై సంతకం చేసింది, దీనిపై సంతకం చేయడంలో సోమాలియా జాప్యం చేయడానికి, అక్కడ సంతకం చేసేందుకు ప్రభుత్వం లేకపోవడమే కారణం. అక్రమ బాల కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు సీఆర్‌సీ కఠినమైన, ఆధారం కోరబడినది అత్యంత అవిరుద్ధ ఆధారం కోరబడినది అంతర్జాతీయ న్యాయ భాషను అందజేసింది. అయితే ఇది బాల కార్మిక వ్యవస్థను అక్ర మంగా ప్రతిపాదించలేదు.
పేద కుటుంబాలు మనుగడ కోసం బాల కార్మికులపై ఆధారపడుతున్నాయి, కొన్నిసార్లు బాల కార్మికులే వాటికి ఆదాయ వనరుగా ఉంటున్నారు. ఇది పారిశ్రామిక రంగంలోనే ఎప్పుడూ జరగడం లేదు గనుక, ఈ తరహా పని తరుచుగా మరుగునపడుతోంది. బాల కార్మికులను వ్యవసాయ ఉపాధి రంగంలో, పట్టణ అనధికారిక రంగంలో, ముఖ్యంగా బాల గృహ కార్మికులుగా ఉపయోగించుకుం టున్నారు. బాలలకు ప్రయోజనాలు చేకూ ర్చేందుకు, బాల కార్మిక నిరోధక వ్యవస్థ వారి కి స్వల్పకాల ఆదాయం, దీర్ఘకాల ప్రయోజనా లను అందజేస్తూ ద్వంద్వ సవాళ్లను పరిష్కరిం చాల్సివుంది.
కొన్ని వయోజన హక్కుల గ్రూ పులు, నిర్దిష్ట వయస్సులోపల ఉన్నవారిని పని చేయకుండా అడ్డుకోవడం, బాలల ప్ర యోజనాలను తగ్గించడం, డబ్బు ఉన్నవారి పిచ్చిపనులకు వారిని వదిలిపెట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని భావిస్తు న్నాయి.ఆధారం కోరబడినది. ఇటీవలి పత్రం లో, బసు, వాన్ (1998)లు14 బాల కార్మి కతకు ప్రధాన కారణం వారి తల్లిదండ్రుల పేదరికం అని వాదించారు. అందువలన, బాల కార్మిక వ్యవస్థపై చట్టపరమైన నిషేధం విధించడంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు, పెద్దవారి వేతనాలు పెరిగేందు కు బాల కార్మిక వ్యవస్థపై నిషేధం విధించా ల్సిన అవసరం ఉన్నప్పుడు, పేద బాలల కు టుంబ ఆదాయాలను సరిపడ స్థాయిలో పూ రించగలిగినప్పుడు ఈ చర్యను పరిగణన లోకి తీసుకోవాలని వాదించారు.
భారత్, బంగ్లాదేశ్ సహా, అనేక దేశాల్లో బాల కార్మికులను విస్తృతంగా ఉపయోగించుకుం టున్నారు. భారత్‌లో బాల కార్మికుల సంఖ్య 70 నుంచి 80 మిలియన్ల వరకు ఉంటుం దని సి.ఎ.సి.ఎల్ అంచనా వేసింది. 14 ఏళ్ల లోపు బాలలను శ్రామికులను చేయరాదని సంబంధిత దేశాల చట్టాలు సూచిస్తున్నప్పటి కీ, ఈ చట్టం తరచుగా ఉల్లంఘించబడు తోంది. 11 ఏళ్ల వయస్సు ఉన్న బాలలు హాన్స్, వాల్-మార్ట్, టార్గెట్ వంటి అమెరికా కంపెనీలకు చెందిన శ్రమజీవులు పనిచేసే కేంద్రాలకు వెళ్లి రోజుకు 20 గంటలపాటు పని చేస్తున్నారు.
