Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 30 / 50



కర్ణాటక ప్రాంత సంఘచాలక్ అయిన శ్రీ అప్పాసాహెబ్ జిగజిన్ని కుటుంబంతో శ్రీ గురూజీకి చాలా సన్నిహిత సంబంధం ఉండేది. ఒకసారి అప్పాసాహెబ్ గారు శ్రీ గురూజీకి వ్రాసిన ఉత్తరంలో తమ కుటుంబంలోని కొన్ని సంగతులను తెలుపుతూ ' ఒక ఆనందకర వార్త. ' నా కొడుకు బసవరాజుకు కొడుకు పుట్టాడు. మరొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే అదే రోజున మా యమునాబాయి ( బర్రె) కు దున్నపోతు పుట్టింది ' అని వ్రాశారు. ఆ ఉత్తరానికి శ్రీ గురూజీ ప్రత్యుత్తరమిస్తూ ' విషయాలు తెలిసి చాలా ఆనందమేసింది. అయితే రెండవ బాలుడికి కూడా మీ ఆస్తిలో భాగం ఇవ్వడంలో తప్పు లేదని నమ్ముతున్నాను ' అని చేర్చారు. 
ప్రాంత సంఘచాలక్ కు సరసంఘచాలకుల వద్ద తమ ఇంటి బర్రె, దూడకు జన్మనిచ్చిన సమాచారమూ తెలపగలిగినంత ఆత్మీయత ఉంటే, దాన్ని నిండు మనసుతో స్వీకరించి ప్రతిస్పందించేంత పెద్దరికం సరసంఘచాలక్ లోనూ ఉండింది.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete