వీరమాత జిజాబాయి
జననం: జనవరి 12, 1598
మరణం: జూన్ 17, 1674
ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.
బాల్యం, వివాహం
జిజాబాయి 1598వ సంవత్సరం నేటి మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి లఖోజీరావ్ జాధవ్ గోల్కొండ నిజాంషాహి పలకులవద్ద ముఖ్య పదవిలో ఉండేవారు. జిజాబాయి భర్త షాజీ భోంస్లే బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవారు. ఆయన మరాఠాలను,హిందువులను ఏకతాటిపై తెచ్చి హిందు రాజ్య స్థాపన చేయాలని భావించేవారు. ఆ ఆశయం జిజాబాయికి కూడా ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు శంభాజీ , శివాజీ. షాజీ భోంస్లే తుకాబాయిని రెండవ వివహం చేసుకుని శంభాజీతో బీజాపూర్ సుల్తానుల ఆదేశం మేరకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో శివాజీని పెంచి పెద్దచేశారు.
హిందూ స్వరాజ్య స్థాపన
రామాయణ, మహాభారతాలు, పురాణేతిహాసాలలోని వీరగాథలను శివాజీకి చెప్తూ హిందూ స్వరాజ్య స్థాపన అను కర్తవయభోదన చేసేవారు. దాదాజీ కొండదేవ్ ను శిక్షకునిగా నియమించి శివాజీకి అన్ని యుద్దవిద్యలు నేర్పించారు. జిజామాత ఇచ్చిన స్ఫూర్తితో యువ శివాజీ హిందూ స్వరాజ్య స్థాపన ప్రతినపూనారు. పాలనవిషయాలలో కూడా జిజాబాయి శివాజీకి అనేక సూచనలు చేసేవారు. శివాజీ మొఘల్ ప్రభువు ఔరంగజేబ్ చెరలో ఉన్నప్పుడు మరాఠా సర్దార్లకు ధైర్యం చెప్తూ మరాఠా రాజ్యపాలనను చూసుకున్నారు. 1674వ సంవత్సరం శివాజీ చత్రపతిగా రాయగడ్ లో పట్టాభిషిక్తుడైన 12రోజులకు తన 76వ ఏట పరమపదించారు.
గుర్తింపు
జిజాబాయి మాతృమూర్తులందరికీ ఆదర్శప్రాయురాలు. వీరి పేరున భారత ప్రభుత్వం స్త్రీ శక్తి పురస్కారం ఏర్పరిచింది.
వీరమాత జిజాబాయి.
ReplyDeleteBrave mother jijabai.
ReplyDeleteprati maatru murti tana bhagangaa desha seva prerana kaligipa jesina ..paataayaansham lo pillalaku unchaali ...
ReplyDeleteశివాజీని ఆయుధం గా తయారుచేసిన జిజియా మాత.
ReplyDelete