Breaking News

పూజనీయ గురూజీ ఆదర్శ అడుగులు


పూజనీయ గురూజీ 1940 నుండి 1973 వరకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ గా సంఘ కార్య మార్గ దర్శనం చేశారు. గాంధీజి హాత్య సంఘం పై నిషేధం, జైలు కెళ్లడం జరిగింది. దీని వెనుక సంఘాన్ని నాశనం చేయడానికి ఆ ఆరోపణ జరిగింది అని తదనంతర పరిణామాలు తెలిపాయి.
33 సంవత్సరాల కాలం దేశం లో 66 సార్లు పరిభ్రమించిన గురుజిని ఒక ఇంగ్లిష్ పత్రిక కలిసి, నెహ్రు గూర్చి వారి అభిప్రాయం చెప్పమంటే, వారు ఇంగ్లాండ్ నుండి అని తెలిసాక, నెహ్రు మొత్తం దేశానికి ప్రధమ ప్రధాని. మాకు కూడా కదా! మేము మాట్లాడుకుంటాము. మీతో చెప్పడానికి ఏమీ లేవు అని చెప్పారు. విదేశాల వారితో ఎలా వ్యవహరించాలో మార్గదర్శనం చేశారు.
పరస్పర విరోధేతు వయంపంచచతేశతం,
అన్యఐస్సహా విరోధేతు వయం పంచాధిక శతం .
(ధర్మరాజు అరణ్య పర్వం లో సోదరులతో దుర్యోధనుడిని గంధర్వులనుంచి రక్షించాలని, చెబుతూ..
పరస్పరం విరోధమప్పుడు మనం ఐదుగురం, వారు వంద మంది. వేరేవాడితో విరోధం వస్తే మనం 105 మంది అని చెప్పారు.)

అని చెప్పిన ధర్మ రాజు మాటను ఆచరించాలని వారు ఆచరించి చూపారు.
ఇప్పుడే విన్న వార్త మన రాహుల్ గాంధీ అమెరికా లో ప్రధాని మోడీ వాళ్ళ దేశం విభజన వాదం పెంచుతున్నాడని ఆరోపించారట. మన శాస్త్రాల నుండి నీతి నేర్చుకోక పోతే ఇంతే.
నమస్కారం.
మీ నరసింహ మూర్తి.

1 comment:

  1. గాంధీజి హాత్య సంఘం పై నిషేధం, జైలు కెళ్లడం జరిగింది. దీని వెనుక సంఘాన్ని నాశనం చేయడానికి ఆ ఆరోపణ జరిగింది అని తదనంతర పరిణామాలు తెలిపాయి.

    ReplyDelete