Breaking News

RSS లో వివిధ వ్యవస్థలలో ప్రచారక్


రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఒక స్వచ్చంద సంఘటనాత్మక, సర్వతోముఖ సేవాసంస్థ. ఈ సంస్థ ఈ రాష్ట్రీయుల్లో దేశ కార్యాన్ని కూడా తమ స్వంత కార్యమనే భావాలు పెంచింది. జాతీయతా దృక్పథం తో దేశమంతా విస్తరించాలనే గొప్ప లక్ష్యం ఉన్న, ఆర్థికంగా సామాన్య మైన వ్యక్తులే కలిసి నిర్ణయించి సాధించారు.

ప్రారంభం లో విస్తరణ కొరకు విద్యార్థులు దూర ప్రాంతాల చదువుల కోసం వెళ్లారు. 1940 నాటికే సంఘం అఖిల భారత సంస్థ గా తయారయ్యింది. ముస్లీమ్స్ మాకు వేరే దేశం అనే విభజన వాదం మొదలయ్యింది. వాళ్ళను కలుపు కోవడం కోసం గాంధీజీ ఒక్కో మెట్టు దిగుతూ వెళ్లారు. ముస్లిం లీగ్ ఆవిర్భావం. అంతా ఈ దేశ వెన్నెముకను విరగ్గొట్టే వాతావరణం.
ఈ సమయం లో పూజనీయ గురూజీ ప్రచారక్ వ్యవస్థ కి పిలుపునిచ్చారు. చదువు పూర్తి చేసుకున్న యువకులు సంఘాన్ని విస్తరింప చేయడానికి తమ పూర్తి సమయం స్వచ్చందంగా ఇచ్చి సంఘ ఆదేశించిన చోటకు వెళ్లి తమ శక్తి, యుక్తులను తల్లి భారతికి సమర్పణ చేసి అక్కడే నివాసం విద్యార్థుల ఇళ్ళల్లోకాని, సంఘ కుటుంబాలతో కాని, కొన్ని చోట్ల కార్యాలయాలలో కాని, ఏదీ దొరక్కపోతే దేవాలయాల్లో కాని ఉండి, వాళ్ళ భాష కాని చోట, పరిచయాలు లేని చోట్ల ఉండి, సంఘ శాఖలు పెంచాలి. భోజనాలు పరిచయస్థుల ఇళ్ళల్లో, స్వయంసేవకుల ఇళ్ళల్లో పూర్తి చేసుకోవాలి.
ప్రారంభం లో చాలా కష్టాలు ఉండేవి. తమిళనాడులో ఒక ప్రచారక్ ని తాళ్లతో కట్టేసి బస్సులో పడేసి వెనక్కి పంపారు. మళ్ళీ అక్కడికే వెళ్లి సంఘ శాఖలు ప్రారంభం చేశారు.
దీనికి తోడు గాంధీజీ హత్యను సంఘమ్ పై వేసి దేశమంతా సంఘ వ్యతిరేక వాతావరణం నిర్మాణం చేసారు. ఇంగ్లిష్ ప్రభుత్వం కాదు. మన స్వతంత్ర భారత ప్రభుత్వమే. అప్పుడేలా తట్టుకొని ఉండవచ్చు? మన భండారు సదాశివ రావు గారు వరంగల్ నుండి వెళ్లి విజయనగరం లో పని చేసే వారు. అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు పంపించారు. వారి అన్నగారు ఉత్తరం వ్రాస్తూ ' ఒరే హాంతకా' అని సంబోధిస్తూ ఉత్తరం వ్రాసారంటే సమాజం సంఘ కార్యకర్త లను ఎలా చూసిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ వాతావరణం లో సంఘం నిలబెట్టు కోవాలి అని స్వయంసేవకులు ఎంత నిష్ఠ తో నిలబడ్డారో! వారికి స్ఫూర్తి సంఘ ప్రచారకులు. మాననీయ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నవ్వుతూ నా లాంటి వాడిని, (వారికంటే 25 సంవత్సరాలు చిన్నవాడ నీ, సంఘాన్ని వారినుండి నేర్చుకున్న వాడిని, మీరే మా మార్గదర్శలు కదయ్యా? అన్నారంటే సంఘం ప్రచారకులకు ఎలాంటి స్థానం ఇచ్చిందో! స్వయంసేవకులు ఎంత ఆత్మీయంగా చూసుకున్నారో! జగమంతా కుటుంబం నాది అంటూ డిగ్రీ ,పీజి, లా, డాక్టరీ చదువుకుని వచ్చిన వారు కొంతమంది కొన్ని సంవత్సరాలు, కొంత మంది జీవితమంతా తల్లి పాదాల దగ్గర సమర్పణ చేశారు.
నమస్సులతో మీ మూర్తి. 
మీ స్పందన వ్రాయండి.

1 comment:

  1. ఈ సంస్థ ఈ రాష్ట్రీయుల్లో దేశ కార్యాన్ని కూడా తమ స్వంత కార్యమనే భావాలు పెంచింది. జాతీయతా దృక్పథం తో దేశమంతా విస్తరించాలనే గొప్ప లక్ష్యం ఉన్న, ఆర్థికంగా సామాన్య మైన వ్యక్తులే కలిసి నిర్ణయించి సాధించారు.

    ReplyDelete