ఆసియాలో 61%, ఆఫ్రికాలో 32%, లాటి న్ అమెరికాలో 7%, అమెరికా, కెనడా, యూరప్, ఆసియాలోని ఇతర సంపన్న దేశాల్లో 1% బాలలు కార్మికులుగా పని చేస్తున్నారు, ఈ దేశాల్లోని మొత్తం శ్రామి కుల్లో 22% మంది బాలలున్నారు. లాటిన్ అమెరికాలోని మొత్తం శ్రామిక సంఖ్యలో 17% మంది బాలలు ఉన్నారు. దేశాల మధ్య, వాటిలోని ప్రాంతాలనుబట్టి బాల కార్మికుల వాటాలో చాలా తేడా ఉంటుంది.
బాల కార్మికుల రక్షణ...
బాల కార్మికులతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తయారైన లేదా వారిచే తయారు చేయించిన ఉత్పత్తులను సహ అపరాధుల పాత్ర పోషిస్తూ ప్రజలు కొనుగోలు చేయడంపై కూడా తరచుగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను బహిష్కరించడం వలన వారు వ్యవసాయం లేదా వ్యభిచారం వంటి మరింత ప్రమాదకర లేదా కఠిన వృత్తులను ఎంచుకునే ప్రమాదం ఉందని ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదాహరణకు యునిసెఫ్ జరిపిన ఒక అధ్యయనంలో అమెరికాలో బాల కార్మిక నిరోధక చట్టం ప్రవేశపెట్టిన తరువాత 50,000 మంది బాలలు బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగాలు కోల్పోయారు, దీంతో అనేక మంది వస్త్ర ఉత్పత్తి కంటే మరింత ప్రమాదకరమైన, వారు మరింత దోపిడీకి గురయ్యే, రాళ్లు కొట్టడం, వీధి దొంగలుగా మారడం, వ్యభిచారంలోకి వెళ్లడం వంటి, మార్గాలను ఆశ్రయించడం జరిగింది. బాల కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులను బహిష్కరించడం వలన బాల కార్మికులకు జరిగే మేలు కంటే వాస్తవానికి దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో కూడిన సమస్యలు ఎక్కువవతాయని ఈ అధ్యయనం సూచించింది.
మిల్టన్ ఫ్రైడ్‌మ్యాన్ ప్రకారం, పారిశ్రామిక విప్లవానికి ముందు బాల కార్మికులందరూ వ్యవసాయ రంగంలో పని చేసేవారు. పారిశ్రామిక విప్లవం సందర్భంగా చాలా మంది బాలలు వ్యవసాయ పనుల నుంచి కర్మాగార పనులవైపు మళ్లారు. కాలం గడిచేకొద్ది, వారి వేతనాలు పెరిగాయి, తల్లిదండ్రులు వారి పిల్లలను పనిలోకి కాకుండా పాఠశాలలకు పంపడం ప్రారంభించారు, ఫలితంగా చట్టాల ప్రవేశానికి ముందు, తరువాత కూడా బాల కార్మికుల సంఖ్య తగ్గింది.
మన రాష్ట్రంలో నిబంధనలు...
14 సంవత్సరాలలోపు పిల్లలతో ఏ విధమైన పని చేయించకూడదు. ఫ్యాక్టరీలు, యంత్రా ల మధ్య, ఎత్తయిన ప్రదేశాలు, భూగర్భ ప్రదేశాలు వంటిచోట్ల పనిలో ఉంచితే రూ.20,000 అపరాధ రుసుం, కనీస వేతన చట్టం అమలు, క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. కిరాణా దుకాణాల్లో, హోటల్లో, మెకానిక్ పనుల్లో చేర్పిస్తే సంబంధిత యజమానులపై అపరాధ రుసుం విధించి కేసులు నమోదు చేస్తారు. యజమానుల ద్వారానే పిల్లలను బడిలో చేర్పిస్తారు. మనదేశంలో బాలల స్థితిగతులు ఎలా ఉన్నాయి? విద్యా, వైద్య సేవలు చిన్నారులకు అందుతున్నాయా? అని పరిశీలించుకుంటే ఎ న్నో భయంకర వాస్తవాలు వెలుగుచూస్తాయి.
బాల కార్మిక వ్యవస్థ - నిర్మూలన...
జాతిని సవాలు చేస్తున్న బాలకార్మిక సమస్య ఇప్పటికీ కొనసాగుతూనేవుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వివిధ చర్యల్ని చేపడుతూనే వుంది. అయితే ఇది సామాజిక-ఆర్థిక సమస్యతో ముడిపడి వుండడం వల్ల... దారిద్య్రం, నిరక్షరాస్యతతో కూడినది కాబట్టి ఇంకా సమాజంలోని అన్ని వర్గాల వారి సమస్యల్ని పరిష్కరించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరగాలి. బాల కార్మిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసి చేపట్టవలసిన చర్యలను సిఫారసు చేయమని 1979 లో గురుపాదస్వామి ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సమస్యను కూలంకషంగా అధ్యయనం చేసి కొన్ని వివరణాత్మకమైన సిఫారసులను కూడా ఆ కమిటీ ప్రభుత్వం ముందుంచింది.
దారిద్య్రం కొనసాగుతున్నంతవరకూ, బాలకార్మిక వ్యవస్థను రూపుమాపడం అసాధ్యమన్నారు. కాగా దాన్ని చట్టపరంగా నిర్మూలించడ మనేది ఆచరణ సాధ్యం కాదన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే బాలకార్మిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కొనసాగుతున్నదో ఆ యా ప్రాంతాలలో దానిని నిర్మూలించే ప్రయ త్నం చేయడమే కర్తవ్యమని అంటూ వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమం చేపట్టాలన్నారు. పనిచేసే పిల్లల సమస్యల్ని భిన్న కోణాల నుంచి అధ్యయనం చేయాల న్నారు. గురుపాదస్వామి సిఫారసుల ఆధా రంగా బాలకార్మిక వ్యవస్థ (నిషేధం- నియం త్రణ) అనే చట్టం 1986 లో సిద్ధం చేశారు. కొన్ని ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమ లనూ గుర్తించి వాటిలో పిల్లలు పనిచేయడం నిషేధిం చింది. మరి కొన్నింటిలో పనిచేసే పరిస్థితుల్ని చట్ట ప్రకారం నియంత్రించడానికి ఏర్పాట్లు చేశారు.
ఆ చట్ట ప్రకారం బాలకా ర్మిక సాంకేతిక సలహా సమితిని ఏర్పాటు చేసి ప్రమాదకరమైన వృత్తులను, పరిశ్రమలను గుర్తింపజేసి జాబితాను విస్తరింపచేశారు. ఈ చట్టరీత్యా చర్యల ఆధారంగా బాలకార్మిక వ్యవస్థపై ఒక జాతీయ విధానాన్ని 1987 లో రూపొందించారు. దీని ప్రకారం క్రమంగాను ఒక పద్ధతి ప్రకారం ఆయా ప్రమాదకరమైన వృత్తుల్లో పని చేసే పిల్లలకు మొట్ట మొదట పునరా వాస సదుపాయం కల్పించారు.
బాలకార్మిక వ్యవస్థ - కారణాలు...
జాతీయ అంతర్జాతీయ సంయుక్త బాలల అత్యవసర నిధి వారి అంచనాప్రకారం బాలలు పనుల్లోకి నెట్టబడుతున్నారు. దీనికి ప్రధాన కారణం పిల్లలు సులువుగా దోపిడికి గురవ్వడమే. పిల్లలు వారి వయస్సుకు సంబంధం లేని పనులు చేయడానికి ప్రధాన కారణం పేదరికం. జనాభా పెరుగుదల, చట్టాలను అమలు పరచనందు వల్ల తల్లితండ్రులు తమ పిల్లలను స్కూళ్ళకు పంపటానికి ఇష్టపడకపోవడం (పిల్లలను పనికి పంపితే తమ ఆర్ధికపరిస్ధితి మెరుగవుతుందనే ఉద్దేశంతో), గ్రామీణ ప్రాంతాల్లోని అతిపేదరికం కూడా బాలకార్మిక వ్యవస్థకు కారణాలు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఏంచేయాలి?
