Breaking News

చట్టసభలో మహిళా సభ్యులు-Record 71 women MPs in new Lok Sabha


కొత్త లోకసభలో మహిళా సభ్యుల సంఖ్య 71. వారిలో తొలిసారిగా ఎన్నికైన వారు 46 మంది. పార్టీలవారీగా చూస్తే-

భాజపా-20


బిజూజనతాదళ్‌-6

కాంగ్రెస్‌-4

వైఎస్‌ఆర్‌సిపి-4

డిఎంకె-2

స్వంత్రులు -2

జెడియు-1

ఎల్‌టిపి-1

బిఎస్‌పి-1

తృణముల్‌-4

కొందరు సభ్యుల ప్రత్యేకతలు  చూద్దాం.

సునీతా దుగ్గల్‌ : మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారిణి అయిన సునీత హర్యానాలోని సిర్సా లోకసభ స్థానం నుండి 3,00,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. హర్యానా రాష్ట్రం నుండి లోకసభకు ఎన్నికైన ఏకైక మహిళ.

రాణి ఓజా: 67 సంవత్సరాల రాణిఓజా గుహవాటి లోకసభ స్థానం నుండి గెలిచారు. గత 6 సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌ నుండి వచ్చే అక్రమ వలసలకు వ్యతిరేకంగా అలుపెరుగని ఉద్యమం చేస్తున్నారు.

సాద్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ : భోపాల్‌ లోకసభ స్థానం నుండి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌సింగ్‌పై 3,64,000 కు పైగా మెజారిటీతో గెలుపొందారు. మాలేగాఁవ్‌ పేలుళ్ళ కేసులో ఆమెను అక్రమంగా నిర్బంధించి, కేసులు పెట్టినా కూడా జంకకుండా ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించింది.

హిమాద్రిసింగ్‌ : మధ్యప్రదేశ్‌లోని పాడోల్‌ లోకసభ స్థానం నుండి పోటీచేసి హిమాద్రిసింగ్‌ 4,03,000కు పైగా మెజారిటీతో గెలుపొందింది.

లాకెట్‌ ఛటర్జీ : పశ్చిమ బెంగాల్‌ హుగ్లీ లోకసభాస్థానం నుండి గెలుపొందిన లాకెట్‌ ఛటర్జీ ప్రముఖ బెంగాల్‌ నటి, శాస్త్రీయ నృత్య కళాకారిణి.

రేణుకాసింగ్‌ సరూటా : ఛత్తీస్‌గడ్‌లోని సర్గూజి లోక్‌ సభ స్థానం నుండి ఎన్నికైన రేణుకాసింగ్‌ గిరిజన మహిళ. తొలిసారి ఎన్నికైనప్పటికీ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా నియమతులైనారు.

సుమలత అంబరీష్‌ : కర్ణాటకలోని మాండ్య లోక సభస్థానం నుండి ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్‌పై గెలుపొందారు. కర్ణాటక నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన తొలి మహిళ.

చంద్రాణి ముర్ము : ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన చంద్రాణి ఒడిషాలోని కియోంఝర్‌ లోకసభా స్థానం నుండి గెలుపొందారు. 25 సంవత్సరాల చంద్రాణి లోకసభకు ఎన్నికైన వారిలో అతి పిన్న వయస్కురాలు.

దేబశ్రీ చౌధురి : పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్‌ నుండి ఎన్నికైన దేబశ్రీ చౌధురి కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ సహయమంత్రిగా నియమితులైనారు.


 - పద్మ
మూలం-లోకహితం.

1 comment:

  1. చట్టసభలో మహిళా సభ్యులు-Record 71 women MPs in new Lok Sabha

    ReplyDelete