Breaking News

అంబేద్కర్ కారణంగా నేటి యువ తరానికి 'దేశమంటే- యావత్తూ భారతదేశం' అని అర్థం అవుతుంది


అంబేద్కర్ కారణంగా నేటి యువ తరానికి 'దేశమంటే- యావత్తూ భారతదేశం' అని అర్థం అవుతుంది. రాజ్యాంగం ద్వారా ప్రభుత్వాల కి చాలా అధికారాలు ఇచ్చారు. కేంద్రానికి ఎక్కువ విచక్షణాధికారాలు ఇచ్చారు. ఎందుకు? సార్వభౌమ అధికారం ఇచ్చి , ఒకే పౌరసత్వం ఇచ్చి భారతదేశం విడివడని ఒకే దేశం అనే కల్పన ను (The idea of India) ఇచ్చి తన దూరదృష్టి ని ప్రదర్శించి,జాగ్రత్తలు తీసుకున్న అంబేద్కర్ ని మనం అభినందించాలి. 'అధికారం ఇవ్వడం సులభమే..కాని వివేకం ఇవ్వడం సాధ్యమా?" అంటారు అంబేద్కర్. కేంద్రం బలహీనమైనప్పుడల్లా, దేశం విదేశీ ఆక్రమణలకు గురైందని గుర్తించిన వారు, స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా కేంద్రం వివేకాన్ని ప్రదర్శించాలని గౌరవ పూర్వకంగా, అభిమానం గా భావిస్తున్నట్లు అంబేద్కర్ రాజ్యాంగ సభలో పేర్కొన్నారు. భారతదేశాన్ని విభజించాలని కోరిన అప్పటి ముస్లిం లీగ్ కి వ్యతిరేకంగా అఖండ భారతమే మెరుగైనదని నేను భావిస్తున్నానని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. ఈనాడు మనం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వేర్వేరు శిబిరాలు నడిపిస్తున్నామని నేను ఒప్పుకుంటాను.అయితే మన 'ఈ దేశం ఒకటి కాకుండా ' ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని గట్టిగా చెప్పిన దేశ భక్తుడు అంబేద్కర్.(1946 డిసెంబరు 19న రాజ్యాంగ సభలో మాట్లాడింది).
                                                                                  - అప్పాల ప్రసాద్.

1 comment:

  1. ఒకే పౌరసత్వం ఇచ్చి భారతదేశం విడివడని ఒకే దేశం అనే కల్పన ను (The idea of India) ఇచ్చి తన దూరదృష్టి ని ప్రదర్శించి,జాగ్రత్తలు తీసుకున్న అంబేద్కర్ ని మనం అభినందించాలి.

    ReplyDelete