Breaking News

శ్వేత విప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్

జననం: నవంబర్26, 1921-కలకత్తా
మరణం : సెప్టెంబరు 9, 2012-గుజరాత్


డాక్టర్ వర్ఘీస్ కురియన్ భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.ఆయన యొక్క "బిలియన్ లీటర్ ఐడియా" (ఆపరేషన్ ప్లడ్ - ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది. ఈ కార్యాచరణ భారత దేశంలో అత్యల్ప పాల ఉత్పత్తి నుండి అధిక పాల ఉత్పత్తి గల దేశంగా ప్రపంచంలో నిలిపింది. 1998 లో పాల ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారత దేశాన్ని నిలిపాడు. 2010-11 లో ప్రపంచ వ్యాప్తంగా 17 శాతం గ్లోబల్ అవుట్ పుట్ ను సాధించగలిగాడు. అనగా ప్రతి వ్యక్తికి 30 సంవత్సరాలలో రెట్టింపు పాల లభ్యత సాధించగలిగాడు. పాడి పరిశ్రమ భారతదేశం యొక్క అతిపెద్ద స్వీయ నిరంతర పరిశ్రమ అయ్యింది. అతను, తరువాత దేశం వంట నూనెల ఉత్పత్తిలో కూడా స్వయం ప్రతిపత్తి సాధించేటట్లు చేశాడు.

ఆయన 30 విశిష్ట సంస్థలను (AMUL, GCMMF, IRMA, NDDB వంటివి) స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపజేస్తూ అనేక మంది నిపుణులచే నడిపాడు.ఆయన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) కు వ్యవస్థాపక చైర్మన్ గా యున్నపుడు Amul(అమూల్) బ్రాండ్ ఉత్పత్తిని సృష్టించి విజయం సాధించాడు.బర్రె పాలతో అమూల్ పాలపొడి తయారీ ఆవిష్కరణ విజయంతో ఆయనకు ఆవు పాలతో పాలపొడి తయారీని అనేక పాలఉత్పత్తులు తయారుచేసే దేశాలు వ్యతిరేకించాయి. ఆయన తయారు చేసిన అమూల్ డైరీ విజయం 1965 లో భారత ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి చే ఆయనను "నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు" కు వ్యవస్థాపక చైర్మన్ గా ఎంపిక చేయబడినది.అమూల్ యొక్క నకలు "ఆనంద్ మోడల్" ను దేశ వ్యాప్తంగా పరిచయం చేయబడినది.

ఆయన 2006 నుండి 2011 వరకు అలహాబాదు విశ్వవిద్యాలయానికి మొదటి ఛన్సలర్ గా సేవలందించారు.


ప్రారంభ జీవితం మరియు విద్య
కురియన్ కేరళ లోనికాలికట్ లో నవంబరు 26 1921 న సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి కొచ్చిన్ లో ఒక సివిల్ సర్జన్ గా ఉండేవారు.ఆయన 1940 లో మద్రాసులోని లయోలా కళాశాలలో భౌతిక శాస్త్రం నందు పట్టభద్రులైనారు. తరువాత "కాలేజి ఆఫ్ ఇంజనీరింగ్, గుయిండీ" నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన టాటా స్టీల్ టెక్నికల్ ఇనిస్టీట్యూట్,జమ్‌షద్‌పూర్ లో చేరారు. తరువాత ఆయన 1948 లో యునైటెడ్ స్టేట్స్ లోని "మిచిగాన్ స్టేట్ విశ్వవిద్యాలయం" నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పొందుటకు భారత దేశ స్కాలర్ షిప్ తో అమెరికాకు వెళ్ళారు.

అకడమిక్ విజయాలు, అవార్డులు మరియు గౌరవాలు

కురియన్ 15 గౌరవ డిగ్రీలను పొందారు.

మిచిగాన్ విశ్వవిద్యాలయం

స్వీడిష్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్

University of Glasgow

Acadia University

Ottawa University

University of Guelph

University of New England

Banaras Hindu University

Anand Agricultural University

Sardar Patel University

Anna University

Andhra Pradesh Agricultural University

Gujarat Agricultural University

University of Roorkee

Kerala Agricultural University

సంవత్సరం
అవార్డు పేరు
బహుకరించిన సంస్థ
1999
పద్మవిభూషణ్
భారత ప్రభుత్వం
1993
ఇంటర్నేషనల్ పెర్సన్ ఆఫ్ ద యియర్ అవార్డు
వరల్డ్ డైరీ ఎక్స్‌పో
1991
దిస్టింగ్విష్డ్ అలుమ్ని అవార్డు
మిచిగాన్ రాష్ట్ర విశ్వవిద్యాలయం
1989
వరల్డ్ ఫుడ్ ప్రైజ్
వరల్డ్ ఫుడ్ ప్రైజ్, యు.ఎస్.ఎ
1986
వాటెలర్ పీస్ బహుమతి అవార్డు
కార్నెగీ ఫౌండేషన్, నెదర్లాండ్స్
1986
కృషిరత్న అవార్డు
భారత ప్రభుత్వం
1966
పద్మభూషణ
భారత ప్రభుత్వం
1965
పద్మశ్రీ
భారత ప్రభుత్వం
1963
రామన్ మెగసెసె అవార్డు
రామన్ మెగసెసె అవార్డు ఫౌండేషన్

4 comments:

  1. శ్వేత విప్లవ పితామహుడు వర్ఘీస్ కురియన్.

    ReplyDelete
  2. Amrithshetty Satish KumarSeptember 14, 2014 at 2:33 PM

    Salute to milk man of INDIA.

    ReplyDelete
  3. The father of the White Revolution........

    ReplyDelete
  4. He is the man behind the success of AMUL.

    ReplyDelete