Breaking News

డిసెంబర్ 6 న డా.బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి

డిసెంబర్ 6 న డా.బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి ఆలోచనలకు విలువనిచ్చి, వారి ఆలోచనా విధానంలో నడుద్దాం. 

భౌగోళికంగా మనం ఒక దగ్గర చేరి ఉన్నంత మాత్రాన, దాదాపు ఒకే విధమైన ఆచారాలు వున్నంత మాత్రాన, మన దేశం ఏర్పడలేదు. అంతకంటే మించి దేశానికి ప్రాణం ఐన ఏకాత్మత అంటే మనమంతా ఒకే ప్రజ,ఒకే దేశం అనే భావన వల్ల దేశంగా ఏర్పడ్డామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అయన అందించిన రాజ్యాంగం ఇదే అందిస్తుంది. అది బలపడాలంటే సోదర భావం పంచాలి.ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంచాలి. సామాజిక న్యాయం అనే గట్టి నేలను తయారు చేయాలి. దానిపైన శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు కలలు కన్నారు. మన దేశంలో వివిధ కులాలు, అంతకంటే మించిన వైవిధ్యం ఉన్నంత మాత్రాన విభేదాలకు,విభజనకు పాల్పడవద్దని వారు కోరుకున్నారు.
- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. సామాజిక న్యాయం అనే గట్టి నేలను తయారు చేయాలి. దానిపైన శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు కలలు కన్నారు.

    ReplyDelete