మహాత్మాగాంధీ ప్రసిద్ధత
అవార్డులు, బిరుదులు
టైమ్ పత్రిక 1930 సంవత్సరపు టైమ్ పత్రిక వ్యక్తి గా ప్రకటించింది.1999 లో అల్బర్ట్ ఐన్ స్టీన్ తర్వాత రెండవ స్థానంలో శతాబ్ది వ్యక్తిగా గుర్తించబడ్డాడు. భారతప్రభుత్వం గాంధీ శాంతి బహమతి ని ప్రముఖులైన సమాజసేవకులకు, ప్రపంచ నాయకులకు మరియు పౌరులకు ఇస్తున్నది. విదేశీయులలో జాత్యహంకారినికి వ్యతిరేకంగా పోరాడిన నెల్సన్ మండేలాఒక ప్రముఖ గ్రహీత. లో 2011, టైమ్ పత్రిక అధిక ప్రాముఖ్యత గల 25 రాజకీయనాయకులలో ఒకరు గా పేర్కొంది.
అహింసా పద్ధతిలో దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. ఐదుసార్లు గాంధీ ప్రతిపాదించబడ్డాడు. 1937, 1947 లో మాత్రమే గుర్తింపు చిట్టిజాబితాలో చోటు చేసుకున్నాడు. ప్రతిపాదనకు కారణాలుగా చెప్పబడిన విషయాలలో ముఖ్యమైనవి: ఆయన రాజకీయ నాయకుడు . అంతర్జాతీయ చట్టాల రూపకర్త . సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ శాంతి సంస్థలతో ఆయనకు ఎంతో సంబంధమూ ఉంది. ఆయన జాతీయవాదే కాక అంతర్జాతీయ మానవతావాది కూడా. దక్షిణాఫ్రికాలో కూడా ఆయన భారతీయుల కోసమే పోరాడాడు. రెండవ ప్రపంచయుద్ధం కాలంలో శాంతి బహుమతి యిస్తే, అప్పటి బ్రిటీష్ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని యివ్వలేదట! 1948 లో ప్రతిపాదించబడినా గడువు తీరకముందే గాంధీ హత్యచేయబడినందున ఇవ్వలేదట.ఆయితే మరణానంతరం ఇవ్వకూడదనే నియమం లేనట్లు, స్వీడన్ దేశీయుడైన ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దాగ్ హమర్షెల్డ్ కు మరణానంతరం ఇచ్చినందువల్ల తెలుస్తుంది.
కొన్ని సంవత్సరాల తరువాత నోబెల్ కమిటీ గాంధీకి నోబెల్ బహుమతి ఇవ్వకపోవటానికి విచారం ప్రకటించింది. బహుమతి ఇవ్వడానికి ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పింది. 1989లో దలైలామా(14వ) కు శాంతి బహమతి ఇచ్చినపుడు. కమిటీ అధ్యక్షుడు, ఈ బహమతి లో కొంతభాగం గాంధీ స్మృతికి నివాళి అని పేర్కొన్నాడు.
ప్రముఖుల వ్యాఖ్యలు
"ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు"- ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్
"మన తరంలో రాజకీయవేత్తలందరికంటే కూడా గాంధీ ఆభిప్రాయాలు మేలైనవి. ఆయన చెప్పినట్లుగా మనం నడచుకోవాలి. మనకు కావలసినదాని కోసం హింసతో పోట్లాడటము కాదు. ఆన్యాయమని మనకు తోచినదానికి ఏ మాత్రమూ సాయము చేయకుండా ఉండటము మన బాధ్యత" - ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‍స్టీన్
"జీసస్ నాకు సందేశం ఇచ్చాడు, గాంధీ దాన్ని ఆచరణలో చూపించాడు" -మార్టిన్ లూథర్ కింగ్
మహాత్మాగాంధీ ప్రసిద్ధత.
ReplyDelete