Breaking News

శ్రీ కూర్మ జయంతి-Sri Kurma Avataram


జూన్‌ 13న జయంతి సందర్భంగా

శ్రీ మహావిష్ణువు  దశావతారములలో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మము అనగా తాబేలు. దేవదానవులు అమృతం కోసం  పాలసముద్రాన్ని మధించటానికి మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుందామనికుంటే అది సముద్రంలో మునిగిపోయింది. దానితో శ్రీ మహావిష్ణువు కూర్మావతారములో దానిని భరిస్తాడు. 
దేవతల దానవులు సముద్ర మధనాన్ని కొనసాగించి అమృతాన్ని సాధించారు.  శ్రీ మహా విష్ణువు లక్ష యోజనుల విస్తీర్ణము, జంభూ ద్వీపమంతటి వెడల్పుగల వీపు ఉన్న తాబేలుగా అవతరించి మందర పర్వతాన్ని ఎత్తి నిలబెట్టాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమినాడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ఎత్తిన రోజు కనుక కూర్మ జయంతిని జరుపు కుంటాము. ఈ రోజున శ్రీ కూర్మనాథుడిని ప్రార్ధించటం వలన కష్టాల నుంచి బయటపడి సుఖశాంతులను పొందగలరు. జయదేవుని సోత్రంలో కూర్మావతార వర్ణన..

క్షితిరతి విపులతరే తవ తిష్టతి సృష్టే

ధరణి ధరణి కిణ చక్ర గరిష్ఠే

కేశవ! ధృత కచ్ఛప రూప !

జయ జగదీశ హరే!


ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ''శ్రీ కూర్మం'' అనే పుణ్య క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో దర్శనమిస్తారు. కూర్మవతారం మందిరం దేశములో ఇదొక్కటే అని చెబుతారు.
మూలం - లోకహితం

1 comment:

  1. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ''శ్రీ కూర్మం'' అనే పుణ్య క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో దర్శనమిస్తారు. కూర్మవతారం మందిరం దేశములో ఇదొక్కటే అని చెబుతారు.

    ReplyDelete