Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 29 / 50


1956 ఫిబ్రవరి 3 న శ్రీ గురూజీ బెంగుళూరు వచ్చారు. ఫిబ్రవరి 5న జిల్లాస్థాయి కార్యకర్తల బైఠక్ గవిపురంలో జరిగింది. సుమారు గంటన్నర సేపు జరిగిన బైఠక్ లో శ్రీ గురూజీ , అక్కడున్న కార్యకర్తలను అడిగిన ప్రశ్నలు : మీ ఊరిలో శాఖ ఉందా? శాఖలో ప్రార్థన జరుగుతుందా? ప్రతిరోజూ శాఖలో సూర్యనమస్కారాలు చేస్తారా? సూర్యనమస్కారాలలో మొదటి మంత్రం... రెండవ మంత్రం...? ప్రార్థనలో మొదటి పంక్తి... మూడవ పంక్తి... ప్రార్థన అర్థం తెలుసా? లాంటివే. జిల్లాస్థాయి కార్యకర్తలను ఆయన అడిగిన ప్రశ్నలు శాఖకు సంబంధించినవి మాత్రమే. అంటే ప్రాముఖ్యత ఉన్నది కేవలం శాఖా పనికే. అందులోనూ కార్యపద్ధతిలోని చిన్నచిన్న విషయాలకూ చాలా ప్రాధాన్యత ఉంది. అవేవీ నిర్లక్ష్యానికి గురికారాదు అనేదే శ్రీ గురూజీ మనసులో భావన.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete