Breaking News

శివరాయ శివరాయ నీకు దండము-Superb Chatrapati Shivaji Song in telugu


రచన - హనుమత్ ప్రసాద్ గారు
గానం - అప్పాల ప్రసాద్ గారు
సంగీతం - రాజా
శివరాయ శివరాయ నీకు దండము
శివమెత్తి ఆడెదము మేమందరం !! శివరాయ!!
1. జీజామాత నీకు కథ లెన్నో చెప్పెనంట 
రామాయణ భారతాల నీతులు పలికించెనంట 
వీరమాత అయ్యి నిన్ను వీరునిగా మలచెనంట
దాదాజీ ఖొండ దేవ్ అండ నీకు బలమంట!! శివరాయ!!
2. విదేశీయ ప్రభువు వద్ద తండ్రి కొలువున్నగాని
స్వదేశీయ స్వాతంత్య్రం సాధించగ నెంచినావు 
పదమూడేళ్ల ప్రాయం లో కత్తి చేతిన పట్టి
కదం త్రొక్కి పదం పాడి తోరణమును గెల్చినావు
!!శివరాయ!!
3. అడవుల్లో తిరిగినావు కొండలెన్నొ ఎక్కినావు 
మావళీల సావాసం మంచిగాను చేసినావు 
కొండ పిండి చేయునట్టి వీరులుగా మలచినావు
శత్రుగుండె చీల్చునట్టి రోషంబును నింపినావు!!శివరాయ!!
4. విదేశీయ విద్రోహుల విచ్చుకత్తి నెరజేసి 
విసుగు విశ్రాంతి వీడి యుద్దాలే జేసినావు
హిందువులను కాచి హిందు సామ్రాజ్యం స్థాపించి
రాజ్యమంత గురువు రామదాసునకే ఒసగినావు !!శివరాయ!!

1 comment: