Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 31 / 50


1971 అక్టోబర్ 7,8 తేదీలలో కర్ణాటక ప్రాంతస్థాయిలో శిక్షకులు ఆపై స్థాయి వారికి బెంగళూరులో శిబిరం జరిగింది. చివరిరోజున కొంతమంది పత్రికా విలేకరులు శ్రీ గురూజీని కలిశారు. అందులో కొన్ని ప్రశ్నోత్తరాలు ఇలా ఉన్నాయి:

పాకిస్తాన్ ను లేకుండా చేస్తే ప్రపంచంలోని ఇతర దేశాలు మౌనంగా ఉంటాయా? అన్న ప్రశ్నకు ' ప్రపంచం ఒక అతి విచిత్రప్రాణి లాంటిది. ఏదో ఒక పనిని మనం చేసి ముగించాక, దాన్ని ఎదిరిస్తే అది అపుడు గంటు ముఖం వేసుకుని ఒప్పుకుంటుంది' అన్నారు శ్రీ గురూజీ. 
భారత్ కు వ్యతిరేకంగా వేయి సంవత్సరాలు పోరాడుతామని భుట్టో అనడం గురించి అడిగిన ప్రశ్నకు ' గతంలోని లెక్కల ఆధారంగా ( With retrospective effect) ఆయన చెప్పింది సరిగానే ఉంది' అన్నారాయన.
పాక్ నియంత యాహ్యాఖాన్ ' ఇది భారత్ తో అంతిమ యుద్ధం ' అని ప్రకటించడం పట్ల అడిగిన ప్రశ్నకు ' నిజమే. పాకిస్తాన్ ను పూర్తిగా లేకుండా చేస్తే ఆయన మాట నిజమవుతుంది' అన్నారు శ్రీ గురూజీ.
                                                                      - బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete