నక్కల పాట - Nakkala Song Lyrics in Telugu
రచన - అప్పాల ప్రసాద్
ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు
నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు
కంజు పిట్ట,గువ్వల పిట్ట,కుందేళ్లను వేటాడి
పొట్ట కూటి కొరకై - ఎన్నో పనులు చేసేరు
దేవతలు,జంతువులు,పువ్వుల రూపాలతో
స్త్రీ పురుషులు ఇద్దరూ పచ్చబొట్లు పొడిపించే
ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు
నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు
సకత్ దేవి,నౌకడ్ దేవి,విస్లిదేవి, సేల్ దేవి
వాఘయి,దుగావ్ దేవి భక్తి తొడ కొలిచే
మారెమ్మ,పోచమ్మ,మైసమ్మ,ఎల్లమ్మలు
పార్వతీశ్వరి,కాళీ,దుర్గా,మీనాక్షి కొలిచే
ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు
నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు
పూలు పండ్లు ఆకుగూర కంకులమ్మి జీవించి
మామిడి,సింతా చెట్లు నమ్మకంగ గుత్తవట్టి
సంపాదించిన ధనంతొ సంతానం చదవంగా
ఉన్నంతలొ పిల్ల పాప కుటుంబాల పోషించే
ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు
నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు
దసరా పండుగనేమో మూడు రోజులాచరించి
స్వామిమూట తలను ఎత్తి పవిత్రంగ పూజించి
పాట పాడి,నాట్యమాడి నైవేద్యం సమర్పించి
తర తరాల పండుగలు ఆపకుండ పాటించే
ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు
నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు
No comments