Breaking News

సదాశివ రావు గారు గుంటూరు లో

ఒక నగరసాంఘిక్ లో మాననీయ మోఘే జి, అప్పటి ఆంధ్ర ప్రాంత ప్రచారక్ మాట్లా డాల్సి ఉంది. ఊర్లో కష్టపడి మంచిసంఖ్య ప్రయత్నం చేశారు. ప్రాంత ప్రచారక్ వస్తున్నారు. వారు సంఘ ఆలోచనను ప్రజలలో బాగా చెప్పగలరు, కాబట్టి అనేక మంది పెద్దలను పిలిచారు.
కార్యక్రమానికి ఒక కొత్త ముఖ్య అదితి ని పిలిచారు. కొంత సేపు దండ ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథి మాట్లాడడం ప్రారంభం చేసి , ఈ కర్రలు తిప్పితే శత్రువుని ఎదుర్కొన గలరా? వాడి బులెట్ ని నీ కర్ర ఆపగలదా? అంటూ చులకన చేసి మాట్లాడేశారు. మోఘే జి సదాశివ రావు గారిని మాట్లాడాల్సిందిగా సూచించారు. అప్పటికప్పుడు జరిగిన మార్పు. సదాశివ రావుగారు మైక్ ముందుకు వచ్చారు.
ఆదరణీయ ముఖ్య్ అతిధి చాలా కాలం గా సంఘ పరిచయం చేయిద్దామన ప్రయత్నిస్తున్నాము. వారు రావటం మా అదృష్టం. వారు చెప్పిన విషయం బాగుంది. అంత కంటే ముందుగా సింధు ప్రాంతం లో దేశ విభజన సమయం లో జరిగిన సంఘటన చెబుతాను. వార్తా పత్రికలలో వచ్చింది. ఒక దేవీడీ మీద ఒక సేట్ తుపాకీ పట్టుకొని ఉన్నాడు. గుంపు దాడికి కి వచ్చింది. వాళ్ళు20 ఫీట్ కింద నుండి కత్తిఝలిపిస్తూ తుపాకీ కిందపడెయి. లేకపోతే కత్తి విసిరితే తల తెగిపడుతుంది అని అరిచారు. వాడు తుపాకి భయం తో వదిలేసాడు. తరువాత్త గుంపు దాడి లో. వాడు మరణించాడు. తుపాకీ చేతిలో ఉన్నా, ధైర్యం లేని వాడు ఉపయోగించలేడు. కర్ర సాము నేర్పేది ఆ ధైర్యం కోసమే.
ముఖ అతిధి గారు చెప్పింది నిజమే. బుల్లెట్ ని కర్ర తో వెనక్కి కొట్టలేము. కానీ బుల్లెట్ని బులెట్ తో కూడా కొట్టలేము. ఈ విషయం మన ముఖ్య అతిథి కి సవినయంగా తెలియ జేసుకుంటున్నాము. అని ముగించార్రి.
మోగేజి తరువాత భేష్ అన్నారట.
- నరసింహ మూర్తి.

1 comment:

  1. కార్యక్రమానికి ఒక కొత్త ముఖ్య అదితి ని పిలిచారు. కొంత సేపు దండ ప్రదర్శన జరిగింది. ముఖ్య అతిథి మాట్లాడడం ప్రారంభం చేసి , ఈ కర్రలు తిప్పితే శత్రువుని ఎదుర్కొన గలరా? వాడి బులెట్ ని నీ కర్ర ఆపగలదా? అంటూ చులకన చేసి మాట్లాడేశారు. మోఘే జి సదాశివ రావు గారిని మాట్లాడాల్సిందిగా సూచించారు. అప్పటికప్పుడు జరిగిన మార్పు. సదాశివ రావుగారు మైక్ ముందుకు వచ్చారు.

    ReplyDelete