Friday, December 1, 2017

నిన్నటి వ్యాసం లో రోజూ జరిగే పని కార్యకర్తల బృందం వ్రాసాను. పర్య టన చేసే వారి సంగతి వ్రాయలేదు. మా ప్రాంతం లో శనివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం ఆఫీస్ కి చేరుకునే వారిని నేను చూసాను. మాననీయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు యూనివర్సిటీ నుండే రైల్వే స్టేషన్ కి వెళ్లిన ఘటనలు ఎన్నో. నరసారావు పేట పార్థ సారధి గారు గుంటూరులో 12 గంటల దొంగల బండికి(రైలు) ఎక్కించిన రోజులు గుర్తున్నాయి. బండారు సదాశివ రావు గారు ఏ పండుగకూ ఇంట్లో ఉండేవారు కాదు. ఒక మల్లారెడ్డిగారు, రేవా కోటేశ్వరరావుగారు ఎలా సెలవులన్నీ సంఘ పనిలోనే గడిపేవారో మా కళ్ళతో చూసాము. ఇలా ప్రతీ ఒక్కరికీ అనుభవాలు ఉంటాయి. రోజులు నెలలు కాదు ఇలా జీవితాంతమ్ పని చెసిన వారిని నేను చూసాను. విశాఖ పిల్లా రామారావుగారు, శివ ప్రసాద్ గారు ప్రచారకులతో పోటీగా తిరిగే వారు. ఈ ఉదాహరణలు ప్రతీ తాలూకా,జిల్లా, విభాగ్, ప్రాంత అధికారులు సజీవ స్రవంతి సంఘ గంగ తో ప్రవహించాయి. రెండు మూడు రోజుల పర్యటనలో వాళ్లే బట్టలుతుక్కోవడం నేను చూసాను. ఒకసారి మాననీయ దత్తోపంత్ థెగ్డే ఆరిన పంచె నేను తీస్తుంటే, వారు వచ్చి this is my property you should not touch it అని నవ్వుతూ నా దగ్గర లాక్కుని, నవ్వుతూ వారే మడత పెట్టుకున్న సంఘటన నా కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది

ఋషులను మనం వారిలోనే చూసు కుంటాము.


ఇవి కాకుండా సమావేశాల వ్యవస్థలో , వర్గల్లో ఎంత మంది ప్రబంధకులు రోజులు నెలలు పని చేసేవారు. శిక్షా వర్గాల్లో క్రమం తప్పకుండా పని చేసే వారు 20 - 25 రోజులు ఉండేవారికి సంఘం తృప్తిని మాత్రమే ఇచ్చింది.
ప్రచారకులు కొన్ని సంవత్సరాలు, జీవితం అంతా స్వచ్చందంగా పని చేస్తుంటారు. వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ఆ సమర్పిత జీవితాలకు సంఘ సంస్థాపకులు, అంకితమై పని చేసి వెళ్లి పోయిన మన పూర్వ ప్రచారకులు జీవిత సమర్పణ ఆదర్శం. తమ జీవితాలు తల్లి భారతి పడ సన్నిధిలో సమర్పితమైన సుమాలుగా మనం చూస్తుంటాం.
కొందరు సంఘ విస్తరణకు 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం తమ సమయం ఇల్లు వదిలి వేరే వేరే ఊర్లలో ఉంటూ పని చేస్తారు. ఇది ప్రతీ సంవత్సరం జరిగే ప్రక్రియ.
ఇవి కాకుండా మనం నిర్వహించే అనేక ప్రాజెక్టులు నిర్వహించే పనిలో సమయం ఇచ్చే వారు కూడా స్వచ్చందంగా పని చేస్తుంటారు.
సంఘ ప్రేరణ తో జరిగే వివిధ క్షేత్రాల్లో కూడా ఇటువంటి సమర్పణా భావం తో పని చేసే వారు ఇంకా ఎన్ని లక్షల్లో. 
సమాజానికి స్వచ్చందంగా సమయం, ఇస్తూ తనువు, మనసు, ధనాన్ని సమర్పణ చేసే స్వయంసేవకుల తాము కష్టపడుతున్నామని, త్యాగాలు చేస్తున్నామని అనుకోరు. మా జన్మ ధన్యమయ్యింది అనుకుంటారు. మనస్సులో పూజనీయ డాక్టర్జీ జీవితం గుర్తు చేసుకుంటూ...

అమూర్త మూర్త మూర్తి మంత 
నీ వలే మేమగుదుమయ్యా.. అంటూ జీవన లక్ష్యం గుర్తు చేసుకుంటారు.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. సమాజానికి స్వచ్చందంగా సమయం, ఇస్తూ తనువు, మనసు, ధనాన్ని సమర్పణ చేసే స్వయంసేవకుల తాము కష్టపడుతున్నామని, త్యాగాలు చేస్తున్నామని అనుకోరు. మా జన్మ ధన్యమయ్యింది అనుకుంటారు. మనస్సులో పూజనీయ డాక్టర్జీ జీవితం గుర్తు చేసుకుంటూ.

    ReplyDelete

శిక్షణా తరగతులు

యువ నిర్మాణ్

యువ నిర్మాణ్
రేపటితరం నాయకులు

భారతీయ విజ్ఞానవేత్తలు

స్వాతంత్ర్యోద్యమంలో తెలుగు రత్నాలు

Followers

Trending this Week

Follow us on Facebook