Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 28 / 50


1966 లో పర్యటనలో భాగంగా శ్రీ గురూజీ బిజాపుర వచ్చారు. ఆయనకు శ్రీ ఆళ్ బాళ్ గారింట్లో వసతి ఏర్పాటైంది. వారింటికి సమీపంలోని ప్రాథమిక పాఠశాలలో ఆళ్ బాళ్ గారి సోదరి రమాబాయి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తమ పాఠశాలకు శ్రీ గురూజీ ని తీసుకెళ్ళాలని ఆమెకు ఆలోచన తట్టింది. విభాగ్ ప్రచారక్ ను అడగ్గా కార్యక్రమాల ఒత్తిడి వల్ల సాధ్యం కాదని చెప్పారాయన. దాంతో ఆమె నేరుగా శ్రీ గురూజీతో తన కోరిక వెల్లడించి, ఆయనను పాఠశాలకు తీసుకెళ్ళింది. పాఠశాలలో చిన్నపిల్లలు ఆయన ముందు ఒక నాట్యప్రదర్శన చేశారు. చివరలో అందరూ కలసి ఒక మరాఠీ పాట " కోణ ఆవడే ఆధిక తులా, సాంగమలా రే సాంగమలా " ( నీకు ఎక్కువ ఇష్టమైన వారెవరు, ఆ విషయం నాకు చెప్పు) అనేది పాడారు. అందులో ఒక విద్యార్థి ' నాకు తల్లి అంటే ఇష్టం' అనగా, మరో విద్యార్థి ' నాకు తండ్రి అంటే ఇష్టం ' అంటాడు. ఆ పాట ఇంకా పాడుతుండగానే శ్రీ గురూజీ దాన్ని ఆపేయించారు. ఉపాధ్యాయురాలి వైపు తిరిగి ఇలాంటి పాటలను పిల్లల్తో పాడించరాదు. పిల్లలకు తమ తల్లి, తండ్రి మీద తేడా చూపించే సంస్కారం కల్గించే ,అలాంటి పాట ద్వారా ఉపయోగం ఏమిటి? అనడిగారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు

    ReplyDelete