కోలవెన్ను రామకోటీశ్వరరావు
జననం :1894 అక్టోబరు 22-
గుంటూరు జిల్లా,నరసారావుపేట
మరణం :1970 మే 19
కోలవెన్ను రామకోటీశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు. వీరు బందరు నుండి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించేరు .
వీరు గుంటూరు జిల్లా నరసారావుపేటలో 1894 సంవత్సరం అక్టోబరు 22న జన్మించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసి, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని చెరశాలకు వెళ్ళారు.
భారత దేశంలో వివిధ రాష్ట్రాల భాషా సాహిత్యాలను, ఇంగ్లీషు అనువాదాల ద్వారా, ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చెయ్యటం, భారత జాతీయ జీవనంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించటం త్రివేణి ధ్యేయంగా ఉండేది. 1928లో మొదలయిన త్రివేణిలో రాధాకృష్ణన్, రాజాజీ, నెహ్రూ మొదలైన నాయకులు త్రివేణి లో రచనలు చేసేవారు. మహాత్మా గాంధీ 1934లో బందరు వచ్చినప్పుడు, త్రివేణి బాగుందని మెచ్చుకున్నారు.
వీరు 1970 సంవత్సరంలో మే 19న పరమపదించారు.
స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సంపాదకుడు కోలవెన్ను రామకోటీశ్వరరావు.
ReplyDelete