ప్రశ్నిద్దాం! యజమాని తనాన్ని నిలుపుకుందాం!!
మన భారతదేశ పౌరులందరమూ కలసిచేసుకున్న ఒప్పందమైన భారత రాజ్యాంగం ప్రకారం మనదేశం సార్వభౌమాధికారం కలిగి ఉన్నది. సార్వభౌమత్వం అనగా ఈ దేశం బయట ఉన్నవారు ఈ దేశంలోని వారిపై పెత్తనం చేలాయించటానికి వీలులేదు. అలాగని ఈ దేశంలోని వారు ఈ దేశంలోని మరొక్కరిపై ఆధిపత్యాన్ని చేలాయించలేరు.
భారత ప్రజలమైన మనము, మనకొరకు మనమంతా చేసుకున్న ఒప్పందమైన భారత రాజ్యాంగంలో ఏమి రాసుకోన్నామో తెలియవలసిన వారందరికీ, తెలియవలసినంతగా తెలియకుండానే గత 64 సంవత్సరాలుగా జీవిస్తున్నాము. ప్రస్తుతం సమాజంలోనున్నఅన్నిరకాల అపసవ్యతలకు, అసమానతలన్నింటికి కారణము భారత ప్రజలమైన మనం, మనం చేసుకున్న ఒప్పందమైన రాజ్యాంగాన్ని అమలు చేసుకోలేకపోవడమే.
ప్రజల కొరకు ఏర్పాటు కాబడిన వ్యవస్థలు ప్రజలకొరకు జవాబుదారీ తనంతో పనిచేయనప్పుడు వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రజలది మరియు ప్రజలు ఎన్నుకొన్న పాలకులది. ప్రజల తరపున పెద్దఎత్తున ఒత్తిడి రాకుండా పాలకులు ఈ పనికి పూనుకోరన్నది నిర్వివాదాంశము.
భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ పౌరులందరూ ఈ దేశానికి యజమానులు.
ఈ దేశంలో ఏమి జరగాలో నిర్ణయించవలసినది ప్రజలే. వారు నిర్ణయించిన విషయాలు అమలు అవుతున్నాయో లేదో చూస్తూ ఉండాల్సింది ప్రజలే. ఇదే యజమాని తనం అన్నపదానికి సరైన అర్ధం.
నాటి అంబేద్కర్ నుండి నేటివరకు సమాజహితకాంక్షులు ఎందరో చాలా సందర్భాలలో మనదేశం పరాయిపాలననుండి విముక్తి చెందినదే తప్ప స్వాతంత్ర్యం పొందలేదని చెప్పారు. నిర్ణయాధికారం ప్రజలచేతిలోకి, నిర్వహణాధికారం పాలకుల చేతిలోకి అనే విధానము ఎంతవరకు అమలుకాదో అంతవరకు ప్రజాస్వామ్యం అమలైనట్లు కాదు. అధికార వికేంద్రికరణ జరిగి సంపదలోనూ, యాజమాన్యంలోనూ, పౌరునికి వాటా వుండి, నిర్ణయాధికారం ప్రజల చేతిలో ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యం అంటాము. ఈ దేశ ప్రజలంతా అడిగేవారుగా ఉంటే, ప్రశ్నించే వారుగా ఉండాలన్నదే రాజ్యాంగ హృదయకాంక్ష. ఈ రోజు ఈ దేశ ప్రజలంతా అడిగేవారుగా కాకుండా, అడుక్కునేవారుగా ఉన్నారు. తమతమ యజమానితనాన్ని ప్రదర్శించలేకపోతున్నారు. భారతదేశ ప్రజలమైన మనందరి ముందున్న మొట్టమొదటి పని మరియు చిట్టచివరి వరకూ చేయవలసిన పని మనం చేసుకున్న ఒప్పందమైన భారత రాజ్యాంగం అమలయ్యేలా ప్రవర్తించడము, మిగిలినవారు ప్రవర్తించేలా జాగ్రత్త తీసుకోవడము. రాజ్యాంగ ప్రస్థావనలో పొందుపరచిన సమిష్టి అభివృద్ధి, సమగ్రాభివృద్ధి అన్నవి నేరవేరుతుండేలా చూసుకోవడానికి వివేకవంతులైనా పౌరులే పూనుకోవాలి. లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర హితమైన ప్రజాస్వామ్య వ్యవస్థను ఆచరణలోకి తెచ్చుకోవడానికి మనమంతా పెద్ద ఎత్తున పునుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఈనాడు తప్పనిసరైయున్నది. అందరంకలసి అందరికొరకు అన్నదే మన ఒప్పందమైన భారతరాజ్యాంగం యొక్క అంతః సారము. అదిగో అందుకే ఎందరో సమాజహితకాంక్షులు పట్టుబట్టి ప్రజలకొరకు సాధించి పెట్టిన చట్టమే సమాచారహక్కు చట్టం. ప్రజలకొరకు ఏర్పాటు చేయబడిన వ్యవస్థలన్నీ పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేయడానికి, ఆయావ్యవస్థాలలో జరిగే అవినీతిని అదుపుచేసేందుకు ఈ చట్టాన్ని ప్రజలు సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి.
సమాచారహక్కు చట్టానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నేను 48 గంటల్లో మీకు సమాధానం ఇవ్వగలను.
ప్రతీ ఒక్కరు నెలకు ఒక దరఖాస్తు పెడితే, పాలనలో పారదర్శకత, మన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని నేను నమ్ముతాను.
సమాచారహక్కు చట్టానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నేను 48 గంటల్లో మీకు సమాధానం ఇవ్వగలను.
ప్రతీ ఒక్కరు నెలకు ఒక దరఖాస్తు పెడితే, పాలనలో పారదర్శకత, మన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని నేను నమ్ముతాను.
జై హింద్
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.
ప్రశ్నిద్దాం! యజమాని తనాన్ని నిలుపుకుందాం!!
ReplyDeletehttp://intheserviceofmotherindia.blogspot.in/2014/09/right-to-information-act-book-in-telugu-pdf.html
ReplyDeleteSure sir.
ReplyDeleteతప్పనిసరిగా అందరు ఆర్టిఐ గురించి తెలుసుకొని, అప్లయి చేయాలి.
ReplyDelete