Breaking News

వడ్డె రాజులన్న - Vadde Rajulanna Song Lyrics in Telugu

రచన - అప్పాల ప్రసాద్


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న


వడ్డె రాజ గజపతులై

క్షత్రియ కుల వంశజులై

ఒరిస్సా,నెల్లూరు, కళింగ రాజ్యమేలి నోళ్లు

రాచరికం లేకున్నా రాటుదేలినోళ్లు

కోటల్ గుడులే కట్టిన  సివిల్ ఇంజనీర్లు


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న


గుట్టరాళ్లు పగలగొట్టి కంకరగా మలిచినోళ్లు

కొండలన్ని పిండిజేయు తెగువ చూపె వడ్డెరలు

కాలువ బావుల్ త్రవ్వి,మట్టి పనుల్ చేసేటోళ్ళు

చోళ రాజు,వడియరాజు వంశీకులు వడ్డెరలు


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న


గండరగండడు కండలు తిరిగిన ఓబన్న

నొస్సమ్ పల్లెలో రేనాటి సింహం ఓబన్న

అణిచివేతనడ్డగించి సై సై యని దూసుకొచ్చి

తెల్లదొరలపై వడిశెల రాయి  విసిరెనన్న


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న


ఉయ్యాలవాడ నర్సింహారెడ్డికి కుడి భుజమై

నల్లమల అడవుల్లో బుసకొట్టిన ఓబన్న

చెంచు,బోయ,యానాదిల కూడగట్టెరన్న

కోయిలకుంట ఖజానాను కొల్లగొట్టెరన్న


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న


ఆంగ్లేయుల దుర్మార్గం ఎదిరించిన ఓబన్న

వడ్డెర జాతిలొ దండిగ విశ్వాసం నింపెనన్న

ఒడియ రాజులే నేడు వడ్డెరలై జీవించగ

రెక్కాడితే డొక్కాడని సంచారపుబ్రతుకు నేడు


ఒడియ రాజులన్న - వడ్డె రాజులన్న

రేణుక ఎల్లమ్మ సాక్షి - కష్ట జీవులన్న

No comments