బాలకార్మికవ్యవస్ధ నిర్మూలనకోసం 76 బాల కార్మిక పథకాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,05,000 పిల్లలను ప్రత్యేక బడులలో చేర్పించారు. 57 అతి ప్రమాదకర పరిశ్రమ ల్లో పనిచేస్తున్న బాలలు, హోటళ్ళు, ఇళ్ళల్లో పనిచేస్తున్న (9-14 సంవత్సరాల మధ్య వయస్సున్న) పిల్లలు ఈ పథకంలో చేర్పిం చబడ్డారు. ప్రభుత్వ పథకాలైన అందరికీ విద్యావిధానం (సర్వశిక్షాభియాన్) అమలు చేయబడుచున్నది. ఇలాంటి పథకాలు మరిన్ని ప్రవేశపెట్టి ఈ విధానాలు మరింత పటిష్టంగా అమలు చేసినప్పుడే బాలకార్మిక వ్యవస్థ సమూలంగా ప్రక్షాళన జరగుతుంది.
పిల్లలే ఏ కాలంలో అయినా భవిష్యత్తుకు పునాది వంటి వారు. ‘నేటి బాలలే రేపటి పౌరుల’న్నది ఒక ఊహ కాదు. తరతరాలుగా ప్రపంచమంతా ఋజువవుతున్న యథార్ధం. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దితేనే... దేశ భవిష్యత్తు పదిలంగా ఉంటుందని సమకాలీన సామాజిక స్థితిగతులు వెల్లడిస్తున్నాయి. ప్రపంచస్థా యిలో దేశస్థాయిలో అనేక దశాబ్దాలుగా పిల్లల కోసం రూపొందించిన పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు వాస్తవరూపం దాల్చితేనే... మన పిల్లల భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. వారి హక్కులు పదిలంగా ఉంటాయనేది కాదన లేని సత్యం. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం...
బాల కార్మిక నిరోధక చర్యలు...
బాల కార్మిక వ్యవస్థ క్రమ నిర్మూలన లక్ష్యంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ‘‘ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ది ఎలి మినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ (ఐ.పి.ఇ.సి)’’ కార్యక్రమం 1992 లో సృష్టించబడింది, దేశాల సామర్థ్యాన్ని పటిష్టపరచడం, బాల కార్మిక వ్యవస్థ నిరోధానికి ప్రపంచవ్యాప్త ఉద్యమాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని ఈ కార్యక్రమ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐ.పి.ఇ.సి ప్రస్తుతం 88 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, 2008లో సాంకేతిక సహకార ప్రాజెక్టులపై దీని యొక్క వార్షిక వ్యయం 61 యు.ఎస్. మిలియన్ డాలర్లకు చేరుకుంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న అతిపెద్ద, ఐ.ఎల్.ఓ నిర్వహిస్తున్న భారీ కార్యక్రమం ఇదొక్కటే.
ఏళ్లు గడిచేకొద్ది ఐ.పి.ఇ.సి యొక్క భాగస్వాముల సంఖ్య, పరిధి విస్తరించబడింది, ఇప్పుడు ఉద్యోగ, కార్మిక సంస్థలు, ఇతర అంతర్జాతీయ, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ వ్యాపార సంస్థ లు, సామాజిక సంస్థలు ఎన్జీవోలు, ప్రచార మాధ్యమాలు, చట్టసభలు, న్యాయవ్యవస్థల సభ్యులు, విశ్వవిద్యాలయాలు, మత సంస్థలు, బాలలు, వారి కుటుంబాలు కూడా ఇందులో చేరుతున్నాయి. ఐ.ఎల్.ఓ అజెండాలో ఐ.పి.ఇ.సి ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రధానాంశం. బాల కార్మిక వ్యవస్థ వలన బాలల మెరుగైన భవిష్యత్ కోసం అవసరమైన నైపుణ్యాలు, విద్యలను వారికి చేరకపోవడమే కాకుండా పేదరికం కొనసాగేందుకు కారణమవడం, పోటీతత్వం, ఉత్పాదకత, ఆదాయ సంభావ్యతలను తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక సూచీలను ఇది ప్రభావితం చేస్తుంది. కార్మికులుగా ఉన్న బాలలకు విద్యను అందించడం, వారి కుటుంబాలకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలతో సాయం చేయడం ద్వారా వయోజనులకు ప్రత్యక్షంగా మంచి పని వాతావరణాన్ని సృష్టించవచ్చు.
మూలం: సూర్య దినపత్రిక.
పసితనంపై పని‘భారం’.
ReplyDeleteNice post... Real truth
ReplyDeleteStop child labour
ReplyDeleteStop and ban child labour in India
ReplyDelete